2) 🌹. శ్రీమద్భగవద్గీత - 187 / Bhagavad-Gita - 187 - 4-25 జ్ఞానయోగము 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 586 / Vishnu Sahasranama Contemplation - 586🌹
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 35 / Agni Maha Purana 35🌹
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 265 / DAILY WISDOM - 265 🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 166 🌹
7) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 104 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ శుక్రవారం మిత్రులందరికీ 🌹*
*భృగు వాసరే, 15, ఏప్రిల్ 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : దమనక చతుర్దశి, గుడ్ ఫ్రైడే, Vishu Kani, Pohela Boishakh, Good Friday🌻*
*🍀. అష్టలక్ష్మి స్త్రోత్రం - 1.ఆదిలక్ష్మి 🍀*
*సుమనస వందిత సుందరి మాధవి, చంద్ర సహొదరి హేమమయే*
*మునిగణ వందిత మోక్షప్రదాయని, మంజుల భాషిణి వేదనుతే |*
*పంకజవాసిని దేవ సుపూజిత, సద్గుణ వర్షిణి శాంతియుతే*
*జయ జయహే మధుసూదన కామిని, ఆదిలక్ష్మి పరిపాలయ మామ్*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : మానవుడు పరమార్ధ పనులలో మనస్సును పూర్తిగా నిమగ్నము చేసినప్పుడు సంపూర్ణత్వమును పొందగలడు. - సద్గురు శ్రీరామశర్మ 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ సంవత్సరం: 2079 రక్ష
శాలివాహన శక : 1944
ఉత్తరాయణం, వసంత ఋతువు
శుభకృత్ సంవత్సరం, చైత్ర మాసం
తిథి: శుక్ల చతుర్దశి 26:26:16 వరకు
తదుపరి పూర్ణిమ
నక్షత్రం: ఉత్తర ఫల్గుణి 09:36:44
వరకు తదుపరి హస్త
యోగం: ధృవ 07:56:06 వరకు
తదుపరి వ్యాఘత
కరణం: గార 15:10:39 వరకు
వర్జ్యం: 17:40:24 - 19:12:40
దుర్ముహూర్తం: 08:30:43 - 09:20:50
మరియు 12:41:19 - 13:31:26
రాహు కాలం: 10:42:17 - 12:16:15
గుళిక కాలం: 07:34:20 - 09:08:18
యమ గండం: 15:24:13 - 16:58:11
అభిజిత్ ముహూర్తం: 11:51 - 12:41
అమృత కాలం: 02:30:18 - 04:04:54
మరియు 26:54:00 - 28:26:16
సూర్యోదయం: 06:00:22
సూర్యాస్తమయం: 18:32:10
చంద్రోదయం: 17:19:32
చంద్రాస్తమయం: 04:59:08
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: కన్య
శుభ యోగం - కార్య జయం 09:36:44
వరకు తదుపరి అమృత యోగం
- కార్య సిధ్ది
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
#PanchangDaily
#DailyTeluguCalender
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 187 / Bhagavad-Gita - 187 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 25 🌴*
*25. దైవ దైవమేవాపరే యజ్ఞం యోగిన: పర్యుపాసతే |*
*బ్రహ్మాగ్నావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్యతి ||*
🌷. తాత్పర్యం :
*కొందరు యోగులు వివిధ యజ్ఞముల ద్వారా దేవతలను లెస్సగా పూజింతురు. మరికొందరు పరబ్రహ్మమనెడి అగ్ని యందు హోమమును చేయుదురు.*
🌷. భాష్యము :
ఇంతకు పూర్వము వివిరించిన రీతి కృష్ణభక్తిభావనలో విధ్యుక్తధర్మ నిర్వాహణ యందు నియుక్తుడైనవాడు పూర్ణయోగి (ప్రథమశ్రేణి యోగి) యని పిలువబడును. కాని అటువంటి యజ్ఞములనే దేవతార్చనమునందు ఒనరించువారును కలరు. ఇంకొందరు పరబ్రహ్మమును లేదా భగవానుని నిరాకారతత్త్వమును ఉపాసింతురు. అనగా వివిధ తరగతులను బట్టి వివిధములైన యజ్ఞములు కలవని విదితమగుచున్నది. కాని వాస్తవమునకు వివిధకర్తలచే చేయబడు యజ్ఞములందలి వివిధవర్గములు కేవలము యజ్ఞము యొక్క బాహ్యవర్గీకరణము మాత్రమే.
ఏలయన యజ్ఞము యజ్ఞుడని పిలువబడు విష్ణుప్రీత్యర్థమే నిర్ణయింపబడియున్నది. కనుక వివిధములైన యజ్ఞములనన్నింటిని రెండు ప్రధాన తరగతులుగా విభజింపవచ్చును. ఒకటి లౌకికసంపదలను త్యాగము చేయుట కాగా రెండవది ఆధ్యాత్మికజ్ఞానప్రాప్తి కొరకు చేయబడునదై యున్నది. కృష్ణభక్తిభావన యందున్నవారు శ్రీకృష్ణభగవానుని ప్రీత్యర్థము తమకున్నవన్నియును అర్పింపగా, అశాశ్వతసుఖమును గోరువారు ఇంద్రుడు, సూర్యుడు వంటి దేవతల ప్రీత్యర్థము తమకున్నవి అర్పింతురు. ఇతరులైన నిరాకారవాదులు (మాయావాదులు) నిరాకారబ్రహ్మమునందు లీనమగుట ద్వారా తమ వ్యక్తిత్త్వమును అర్పింతురు.
భౌతికజగత్తును పాలించుట మరియు దాని యందు అగ్ని, నీరు వెలుతురు వంటివి సమకూర్చుట కొరకు దేవదేవునిచే నియమింపబడిన శక్తిమంతులగు జీవులే వివిధ దేవతలు. భౌతికలాభమును కోరువారు అట్టి దేవతలను వేదకర్మకాండ ప్రకారము పలుయజ్ఞములు ద్వారా పూజింతురు. అట్టివారు “బహ్వీశ్వరవాదులు” (పలుదేవతలను విశ్వసించువార్) అని పిలువబడుదురు. కాని కొందరు దేవతారూపములను ఆశాశ్వతములని భావించి పరతత్త్వము యొక్క నిరాకారతత్త్వమును ఉపాసించుచు, బ్రహ్మాగ్ని యందు తమ వ్యక్తిత్వమును హుతము చేసి బ్రహ్మమునందు లీనమగుదురు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 187 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 4 - Jnana Yoga - 25 🌴*
*25. daivam evāpare yajñaṁ yoginaḥ paryupāsate*
*brahmāgnāv apare yajñaṁ yajñenaivopajuhvati*
🌷 Translation :
*Some yogīs perfectly worship the demigods by offering different sacrifices to them, and some offer sacrifices in the fire of the Supreme Brahman.*
🌹 Purport :
As described above, a person engaged in discharging duties in Kṛṣṇa consciousness is also called a perfect yogī or a first-class mystic. But there are others also, who perform similar sacrifices in the worship of demigods, and still others who sacrifice to the Supreme Brahman, or the impersonal feature of the Supreme Lord. So there are different kinds of sacrifices in terms of different categories.
Such different categories of sacrifice by different types of performers only superficially demark varieties of sacrifice. Factually sacrifice means to satisfy the Supreme Lord, Viṣṇu, who is also known as Yajña. All the different varieties of sacrifice can be placed within two primary divisions: namely, sacrifice of worldly possessions and sacrifice in pursuit of transcendental knowledge. Those who are in Kṛṣṇa consciousness sacrifice all material possessions for the satisfaction of the Supreme Lord, while others, who want some temporary material happiness, sacrifice their material possessions to satisfy demigods such as Indra, the sun-god, etc. And others, who are impersonalists, sacrifice their identity by merging into the existence of impersonal Brahman.
The demigods are powerful living entities appointed by the Supreme Lord for the maintenance and supervision of all material functions like the heating, watering and lighting of the universe. Those who are interested in material benefits worship the demigods by various sacrifices according to the Vedic rituals. They are called bahv-īśvara-vādī, or believers in many gods. But others, who worship the impersonal feature of the Absolute Truth and regard the forms of the demigods as temporary, sacrifice their individual selves in the supreme fire and thus end their individual existences by merging into the existence of the Supreme.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 586 / Vishnu Sahasranama Contemplation - 586🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌻 586. శుభాఙ్గః, शुभाङ्गः, Śubhāṅgaḥ 🌻*
*ఓం శుభాఙ్గాయ నమః | ॐ शुभाङ्गाय नमः | OM Śubhāṅgāya namaḥ*
శుభాఙ్గః, शुभाङ्गः, Śubhāṅgaḥ
*ధారయన్ సున్దరతనుం శుభాఙ్గ ఇతి కథ్యతే*
*బాహ్య సౌందర్యవంతమయిన లేదా ఆధ్యాత్మిక దృక్కోణములో సచ్చిదానంద రూపముగల శరీరము ఎవనికి కలదో అట్టివాడు శుభాంగుడు.*
శాన్తాకారం భుజగశయనం పద్మనాభం సురేశం ।
విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాఙ్గం ॥
లక్ష్మీకాన్తం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం ।
వన్దే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ॥
*శాంతాకారుడు, శేషశయనుడు, పద్మనాభుడూ, దేవాదిదేవుడు, విశ్వానికి ఆధారము వంటివాడు, ఆకాశము వలె విశాలమైన వాడు, నీలమేఘశ్యాముడు, సుందరమైన అంగములుగలవాడు, లక్ష్మీపతి, కమలములవంటి కన్నులుగలవాడు, యోగి జనుల హృదయాలలో కొలువుదీరేవాడు, అన్ని లోకాలకు ఏకైక నాథుడు, సంసారమనే భయమును తొలగించగల ఆ విష్ణు దేవునికి ప్రణామము.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 586🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌻586. Śubhāṅgaḥ🌻*
*OM Śubhāṅgāya namaḥ*
*धारयन् सुन्दरतनुं शुभाङ्ग इति कथ्यते / Dhārayan sundaratanuṃ śubhāṅga iti kathyate*
*From mere appearance point-of-view the One with handsome body and from the spiritual angle, the One who has has a blissful body is called Śubhāṅgaḥ.*
शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं ।
विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं ॥
लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्ध्यानगम्यं ।
वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं ॥
Śāntākāraṃ bhujagaśayanaṃ padmanābhaṃ sureśaṃ,
Viśvādhāraṃ gaganasadrśaṃ meghavarṇaṃ śubhāṅgaṃ.
Lakṣmīkāntaṃ kamalanayanaṃ yogihrddhyānagamyaṃ,
Vande Viṣṇuṃ bhavabhayaharaṃ sarvalokaikanāthaṃ.
I salute Lord Viṣṇu, the sole master of the universe, Whose presence is very peaceful, Who stretches Himself on a serpent-bed, Who sports a lotus in His navel, Who is the One Lord of all the gods, Who is the Support of the worlds, Who is subtle and all-pervading like the sky, Whose complexion is like that of the rain bearing clouds, Whose form is very beautiful, Who is the consort of Śrī, Whose eyes are like lotus petals, Who is mediated upon by Yogis and Who eradicates the fear of saṃsāra.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
शुभाङ्गश्शान्तिदस्स्रष्टा कुमुदः कुवलेशयः ।गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः ॥ ६३ ॥
శుభాఙ్గశ్శాన్తిదస్స్రష్టా కుముదః కువలేశయః ।గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ॥ 63 ॥
Śubhāṅgaśśāntidassraṣṭā kumudaḥ kuvaleśayaḥ,Gohito gopatirgoptā vrṣabhākṣo vrṣapriyaḥ ॥ 63 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 265 / DAILY WISDOM - 265 🌹*
*🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌻 21. మోక్ష సాధన కోసం మనిషి జీవిస్తాడు 🌻*
*మానవుడు, చివరకు మోక్షసాధనకి కృషి చేయడానికి జీవిస్తాడు. ఏది ఏమైనప్పటికీ, శరీరం మరియు మనస్సు యొక్క సంకెళ్ళలో బందీ అయిన ముముక్షువు ఈ విషయంలో ఏమి చేయాలనే దానిపై కొంత శ్రద్ధ వహించాలి. భౌతిక శరీరానికి దాని భౌతిక అవసరాలు ఉన్నాయి మరియు మనస్సుకు దాని భావోద్వేగాలు ఉన్నాయి. మోక్షసాధన ఈ భౌతిక మరియు అభౌతిక అవసరాలను సైతం పరిగణన లోకి తీసుకుంటుంది. భౌతిక అవసరాలు, భౌతిక శరీరం యొక్క మనుగడకు అవసరమైన ఆస్తులు అర్థం పరిధిలోకి వస్తాయి.*
*ఆహారం, దుస్తులు మరియు నివాసం జీవనానికి అవసరమైన కనీసావసరాలు. ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు ఉంది, అంతిమ స్వేచ్ఛను సాధించడం ప్రతి ఒక్కరి బాధ్యత కూడా. అనుభవ పూర్వకంగా తెలుసుకున్న విషయాన్ని వాస్తవంగా ఒప్పుకొని శ్రద్ధ వహించాలి. శరీరం ఆత్మ కానందు వల్ల దాని పట్ల శ్రద్ధ వహించక పోవడం జరగకూడదు. ఎందుకంటే మిథ్య అయినప్పటికీ చైతన్యం దాన్ని ఎంత ఆమోదించి తనలోకి స్వీకరిస్తున్నదో అంత సత్యంగా అది మారుతుంది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 265 🌹*
*🍀 📖 from Essays in Life and Eternity 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*
*🌻 21. Man Lives to Strive Towards the Attainment of Moksha 🌻*
*Man lives, finally, to strive towards the attainment of moksha. Nevertheless, the aspiring human individual involved in the shackle of body and mind has to pay some attention to what exactly is to be done while actually involved in this manner. The physical body has its material needs and the mind has its emotional calls. The working for moksha is also to take into account these lesser psychophysical requirements. The physical needs come under the realm of artha, including material possessions necessary for the survival of the physical body.*
*Food, clothing and shelter are the barest minimum necessary for the continuance of life. Everyone has the right to live, even as everyone has a duty to achieve ultimate freedom. Further, a phenomenon presented as a content of experience should be considered as real enough to call for concerted attention. That the body is not the soul does not preclude the necessity to pay due attention to the demands of the body, for even a phenomenon not finally real assumes a reality to the extent it is received and accepted into the constitution of consciousness.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు #SwamiKrishnananda
#PrasadBhardwaj
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 165 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. అస్తిత్వమన్నది సముద్రంలాంటిది. మనం మంచుబిందువులా ఉండి దాన్నించీ వేరుగా వుండడానికి ప్రయత్నిస్తూ వుంటాం. అదే అన్ని రకాల దు:ఖాలకూ మూలం. సముద్రంలోకి దూకితే మంచుబిందువు అదృశ్యమవుతుంది. ఉన్నతమైనది. ఆవిర్భవిస్తుంది. 🍀*
*మనిషి మంచు బిందువులాంటి వాడు. అస్తిత్వమన్నది సముద్రంలాంటిది. మనం దాన్నించీ వేరుగా వుండడానికి ప్రయత్నిస్తూ వుంటాం. అదే అన్ని రకాల దు:ఖాలకూ మూలం. ఒకటే అవసరం. సముద్రంలోకి దూకితే మంచుబిందువు అదృశ్యమవుతుంది. నిజానికి అది అదృశ్యం కాదు. కేవలం దాని చిన్ని సరిహద్దుల్ని కోల్పోతుంది. అది సముద్రంలో భాగమవుతుంది. సముద్రమవుతుంది. ఒక విధంగా అదృశ్యమవుతుంది. ఎందుకంటే కనిపించదు. పాత నేమ్ ప్లేట్, పాత అడ్రస్ కనిపించవు.*
*అది ఎంత అనంత విశాలంలో భాగమవుతుందంటే దాన్ని కనిపెట్టడానికి వీలుపడదు. భయమల్లా అదే. అందుకనే మనమెప్పుడు సముద్రానికి దూరంగా వుంటాం. జీవితంలో అది గొప్ప రోజు. నువ్వు అనంతంలోకి దూకిన రోజు. అది మరణం కాదు. అది పునర్జన్మ. కాలం మరణిస్తుంది. శాశ్వతత్వం జన్మిస్తుంది. అల్పమైంది. నశిస్తుంది అనంతమైనది. ఆవిర్భవిస్తుంది. సూక్ష్మమైనది నశిస్తుంది. ఉన్నతమైనది ఆవిర్భవిస్తుంది. ఆ ప్రయత్నం విలువైంది.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://oshodailymeditations.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 104 🌹*
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻 83. కృతజ్ఞత -1 🌻*
*ప్రస్తుత కాలమున ప్రతివారికి హీలింగ్ (Healing) ప్రక్రియ యందు మోజు కలదు. హీలింగ్ అనగా ప్రాణప్రసారము చేయు సామర్థ్యము. ప్రాణమును ప్రసరింపచేయదలచినచో భావము ప్రేమ మయమై యుండవలెను. ప్రేమ ప్రాణ ప్రవాహక శక్తి. ప్రేమ లేనివారు హీలింగ్ చేయలేరు. ప్రేమ భావము మానవుని భావనలన్నిటికన్న పవిత్రమైనది. అది భావమను మకుటమునకు మాణిక్యము వంటిది.*
*శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, గౌతమబుద్ధుడు ప్రేమను అను నిత్యము నిర్వర్తించి చూపినారు. నేటికిని మానవజాతి ప్రేమ విలువను తెలియ లేకున్నది. ప్రేమ మార్గమునకు పునాది కృతజ్ఞత. కృతజ్ఞత లేని వాని యందు ప్రేమ యుండదు. కృతజ్ఞతా భావమును ముందుగ మానవుడు పరిపూర్ణముగ పోషించి పెంపొందించు కొనవలెను.*
*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment