మైత్రేయ మహర్షి బోధనలు - 104


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 104 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 83. కృతజ్ఞత -1 🌻


ప్రస్తుత కాలమున ప్రతివారికి హీలింగ్ (Healing) ప్రక్రియ యందు మోజు కలదు. హీలింగ్ అనగా ప్రాణప్రసారము చేయు సామర్థ్యము. ప్రాణమును ప్రసరింపచేయదలచినచో భావము ప్రేమ మయమై యుండవలెను. ప్రేమ ప్రాణ ప్రవాహక శక్తి. ప్రేమ లేనివారు హీలింగ్ చేయలేరు. ప్రేమ భావము మానవుని భావనలన్నిటికన్న పవిత్రమైనది. అది భావమను మకుటమునకు మాణిక్యము వంటిది.

శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, గౌతమబుద్ధుడు ప్రేమను అను నిత్యము నిర్వర్తించి చూపినారు. నేటికిని మానవజాతి ప్రేమ విలువను తెలియ లేకున్నది. ప్రేమ మార్గమునకు పునాది కృతజ్ఞత. కృతజ్ఞత లేని వాని యందు ప్రేమ యుండదు. కృతజ్ఞతా భావమును ముందుగ మానవుడు పరిపూర్ణముగ పోషించి పెంపొందించు కొనవలెను.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


15 Apr 2022

No comments:

Post a Comment