నిత్య ప్రజ్ఞా సందేశములు - 265 - 21. మోక్ష సాధన కోసం మనిషి జీవిస్తాడు / DAILY WISDOM - 265 - 21. Man Lives to Strive Towards the Attainment of Moksha
🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 265 / DAILY WISDOM - 265 🌹
🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀
📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 21. మోక్ష సాధన కోసం మనిషి జీవిస్తాడు 🌻
మానవుడు, చివరకు మోక్షసాధనకి కృషి చేయడానికి జీవిస్తాడు. ఏది ఏమైనప్పటికీ, శరీరం మరియు మనస్సు యొక్క సంకెళ్ళలో బందీ అయిన ముముక్షువు ఈ విషయంలో ఏమి చేయాలనే దానిపై కొంత శ్రద్ధ వహించాలి. భౌతిక శరీరానికి దాని భౌతిక అవసరాలు ఉన్నాయి మరియు మనస్సుకు దాని భావోద్వేగాలు ఉన్నాయి. మోక్షసాధన ఈ భౌతిక మరియు అభౌతిక అవసరాలను సైతం పరిగణన లోకి తీసుకుంటుంది. భౌతిక అవసరాలు, భౌతిక శరీరం యొక్క మనుగడకు అవసరమైన ఆస్తులు అర్థం పరిధిలోకి వస్తాయి.
ఆహారం, దుస్తులు మరియు నివాసం జీవనానికి అవసరమైన కనీసావసరాలు. ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు ఉంది, అంతిమ స్వేచ్ఛను సాధించడం ప్రతి ఒక్కరి బాధ్యత కూడా. అనుభవ పూర్వకంగా తెలుసుకున్న విషయాన్ని వాస్తవంగా ఒప్పుకొని శ్రద్ధ వహించాలి. శరీరం ఆత్మ కానందు వల్ల దాని పట్ల శ్రద్ధ వహించక పోవడం జరగకూడదు. ఎందుకంటే మిథ్య అయినప్పటికీ చైతన్యం దాన్ని ఎంత ఆమోదించి తనలోకి స్వీకరిస్తున్నదో అంత సత్యంగా అది మారుతుంది.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 265 🌹
🍀 📖 from Essays in Life and Eternity 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 21. Man Lives to Strive Towards the Attainment of Moksha 🌻
Man lives, finally, to strive towards the attainment of moksha. Nevertheless, the aspiring human individual involved in the shackle of body and mind has to pay some attention to what exactly is to be done while actually involved in this manner. The physical body has its material needs and the mind has its emotional calls. The working for moksha is also to take into account these lesser psychophysical requirements. The physical needs come under the realm of artha, including material possessions necessary for the survival of the physical body.
Food, clothing and shelter are the barest minimum necessary for the continuance of life. Everyone has the right to live, even as everyone has a duty to achieve ultimate freedom. Further, a phenomenon presented as a content of experience should be considered as real enough to call for concerted attention. That the body is not the soul does not preclude the necessity to pay due attention to the demands of the body, for even a phenomenon not finally real assumes a reality to the extent it is received and accepted into the constitution of consciousness.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
15 Apr 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment