శ్రీ మదగ్ని మహాపురాణము - 39 / Agni Maha Purana - 39


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 39 / Agni Maha Purana - 39 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 14

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. మహాభారత వాఖ్యానము - 2 🌻


దుర్యోధనుడు శోకార్తు డయ్యెను అపుడు ద్రోణుడు సేనాధిపత్యము వహించెను. సంతసించిన పాండవ సైన్యమున దృష్టద్యుమ్నుడు సేనాపతి అయ్యెను.

వారిరువురికిని యముని రాష్ట్రమును పెంచు యుద్ధము జరిగెను. ద్రోణుడను మహాసముద్రమునందు విరాట ద్రువదాదులు మునిగిపోయిరి. హస్త్యశ్వరథవదాతులు గల దుర్యోధనసేన కూడ పాండవసేనాపతియైన దృష్ఠద్యుమ్ముని చేత (చంపబడెను). ద్రోణుడు యుద్దమునందు యముడు వలె కన్పట్టెను. అశ్వత్థామ మరణించెను. అను మాట విని ద్రోణుడు ఆయుధములను విసర్జించెను. ఎదిరింప శక్యము కాని అతడు సర్వక్షత్రియులను సంహరించి ఐదవ దివసమున ధృష్టద్యుమ్నుని బాణములచే కొట్టబడి మరణించెను.

దుర్యధనుడు శోకార్తుడయ్యెను. అపుడు కర్ణుడు సేనాపతి ఆయెను. అర్జునుడు పాండవుల సేనాపతి ఆయెను వారిరువురును శస్త్రములతో ఒకరి నొకరు కొట్టుకొనగా భయంకరమైన, దేవాసురయుద్ధతుల్య మగు యుద్ధము జరిగెను. కర్ణార్జునసంగ్రామమునందు కర్ణుడు బాణములతో శత్రువులను సంహరించెను. రెండవ రోజున కర్ణుని అర్జునుడు సంహరించెను. శల్యుడు సేనాధిపత్యమును వహించి అర్ద దివనము యుద్దము చేసెను. యుధిష్ఠిరు డాతనిని సంహరించెను. సైన్యము నశించగా సుయోధనుడు భీమసేనునితో యుద్ధము చేసెను. చాలమంది సైనికులు మొదలగు వారిని చంపి అతడు భీమసేనుని మీదకు వెళ్ళెను. భీమసేనుడు గదతో యుద్ధము చేయుచున్న ఆతనిని ఆతని తమ్ములను పదు నెనిమిదవ దినమున పడగొట్టెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana -39 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

Chapter 14

🌻 Story of the Mahābhārata - 2 🌻


11. As Duryodhana was grief-stricken, Droṇa became the Commander. As the army of Pāṇḍavas was jubilant, Dhṛṣṭadyumna (was made) the Commander.

12. There was a fierce battle between the two which made the domain of Yama (the god of death) extensive. Virāṭa, Drupada and others were drowned in the ocean of (arrows of) Droṇa.

13. The huge army of Duryodhana (consisted of) elephant, horse, chariot and infantry. Droṇa became just like Kāla (death himself) for the (army) headed by Dhṛṣṭadyumna.

14- 15. When it was proclaimed that Aśvatthāman was killed, Droṇa abandoned his astras. Overcome by the arrow of Dhṛṣṭadyumna he fell on the earth on the fifth day, (himself being) unassailable and after having killed many warriors. As Duryodhana was grief-stricken, Karṇa became the commander.

16. And Arjuna (became the commander) of the Pāṇḍava forces. There was combat between them, between weapons and weapons, very fierce and resembling a war between devas and asuras.

17. In the war known as the Karṇārjuna, Karṇa killed the enemies with his arrows. On the second day, Karṇa was killed by Arjuna.

18. Śalya fought for a day and Yudhiṣṭhira killed him. Suyodhana (Duryodhana), whose army had been destroyed, fought with Bhīmasena.

19. Having killed many men (in their army) (he) challenged Bhīmasena. Bhīmasena killed him, who was attacking with the mace.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


27 Apr 2022

No comments:

Post a Comment