ఓషో రోజువారీ ధ్యానాలు - 168. నిద్రాణస్థితి / Osho Daily Meditations - 168. HIBERNATION



🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 168 / Osho Daily Meditations - 168 🌹

📚. ప్రసాద్ భరద్వాజ్

🍀 168. నిద్రాణస్థితి 🍀

🕉. కొన్నిసార్లు మీరు నిదానంగా, చల్లగా, కొన్నిసార్లు చలాకీగా, వెచ్చగా ఉంటారు. దాన్ని సమస్యగా చేసుకోవద్దు. నిద్రాణస్థతిలో ఉన్నప్పుడు దాని గురించి అపరాధ భావంతో ఉండకండి. 🕉


శరీరం ఇరవై నాలుగు గంటలు వెచ్చగా ఉండాల్సిన అవసరం లేదు. అది అలసిపోతుంది. దానికి కొంచెం విశ్రాంతి కావాలి. మీరు చల్లగా, నిద్రాణంగా ఉన్నప్పుడు, శక్తి లోపలికి కదులుతుంది; మీరు వెచ్చగా, చలాకీగా ఉన్నప్పుడు, శక్తి బయటికి కదులుతుంది. వాస్తవానికి, ఇతర వ్యక్తులు మీరు ఎల్లప్పుడూ వెచ్చగా, చలాకీగా ఉండాలని కోరుకుంటారు, ఎందుకంటే మీ శక్తి వారి వైపు కదులుతుంది. మీరు చల్లగా, నిద్రాణంగా ఉన్నప్పుడు, మీ శక్తి వారి వైపు కదలదు, కాబట్టి వారు మనస్తాపం చెందుతారు. మీరు చల్లగా ఉన్నారని వారు అంటారు. అయితే అది మీరే నిర్ణయించు కోవాలి. మీరు నిద్రాణస్థితిలో ఉన్న ఆ చల్లని క్షణాలలో, మీరు మీ ఉనికిలోకి వెళతారు. అవి ధ్యాన క్షణాలు.

కాబట్టి ఇది నా సూచన - మీకు అలా అనిపించినప్పుడు, బాహ్య సంబంధాల తలుపులు మూసి వేయండి. బయటి వ్యక్తులతో కలిసి ఉండవద్దు. మీరు చల్లగా, నిదానంగా ఉన్నారని అనిపించినప్పుడు, ఇంటికి వెళ్లి ధ్యానం చేయండి. ధ్యానం చేయడానికి అదే సరైన సమయం. శక్తి స్వతహాగా ఆ విధంగా కదులుతున్నప్పుడు, మీరు దానిపై ప్రయాణించవచ్చు. దానితో పాటు మీ జీవి యొక్క అంతర్భాగానికి వెళ్లవచ్చు. పోరాటం ఉండదు. అలాగే మీరు చలాకీగా, వెచ్చగా ఉన్నప్పుడు, బయటకు వెళ్లండి. ఆ సమయంలో ధ్యానం గురించి మర్చిపోండి. ప్రేమగా ఉండండి. రెండు స్థితులను తెలివిగా ఉపయోగించండి. వీటి గురించి అనవసరంగా చింతించకండి.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Osho Daily Meditations - 168 🌹

📚. Prasad Bharadwaj

🍀 168. HIBERNATION 🍀

🕉 Sometimes you are cold; sometimes you are not. Don't create a problem out if it. When cold, be cold, and don't feel guilty about it. 🕉


There is no need to remain warm for twenty-four hours. That would be tiring. One needs a little rest. When you are cold, the energy is moving inward; when you are warm, the energy is moving outward.Of course, other people would like you always to be warm, because then your energy moves toward them. When you are cold, your energy is not moving toward them, so they feel offended. They will tell you that you are cold. But it is for you to decide. In those cold moments you hibernate, you go within your being. Those are meditative moments.

So this is my suggestion-when you feel cold, close the doors from relationships and moving with people. Feeling that you are cold, go home and meditate. That is the right moment to meditate. With energy itself moving in, you can ride on it and go to the very innermost core of your being. There will be no fight. You can simply move with the current. And when you are feeling warm, move out. Forget all about meditation. Be loving. Use both states, and don't worry about it.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


14 Apr 2022

No comments:

Post a Comment