22 - APRIL - 2022 శుక్రవారం, భృగు వాసరే Friday MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 22, శుక్రవారం, ఏప్రిల్ 2022 భృగు వాసరే 🌹
2) 🌹. గీతోపనిషత్తు - రాజవిద్య రాజగుహ్య యోగము 34-1 - 355 - జీవేశ్వర సంబంధం🌹 
3) 🌹. శివ మహా పురాణము - 553 / Siva Maha Purana - 553 🌹
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 37 / Agni Maha Purana - 37 🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 172 / Osho Daily Meditations - 172 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 365-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 365-1🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ శుక్రవారం మిత్రులందరికీ 🌹*
*భృగు వాసరే, 22, ఏప్రిల్‌ 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻*

*🍀. 2.ధాన్యలక్ష్మి స్త్రోత్రం 🍀*

*అయికలి కల్మష నాశిని కామిని, వైదిక రూపిణి వేదమయే*
*క్షీర సముద్భవ మంగళ రూపిణి, మంత్రనివాసిని మంత్రనుతే |*
*మంగళదాయిని అంబుజవాసిని, దేవగణాశ్రిత పాదయుతే*
జయ జయహే మధుసూదన కామిని, ధాన్యలక్ష్మి పరిపాలయ *మామ్*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : అందరి యందుగల పరమాత్మను గుర్తించి, దర్శించి, సేవించుచు నున్నచో అతడు నిత్యమున్నాడు గనుక అతనితో సంబంధము నిత్యమై యుండును. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, చైత్ర మాసం
ఉత్తరాయణం, వసంత ఋతువు
తిథి: కృష్ణ షష్టి 08:43:52 వరకు
తదుపరి కృష్ణ సప్తమి
నక్షత్రం: పూర్వాషాఢ 20:15:28 వరకు
తదుపరి ఉత్తరాషాఢ
యోగం: శివ 07:12:31 వరకు తదుపరి సిధ్ధ
కరణం: వణిజ 08:43:52 వరకు
వర్జ్యం: 06:49:12 - 08:18:44 మరియు
27:48:00 - 29:18:36
దుర్ముహూర్తం: 08:27:15 - 09:17:48
మరియు 12:39:59 - 13:30:32
రాహు కాలం: 10:39:56 - 12:14:43
గుళిక కాలం: 07:30:23 - 09:05:10
యమ గండం: 15:24:15 - 16:59:02
అభిజిత్ ముహూర్తం: 11:49 - 12:39
అమృత కాలం: 15:46:24 - 17:15:56
సూర్యోదయం: 05:55:37 
సూర్యాస్తమయం: 18:33:49
చంద్రోదయం: 00:32:52
చంద్రాస్తమయం: 10:46:13
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: ధనుస్సు
వర్ధమాన యోగం - ఉత్తమ ఫలం
20:15:28 వరకు తదుపరి ఆనంద
యోగం - కార్య సిధ్ధి 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -355 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 34 📚*
 
*🍀 34-1. జీవేశ్వర సంబంధము - లౌకికమగు సంబంధములు గుర్తించుట కన్న అలౌకికము శాశ్వతము అగు సంబంధము గుర్తించుట శాశ్వతత్వము నిచ్చును. భావము నందు, బాహ్యమునందు ఈశ్వరుని దర్శించుచు నుండుట రాజవిద్య. మనసు దైవమును భావించుట నిజమగు మననము. బయట కనపడుచున్నది దైవమే అని భావించుట కూడ మననమే. ఇట్లు లోపల బయట దైవమునే భావించుట అభ్యసించినపుడు మనస్సునకు ప్రశాంతత చిక్కును. 🍀*

*మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు ।*
*మా మేవైష్యసి యుక్త్యేవ మాత్మానం మత్పరాయణః || 34*

*తాత్పర్యము : మనసున నన్నే భావింపుము. అందరి యందు నన్నే దర్శించి సేవింపుము. నన్ను దర్శించుచునే ఎదుటి వానికి నమస్కరింపుము. అన్ని అవస్థల యందు నన్నే కూడి
యుండుము. అపుడు నీవు నేనుగ, నేను నీవుగ ఏకమై యుందుము.*

*వివరణము : భావమునందు, బాహ్యమునందు ఈశ్వరుని దర్శించుచు నుండుట రాజవిద్య. లౌకికమగు సంబంధములు గుర్తించుట కన్న అలౌకికము శాశ్వతము అగు సంబంధము గుర్తించుట శాశ్వతత్వము నిచ్చును. మనస్సున అనేకానేకమగు, వైవిధ్యమగు భావములు చెలరేగుచు నుండును. భావించుట మనసు ప్రధాన లక్షణము. ఇతర భావనలు, చింతనలు దైవ భావముతో అరికట్టవచ్చును.*

*మనసు దైవమును భావించుట నిజమగు మననము. బయట కనపడుచున్నది దైవమే అని భావించుట కూడ మననమే. ఇట్లు లోపల బయట దైవమునే భావించుట అభ్యసించినపుడు మనస్సునకు ప్రశాంతత చిక్కును. అట్టి మనసుతో పరిసరము లందలి జీవుల రూపమున నున్న ఈశ్వరుని సేవించుట వలన మనసున పట్టుచిక్కును. ఎట్టి ఆరాధనలు చేయుచున్నను ఈశ్వరునుద్దేశించియే చేయు చుండుట వలన భావమున ఈశ్వరుడే నిలచును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 553 / Sri Siva Maha Purana - 553 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 51 🌴*

*🌻. కామ సంజీవనము - 3 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను-

మన్మథుని ఈ మాటను విని ప్రసన్నుడైన కరుణా సముద్రుడగు పరమేశ్వరుడు నవ్వి ఆతనితో 'అటులనే' అని ఇట్లనెను (22).

ఈశ్వరుడిట్లు పలికెను-

ఓ మన్మథా! నేను ప్రసన్నుడనైతిని. నీవు గొప్ప బుద్ధి శాలివి. భయమును వీడుమ. విష్ణువు వద్దకు వెళ్లుము. ఈ గృహమునకు దూరముగా నుండుము (23).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆ మాటను విని ఆతడు శిరస్సు వంచి నమస్కరించి విభునకు ప్రదక్షిణము చేసి సత్తుతించి బయటకు వెళ్లి విష్ణువునకు దేవతలకు నమస్కరించి వారిని సేవించెను (24). దేవతలు మన్మథునితో మాటలాడి ఆతనికి శుభాశీస్సులు నందజేసిరి. విష్ణువు మొదలగు వారు శివుని హృదయము నందు స్మరించి ప్రసన్నులై ఇట్లనిరి (25).

దేవతలిట్లు పలికిరి -

ఓ మన్మథా ! నీవు ధన్యడవు. శివునిచే దహింపబడిన నీవు అనుగ్రహింపబడితివి. ఆ సర్వేశ్వరుడు సత్త్వగుణాంశమగు దయాదృష్టితో నిన్ను బ్రతికించెను (26). మానవులకు సుఖదుఃఖములను ఇతరులు ఈయరు. సర్వులు తాము చేసిన కర్మల ఫలమును అనుభవించెదరు. కాలము వచ్చినప్పుడు అను గ్రహమును, వివాహమును, సంతానమును ఎవ్వరు ఆపగలరు? (27)

బ్రహ్మ ఇట్లు పలికెను-

అపుడు విష్ణువు మొదలగు దేవతలందరు ఇట్లు పలికి, ఆతనిని ఆనందముతో సత్కరించి, తీరిన కోరిక గల వారై అచట నివసించిరి (28). ఆ మన్మథుడు కూడా ఆనందించి శివుని ఆజ్ఞచే అచట నివసించెను. జయము కలుగు గాక! నమస్కారము, బాగు బాగు అను వచనములు వినవచ్చు చుండెను (29). అపుడు శంభుడు నివాస గృహములో పార్వతిని ఎడమ వైపు కూర్చుండబెట్టుకొని ఆమెకు మృష్టాన్నమును తినిపించగా, ఆమె కూడ ఆనందముతో ఆయనకు తినిపించెను (30). తరువాత శంభుడు అచట కర్తవ్యమును పూర్తి చేసి మేనా హిమవంతుల అనుమతిని బొంది జనుల నివసించిన చోటికి వెళ్లెను (31). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 553 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 51 🌴*

*🌻 The resuscitation of Kāma - 3 🌻*

Brahmā said:—

22. On hearing the words of Kāma, lord Śiva was delighted. Giving consent, the lord of mercy laughingly said.
Lord Śiva said:—

23. O Kāma, I am delighted. O intelligent one, do not fear. Go near Viṣṇu and wait outside.

Brahmā said:—

24. On hearing these words he bowed to, circumambulated and eulogised the lord. Then he went out and bowed to Viṣṇu and gods.

25. Addressing Kāma, the gods congratulated him and offered him their auspicious blessings. Remembering Śiva, Viṣṇu and others spoke to him.

The gods said:—

26. O Kāma, you are blessed. Burnt by Śiva you have been blessed by Him. The lord of all has resuscitated you by means of his sympathetic glance, the Sāttvika part.

27. No man causes happiness or sorrow to another man. Man experiences the fruits of what he does. Who can ward off the destined protection, marriage or consummation at the proper time?

Brahmā said:—

28. After saying thus, the gods happily honoured him. Viṣṇu and other gods who had realised their desire stayed there with pleasure.

29. He too remained there, at the bidding of Śiva, with great delight. There were shouts of “Victory” “Obeisance” and “well-done”.

30. At the bed-chamber Śiva placed Pārvatī on His left side and fed her with sweets. She too delightedly fed him with sweets in return.

31. Śiva according to the conventions of the world performed the customary rites. Taking leave of Menā and the mountain He came to the audience hall.

Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 37 / Agni Maha Purana - 37 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 13*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*🌻. భారతము యొక్క వర్ణనము - 3 🌻*

ద్యూతమునందు ఓడిపోయిన యుధిష్ఠిరుడు సోదరులతోడను, ద్రౌపదితోడను, ధౌమ్యునితోడను అరణ్యమునకు వెళ్లి ప్రతిజ్ఞచేసిన విధముగ అచట పండ్రెండు సంవత్సరములు గడపెను. అచట పూర్వము నందు వలె, ప్రతిదివసము నందును, ఎనుబది ఎనిమిదివేలమంది బ్రాహ్మణులకు భోజనము పెట్టుచుండెను. 

పిమ్మట వారందరును విరాటుని చేరిరి. యుధిష్ఠిరుడు కంకుడనెడు. బ్రాహ్మణుడుగను, భీముడు వంటవాడుగను, అర్జునుడు బృహన్నలగను అయి ఇతరులకు తెలియ కుండునట్లు అచట నివసించిరి. నకులసహదేవులు వేరు పేర్లుతో ఉండిరి. ద్రౌపదిని హరింప నభిలషించిన కీచకుని భీమ సేనుడు రాత్రివేళ సంహరించెను. గోగ్రహణాదికమును చేయ వచ్చిన కౌరవులను అర్జునుడు జయించెను. అప్పుడు ఆ కౌరవులు వారు పాండవులని గుర్తించిరి. కృష్ణుని సోదరియైన సుభద్రకు అర్జునుని వలన అభిమన్యడను కుమారుడు కలిగెను. విరాటుడు అతనికి తన కుమార్తెయైన ఉత్తర నిచ్చెను. 

ధర్మరాజు యుద్ధమునకై ఏడు అక్షౌహిణుల సైన్యమును నన్నద్దము చేసికొనెను. కృష్ణుడు అమర్ష పూర్ణుడును, పదకొండు అక్షోహిణులకు అధిపతియు అగు దుర్యోధనుని వద్దకు దూతగా వెళ్లి - "యుధిష్ఠిరునకు సగము రాజ్యము నిమ్ము. లేదా ఐదు గ్రామాల నైన ఇమ్ము. అట్లు కానిచో యుద్ధము చేయము" అని చెప్పెను. ఆ మాటలు విని సుయోధనుడు శ్రీ కృష్ణునితో ఇట్లు పలికెను.

సుయోధను డిట్లనెను - ''సూది మోపినంత నేల నైనను ఇవ్వను. యుద్దము చేసెదను. యుద్ధమునకై సిద్ధముగా ఉన్నాను." అగ్ని పలికెను. అంత శ్రీ కృష్ణుడు ఎదిరింప శక్యముకాని విశ్వరూపము చూపి, విదురుని చేత పూజింపబడినవాడై, యుధిష్ఠిరుని దగ్గరకు వెళ్లి, "ఆ సుయోధననితో యుద్ధము చేయుము" అని చెప్పెను.

అగ్ని మహాపురాణములో భారతాఖ్యన మన పదమూడవ అధ్యయము సమాప్తము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana -37 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *

*Chapter 13 - Bharatam*
*🌻 Origin of the Kauravas and Pāṇḍavas - 3 🌻*

20. Yudhiṣṭhira being lost, went to the forest along with the brothers.

21-24. He spent twelve years in the forest as promised (by him) along with (the sage) Dhaumya and Draupadī as the sixth, feeding 88000 twice-borns as before. Then (he) went to the King of Virāṭa, with the other names, the king (Yudhiṣṭhira) unrecognised as the brahmin Kaṅka, Bhīma as the cook, Arjuna as Bṛhannalā, (their) wife (Draupadī) as Sairandhri and the twins. And Bhīmasena killed Kīcaka[3] in the night as he was desirous of winning over Draupadī. And Arjuna conquered the Kurus, who were engaged in seizing and lifting the cows. (Hence) they were recognised as Pāṇḍavas (by the Kurus).

25-28. (Then) Subhadrā, the sister of Kṛṣṇa, gave birth to ABhīmanyu, from Arjuna. And (King) Virāṭa gave his daughter Uttarā to him. Dharmarāja (Yudhiṣṭhira), the master of seven akṣauhiṇī[4], was (ready) for the war. That Kṛṣṇa, the messenger, having gone to the intolerant Duryodhana said to that lord of eleven akṣauhiṇī, “Give half the kingdom or five villages to Yudhiṣṭhira. Or else (you) fight (with him).” Hearing (these) words, Suyodhana (Duryodhana) said to Kṛṣṇa, “I will not give land (even of the size) of a needle tip. I will fight engaged in seizing it.”
Agni said:

29. Having shown the invincible omnipresent form (and) being honoured by Vidura, (Kṛṣṇa) returned to Yudhiṣṭhira and said to Yudhiṣṭhira, “Fight with this Suyodhana (Duryodhana).”

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join 
🌹Agni Maha Purana Channel 🌹
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 172 / Osho Daily Meditations - 172 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 172. నాటకము 🍀*

*🕉. ఒక నాటకంలోని అన్ని పాత్రలను బాగా పోషించగల సామర్థ్యం మీకు వచ్చినప్పుడు, మీరు వాటి నుండి విముక్తి పొందుతారు. 🕉*
 
*పాత్రను పోషించడంలో ఇబ్బంది ఏమిటి? మీరు మరొక పాత్రతో స్థిరపడినందున కష్టం వస్తుంది. అది మీ వ్యక్తిత్వం అని మీరు అనుకుంటారు. మీరు ఒక పాత్ర పోషిస్తున్నారు మరియు మీరు దానితో చాలా గుర్తింపు పొందారు కనుక వేరే పాత్ర అసాధ్యం అనిపిస్తుంది. మీరు గతం నుండి మిమ్మల్ని మీరు వదిలించుకొని, మీ కొత్త పాత్రలోకి వెళ్లగలగాలి. కొత్త పాత్రల్లోకి సులువుగా వెళ్ల గలడమే ఇక్కడ విశేషం. ఆలోచించండి - ఇది కేవలం ఒక పాత్ర, మీరు ఆడుతున్న ఆట. మీ ఆత్మ సారానికి వ్యక్తిత్వం లేదు, పాత్రలు లేవు. ఇది అన్ని పాత్రలను పోషించగలదు.*

*దానికి ఒక స్థిరమైన పాత్ర అంటూ ఏమీ లేదు. అదే అంతర్గత స్వేచ్ఛను అందంగా చేస్తుంది. కాబట్టి కేవలం నటుడిగా ఉండండి. ఒక సినిమాలో ఒక నటి ఒక పాత్ర, మరో సినిమాలో మరో పాత్ర పోషిస్తున్నది అనుకోండి. బహుశా ఉదయం ఆమె ఒక పాత్రలో, సాయంత్రం మరొక పాత్రలో నటిస్తూ ఉంటుంది. ఆమె కేవలం ఒక పాత్ర నుండి మరొక పాత్రకు జారిపోతుంది - అప్పుడు ఎటువంటి సమస్య లేదు, ఎందుకంటే ఇది కేవలం నటన అని ఆమెకు తెలుసు. జీవితమంతా ఇలాగే ఉండాలి. ఏదీ ఒకరిని పూర్తిగా పట్టుకోలేనంతగా పాత్రల్లోకి, పాత్రల నుండి బయటకు జారిపోయేంత సామర్థ్యం కలిగి ఉండాలి. అప్పుడు మీరు మీలో స్వేచ్ఛను అనుభవించడం ప్రారంభిస్తారు. మీ నిజమైన సారాన్ని మీరు అనుభూతి చెందుతారు. లేకపోతే, మీరు ఎల్లప్పుడూ ఒక పాత్రలో పరిమితమై ఉంటారు.*
  
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 172 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 172. PLAY 🍀*

*🕉 Once you become capable of playing roles, you become free of them. 🕉*
 
*What is the difficulty in playing a role? The difficulty comes because you are fixed with another role and you think that is your personality. You have been playing one role, and you have become so identified with it that a different role seems impossible. You will have to loosen yourself from the past and move into your new role. But it is good to move into new roles. And just think-it is just a role, a game that you are playing. Your essence has no personality. Your essence has no roles. It can play all the roles, but it has no character.*

*That's what makes inner freedom beautiful. So just be an actor. In one film the actor is playing one role, in another film another role. Maybe in the morning she is in one role, and in the evening she is in another. She simply slips from one role to another--and there is no problem, because she knows it is just acting. All of life should be like that. One should be so capable of slipping in and out of roles in that nothing holds one. You will start feeling a freedom arising in you, and you will start feeling your real essence. Otherwise you are always confined in a role.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/

https://oshodailymeditations.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 365-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 365-1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 80. చితి, స్తత్పదలక్ష్యార్థా, చిదేక రసరూపిణీ ।*
*స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః ॥ 80 ॥ 🍀*

*🌻 365-1. 'స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః' 🌻* 

*తన ఆనందమందు అనుభూతములైన త్రిమూర్త్యాదుల ఆనందముల సంతతి కలది శ్రీమాత అని అర్థము. ఈశ్వరానందము లేక బ్రహ్మానందము సతతము అపరిమితముగ అనుభవించినది శ్రీమాత. అట్లు అనుభవించు చున్ననూ సృష్టికార్యము జరుపుచునే యుండును. కర్తృత్వము నిర్వహించుట, దైవము నందుండుట ఏక కాలమున జరుగుచున్నవి. ఇది శ్రీమాతకే సాధ్యము. కర్తృత్వ నిర్వహణమున నిలచి యున్నప్పుడు ఈశ్వరునితో కూడి యుండుట అంతగ వీలుపడదు.*

*కర్తృత్వ మున్నప్పుడు అహంకార ముండును. అహంకారము లేక కర్తృత్వము లేదు. ఈశ్వరునితో కూడి తాదాత్మ్య ఆనందమున నున్నప్పుడు కర్తృత్వ ముండదు. దానికి కారణము అహంకారము కరగి యుండుటయే. అట్టి స్థితిలో బ్రహ్మానందము పొందుచూ సృష్టి కార్యములు చక్కపెట్టుట ఎట్లు సాధ్యము? శ్రీమాత కిది సాధ్యమై నిలచినది. పరమ భక్తులకు కూడా ఇది సాధ్య పడినది. తాము దైవము నందు లీనమై యున్నప్పుడు పనులు తాము చేయుటగా గాక తమ నుండి జరుగుచుండును. అపుడవి దివ్యముగ కూడ జరుగు చుండును. ఈ స్థితికి పరాకాష్ఠ శ్రీమాత. తాను దైవము నందుండిననూ సృష్టి జరుగుటకు సంతతిగ లవీ భూతముల నేర్పరచునది శ్రీమాత. లవీ భూతము లనగా సృష్టి, స్థితి, లయము అను కార్యములు నిర్వహించు ప్రజ్ఞలు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 365-1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 80. Chiti statpada lakshyardha chidekarasa rupini*
*Svatyananda lavibhuta bramha dyananda santatih ॥ 80 ॥ 🌻*

*🌻 365-1. Svātmānanda-lavī-bhūta-brahmādyānanda-santatiḥ स्वात्मानन्द-लवी-भूत-ब्रह्माद्यानन्द-सन्ततिः 🌻*

*The sum total of bliss of Gods like Brahma and others is only a droplet of Her bliss. All gods and goddesses enjoy the ānanda or bliss. Brahma and other gods indicate the three actions of the Brahman viz. creation, sustenance and dissolution. Every action of the universe is said to be controlled by a form of god or goddesses. For example Brahma is said to be in charge of creation, Viṣṇu for sustenance and Rudra for destruction, Varuṇa for waters, Agni for fire, etc.*

*But what is bliss? Our real nature is always in the state of bliss or happiness or ānanda whatever you call it. But this perennial nature of bliss is disturbed by the powerful tools of desire and associated losses. Desire is always for the one that one does not possess and loss is a situation where, what one had earlier is not with him now.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 22, శుక్రవారం, ఏప్రిల్ 2022 భృగు వాసరే 🌹

www.facebook.com/groups/hindupuranas/

No comments:

Post a Comment