శ్రీ శివ మహా పురాణము - 549 / Sri Siva Maha Purana - 549

🌹 . శ్రీ శివ మహా పురాణము - 549 / Sri Siva Maha Purana - 549 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 50 🌴

🌻. పరిహాసములు - 4 🌻



అదితి ఇట్లు పలికెను -

పార్వతీ! భోజనము తరువాత ఆ శివశంభునకు ముఖమును కడుగు కొనుటకై ఆదరముతో మహా ప్రేమతో నీటని ఇమ్ము. ఇట్టి ప్రేమ దంపతుల మధ్య దుర్లభమైనది (31). ఎవతె కొరకై నీవు విలపించి రాత్రింబగళ్లు మోహముతో తిరుగాడితివో, అట్టి శివాదేవిని గుండెలో దాచుకొనుము. అట్టి ప్రియురాలి విషయములో లజ్ఞకు స్థానమేది? (32)


లోపాముద్ర ఇట్లు పలికెను -

ఓ శివా! వాస గృహములో భుజించిన తరువాత స్త్రీలకు పని మిగిలి యుండును. పార్వతికి తాంబూలమునిచ్చి నీవు శయనించవచ్చును (33).


అరుంధతి ఇట్లు పలికెను -

మేన ఈమెను నీకు ఇచ్చి వివాహము చేయుటకు అంగీకరించలేదు. కాని నేను ఆమెకు పరిపరి విధముల బోధించి నీకు వివాహము చేయించితిని. కాన ఈమెను జాగరూకతతో పాలించుము (34).


అహల్య ఇట్లు పలికెను-

నీవు వృద్ధావస్ధను విడిచి పెట్టి నవయువకుడవు కమ్ము. అట్లు చేయుట వలన, తన మనస్సును కుమార్తెపై లగ్నము చేసి యున్న మేన నిన్ను అంగీకరించును (35).


తులసి ఇట్లు పలికెను -

ఓ ప్రభూ! నీవు సతిని పరిత్యజించి, పూర్వము మన్మథుని దహించితివి. అట్టి నీవు ఈనాడు వసిష్టుని ఈమె కొరకై ఏల పంపితివి? (36).


స్వాహా దేవి ఇట్లు పలికెను -

మహా దేవా! ఇప్పుడు నీవు స్త్రీల మాటలను జవదాటకుము. వివాహమునందు, వ్యవహారము నందు స్త్రీలకు ప్రాగల్భ్యము కలదు (37).


రోహిణి ఇట్లు పలికెను-

ఓయీ కామశాస్త్ర విశారదా! పార్వతి కోర్కెను తీర్చుము. నీవు స్వయముగా కామివై కామినితో గూడి కామ సముద్రమును దాటుము (38).


వసుంధర ఇట్లు పలికెను -

ఓయీ! భావము నెరింగినవాడా! కోరిక గల యువతుల భావములు నీవు ఎరుకయే. ఓ శంభో! ధనము సమర్థుడగు ప్రభువును సర్వదా రక్షించదు (39).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 549 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 50 🌴

🌻 Description of fun and frolic - 4 🌻



Aditi said:—

31. At the conclusion of the meal, for the purity of the mouth, please give water. The love of this pair is very rare to be seen.


Śacī said:—

32. Why should you be shy of your beloved for whom you lamented and roamed here and there always keeping her in your heart?


Lopāmudrā said:—

33. O Śiva, a duty shall be performed by women in the bedchamber after the meal. Hence give Tāmbūla (betel leaves with spices) to Śivā and go to bed.


Arundhatī said:—

34. This lady was not intended at first to be given to you. But it is after my efforts that she has been given to you. Hence you must have a good dalliance with her.


Ahalyā said:—

35. Leave off your old age. Be extremely youthful so that Menā whose mind is fixed in her daughter may approve of you.


Tulasī said:—

36. Satī was formerly abandoned by you. Kāma too was burnt. Then O lord, how is it that Vasiṣṭha is sent as an emissary now.


Svāhā said:—

37. Now, O great lord, be steady in the words of women. There is a duty for women after marriage, maturity and loftiness of demeanour.


Rohiṇī said:—

38. O lord, expert in erotic science and technique, fulfil the desire of Pārvatī. Loving that you are, try to cross the ocean of the love of your beloved.


Vasundharā said:—

39. O lord, the knower of innermost thoughts, you know the emotions of love-oppressed maidens. It is not only the husband that she cherishes in her heart but she keeps the supreme lord too there for ever.


Continues....

🌹🌹🌹🌹🌹


14 Apr 2022

No comments:

Post a Comment