శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 365-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 365-1
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 365-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 365-1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 80. చితి, స్తత్పదలక్ష్యార్థా, చిదేక రసరూపిణీ ।
స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః ॥ 80 ॥ 🍀
🌻 365-1. 'స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః' 🌻
తన ఆనందమందు అనుభూతములైన త్రిమూర్త్యాదుల ఆనందముల సంతతి కలది శ్రీమాత అని అర్థము. ఈశ్వరానందము లేక బ్రహ్మానందము సతతము అపరిమితముగ అనుభవించినది శ్రీమాత. అట్లు అనుభవించు చున్ననూ సృష్టికార్యము జరుపుచునే యుండును. కర్తృత్వము నిర్వహించుట, దైవము నందుండుట ఏక కాలమున జరుగుచున్నవి. ఇది శ్రీమాతకే సాధ్యము. కర్తృత్వ నిర్వహణమున నిలచి యున్నప్పుడు ఈశ్వరునితో కూడి యుండుట అంతగ వీలుపడదు.
కర్తృత్వ మున్నప్పుడు అహంకార ముండును. అహంకారము లేక కర్తృత్వము లేదు. ఈశ్వరునితో కూడి తాదాత్మ్య ఆనందమున నున్నప్పుడు కర్తృత్వ ముండదు. దానికి కారణము అహంకారము కరగి యుండుటయే. అట్టి స్థితిలో బ్రహ్మానందము పొందుచూ సృష్టి కార్యములు చక్కపెట్టుట ఎట్లు సాధ్యము? శ్రీమాత కిది సాధ్యమై నిలచినది. పరమ భక్తులకు కూడా ఇది సాధ్య పడినది. తాము దైవము నందు లీనమై యున్నప్పుడు పనులు తాము చేయుటగా గాక తమ నుండి జరుగుచుండును. అపుడవి దివ్యముగ కూడ జరుగు చుండును. ఈ స్థితికి పరాకాష్ఠ శ్రీమాత. తాను దైవము నందుండిననూ సృష్టి జరుగుటకు సంతతిగ లవీ భూతముల నేర్పరచునది శ్రీమాత. లవీ భూతము లనగా సృష్టి, స్థితి, లయము అను కార్యములు నిర్వహించు ప్రజ్ఞలు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 365-1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 80. Chiti statpada lakshyardha chidekarasa rupini
Svatyananda lavibhuta bramha dyananda santatih ॥ 80 ॥ 🌻
🌻 365-1. Svātmānanda-lavī-bhūta-brahmādyānanda-santatiḥ स्वात्मानन्द-लवी-भूत-ब्रह्माद्यानन्द-सन्ततिः 🌻
The sum total of bliss of Gods like Brahma and others is only a droplet of Her bliss. All gods and goddesses enjoy the ānanda or bliss. Brahma and other gods indicate the three actions of the Brahman viz. creation, sustenance and dissolution. Every action of the universe is said to be controlled by a form of god or goddesses. For example Brahma is said to be in charge of creation, Viṣṇu for sustenance and Rudra for destruction, Varuṇa for waters, Agni for fire, etc.
But what is bliss? Our real nature is always in the state of bliss or happiness or ānanda whatever you call it. But this perennial nature of bliss is disturbed by the powerful tools of desire and associated losses. Desire is always for the one that one does not possess and loss is a situation where, what one had earlier is not with him now.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
22 Apr 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment