శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 363-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 363-2
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 363-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 363-2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 80. చితి, స్తత్పదలక్ష్యార్థా, చిదేక రసరూపిణీ ।
స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః ॥ 80 ॥ 🍀
🌻 363-2. 'స్తత్పదలక్ష్యార్థి'తత్' 🌻
జీవులకు దేహము నేర్పరచి సృష్టిలోకముల ప్రవేశింపజేసి శిక్షణ నిచ్చును. శిక్షణ ఇచ్చుటలో భాగముగ జ్ఞానమును అందించును. కార్యోన్ముఖులను చేయును. ఇచ్ఛా జ్ఞాన క్రియల ద్వారా పరిపూర్ణులను చేయును. అవసరమగుచో శిక్షించును. ఎప్పుడునూ హెచ్చరికగ సూచించును. సృష్టి ధర్మముల నవలంబింపజేసి జీవులను తత్పథమునకు నడుపును. జీవులందరూ తమ వృద్ధికై తాము కృషి చేయుట శ్రీమాత సంకల్పమే.
ఏ పని చేసిననూ జీవుడు తన వృద్ధి కొఱకే చేయును. అట్లు చేయుటలో ధర్మము లోపించినపుడు, వృద్ధి చెందుట కుంటు పడును. తప్పక ధర్మము నాచరించుచు శిక్షణను అందుకొనును. అట్లందించి ముందుకు నడుపుట శ్రీమాత కృషి. కోటానుకోట్ల జీవుల విషయమున ఒకే లక్ష్యమును నిర్వర్తించు శ్రీమాత కారుణ్యము నిర్వచించుట అసాధ్యము. అసామాన్యమైన కారుణ్యము. ఇట్టి మహత్తర లక్ష్యమును నిర్వర్తించు శ్రీమాతకు జీవు లెప్పుడునూ కృతజ్ఞులై వుండ వలెను కదా!
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 363-2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 80. Chiti statpadalakshyardha chidekarasa rupini
Svatyanandalavibhuta bramhadyananda santatih ॥ 80 ॥ 🌻
🌻 363-1. Tatpada-lakṣyārthā तत्पद-लक्ष्यार्था 🌻
Prakāśa form is without attributes and is eternally pure and vimarśa form is with attributes and though pure is subjected to modifications exclusively for the purpose of administering the universe. Though they are interdependent, in literal sense there appears to be no difference between these two as they are embodiments of pure knowledge or cit.
In fact this undifferentiated form of the Brahman is known as That or Cit. In order to avoid any confusion arising out of the previous nāma, this nāma confirms Her nir-guṇa (unconditioned) Brahman status.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
14 Apr 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment