నిర్మల ధ్యానాలు - ఓషో - 165
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 165 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. అస్తిత్వమన్నది సముద్రంలాంటిది. మనం మంచుబిందువులా ఉండి దాన్నించీ వేరుగా వుండడానికి ప్రయత్నిస్తూ వుంటాం. అదే అన్ని రకాల దు:ఖాలకూ మూలం. సముద్రంలోకి దూకితే మంచుబిందువు అదృశ్యమవుతుంది. ఉన్నతమైనది. ఆవిర్భవిస్తుంది. 🍀
మనిషి మంచు బిందువులాంటి వాడు. అస్తిత్వమన్నది సముద్రంలాంటిది. మనం దాన్నించీ వేరుగా వుండడానికి ప్రయత్నిస్తూ వుంటాం. అదే అన్ని రకాల దు:ఖాలకూ మూలం. ఒకటే అవసరం. సముద్రంలోకి దూకితే మంచుబిందువు అదృశ్యమవుతుంది. నిజానికి అది అదృశ్యం కాదు. కేవలం దాని చిన్ని సరిహద్దుల్ని కోల్పోతుంది. అది సముద్రంలో భాగమవుతుంది. సముద్రమవుతుంది. ఒక విధంగా అదృశ్యమవుతుంది. ఎందుకంటే కనిపించదు. పాత నేమ్ ప్లేట్, పాత అడ్రస్ కనిపించవు.
అది ఎంత అనంత విశాలంలో భాగమవుతుందంటే దాన్ని కనిపెట్టడానికి వీలుపడదు. భయమల్లా అదే. అందుకనే మనమెప్పుడు సముద్రానికి దూరంగా వుంటాం. జీవితంలో అది గొప్ప రోజు. నువ్వు అనంతంలోకి దూకిన రోజు. అది మరణం కాదు. అది పునర్జన్మ. కాలం మరణిస్తుంది. శాశ్వతత్వం జన్మిస్తుంది. అల్పమైంది. నశిస్తుంది అనంతమైనది. ఆవిర్భవిస్తుంది. సూక్ష్మమైనది నశిస్తుంది. ఉన్నతమైనది ఆవిర్భవిస్తుంది. ఆ ప్రయత్నం విలువైంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
15 Apr 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment