శ్రీ శివ మహా పురాణము - 555 / Sri Siva Maha Purana - 555



🌹 . శ్రీ శివ మహా పురాణము - 555 / Sri Siva Maha Purana - 555 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 52 🌴

🌻. పెండ్లి వారి భోజనములు - 1 🌻


బ్రహ్మఇట్లు పలికెను-

కుమారా! అపుడు మహాభాగ్యవంతుడు, పర్వతరాజు, విద్వాంసుడునగు హిమవంతుడు భోజనము కొరకు ప్రాంగణమును ఏర్పాటు చేసెను (1). ఆయన దానిని తుడిపించి, చక్కగా సుగంధ ద్రవ్యములను చల్లించి, అనేక వస్తువులచే శ్రద్ధగా అలంకరింపజేసెను (2). అపుడు హిమవంతుడు దేవలనందరినీ, ఇతరులను, ఈశ్వరుని, తన కుమారులగు పర్వతుల చేత, మరియు ఇతరులచేత ఆహ్వానింప జేసెను (3). ఓ మునీ! ఆ ప్రభుడు పర్వతుని ఆహ్వానమును విని అచ్యుతునితో గూడి, దేవతలు మొదలగు వారందరితో కలిసి ఆనందముతో ఆచటకు భోజనము కొరకై వెళ్లెను (4).

హిమవంతుడు శివుని ఇతరులనందరిని యథావిధిగా మంచిగా సత్కరించి ఇంటి లోపల మంచి పీటలపై ఆనందముతో కూర్చుండబెట్టెను (5). అనేక మధుర పదార్థములను వడ్డించిన తరువాత ఆయన సమ్మానపూర్వకముగా చేతులు జోడించి భోజనమునకు అనుమతినిచ్చెను (6). అపుడచట సన్మానింపబడిన విష్ణువు మొదలగు దేవతలందరు సదాశివుని ముందిడుకొని భోజనము చేసిరి (7). అపుడు వారందరు ఒకే సారి అంతటా వరుసలో వేర్వేరుగా కూర్చుండి నవ్వుతూ భుజించిరి (8).

మహాత్ములగు నంది, భృంగి, వీర భద్రుడు, వారి గణములు కుతూహలముతో గూడిన వారై వేర్వేరుగా భుజించిరి (9). ఇంద్రాది దేవతలు, మహాత్ములగు లోకపాలకులు వివిధ శోభలతో గూడిన వారై అనేక హాస్యోక్తులను పలుకుతూ భుజించిరి (10). మునులు, విప్రులు, భృగువు మొదలగు ఋషులు అందరు వేర్వేరు పంక్తులలో కూర్చుండి ప్రీతితో భుజించిరి (11). చండీ గణములందరూ కుతూహలమునకు కలిగించువారై అనేక హాస్యవచనములను పలుకుతూ ఆనందముతో పళ్లెరముల యందు భుజించిరి (12).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 555 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 52 🌴

🌻 The bridegroom’s party is fed and Śiva retires to bed - 1 🌻



Brahmā said:—

1. O dear one, then the clever chief of mountains caused suitable arrangements to be made in the courtyard for feeding the visitors.

2. He caused the ground to be swept clean and scrubbed well. Different kinds of fragrant stuffs were used to make the place attractive and pleasing.

3. Then the mountain invited all the gods and others along with the lord for taking food, through his sons and others.

4. O sage, on hearing the invitation of the mountain, the lord accompanied by Viṣṇu, the gods and others went gladly to take His meal.

5. The mountain received the lord and all those duly and made them sit in good seats in the inner apartment.

6. After serving sweet and well-cooked delicious foodstuffs, he requested them to take their food with palms joined in reverence and head bent down.

7. Then duly honoured, Viṣṇu and other gods keeping Sadāśiva at the head took their food.

8. They sat in rows together, took their food simultaneously laughing (and talking).

9. Nandin, Bhṛṅgi, Vīrabhadra and his Gaṇas took their meals separately. The fortunate people took food enthusiastically.

10. The gods, with Indra, the guardians of the quarters all forunate and brilliant took their food cracking jokes and talking.

11. The sages and brahmins, Bhṛgu and other sages sat in separate rows and took their food with pleasure.

12. The Gaṇas of Caṇḍī took their meals and then cracked jokes and talked merrily.


Continues....

🌹🌹🌹🌹🌹



27 Apr 2022

No comments:

Post a Comment