శ్రీ మదగ్ని మహాపురాణము - 37 / Agni Maha Purana - 37


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 37 / Agni Maha Purana - 37 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 13

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. భారతము యొక్క వర్ణనము - 3 🌻


ద్యూతమునందు ఓడిపోయిన యుధిష్ఠిరుడు సోదరులతోడను, ద్రౌపదితోడను, ధౌమ్యునితోడను అరణ్యమునకు వెళ్లి ప్రతిజ్ఞచేసిన విధముగ అచట పండ్రెండు సంవత్సరములు గడపెను. అచట పూర్వము నందు వలె, ప్రతిదివసము నందును, ఎనుబది ఎనిమిదివేలమంది బ్రాహ్మణులకు భోజనము పెట్టుచుండెను.

పిమ్మట వారందరును విరాటుని చేరిరి. యుధిష్ఠిరుడు కంకుడనెడు. బ్రాహ్మణుడుగను, భీముడు వంటవాడుగను, అర్జునుడు బృహన్నలగను అయి ఇతరులకు తెలియ కుండునట్లు అచట నివసించిరి. నకులసహదేవులు వేరు పేర్లుతో ఉండిరి. ద్రౌపదిని హరింప నభిలషించిన కీచకుని భీమ సేనుడు రాత్రివేళ సంహరించెను. గోగ్రహణాదికమును చేయ వచ్చిన కౌరవులను అర్జునుడు జయించెను. అప్పుడు ఆ కౌరవులు వారు పాండవులని గుర్తించిరి. కృష్ణుని సోదరియైన సుభద్రకు అర్జునుని వలన అభిమన్యడను కుమారుడు కలిగెను. విరాటుడు అతనికి తన కుమార్తెయైన ఉత్తర నిచ్చెను.

ధర్మరాజు యుద్ధమునకై ఏడు అక్షౌహిణుల సైన్యమును నన్నద్దము చేసికొనెను. కృష్ణుడు అమర్ష పూర్ణుడును, పదకొండు అక్షోహిణులకు అధిపతియు అగు దుర్యోధనుని వద్దకు దూతగా వెళ్లి - "యుధిష్ఠిరునకు సగము రాజ్యము నిమ్ము. లేదా ఐదు గ్రామాల నైన ఇమ్ము. అట్లు కానిచో యుద్ధము చేయము" అని చెప్పెను. ఆ మాటలు విని సుయోధనుడు శ్రీ కృష్ణునితో ఇట్లు పలికెను.

సుయోధను డిట్లనెను - ''సూది మోపినంత నేల నైనను ఇవ్వను. యుద్దము చేసెదను. యుద్ధమునకై సిద్ధముగా ఉన్నాను." అగ్ని పలికెను. అంత శ్రీ కృష్ణుడు ఎదిరింప శక్యముకాని విశ్వరూపము చూపి, విదురుని చేత పూజింపబడినవాడై, యుధిష్ఠిరుని దగ్గరకు వెళ్లి, "ఆ సుయోధననితో యుద్ధము చేయుము" అని చెప్పెను.

అగ్ని మహాపురాణములో భారతాఖ్యన మన పదమూడవ అధ్యయము సమాప్తము.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Agni Maha Purana -37 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

Chapter 13 - Bharatam

🌻 Origin of the Kauravas and Pāṇḍavas - 3 🌻


20. Yudhiṣṭhira being lost, went to the forest along with the brothers.

21-24. He spent twelve years in the forest as promised (by him) along with (the sage) Dhaumya and Draupadī as the sixth, feeding 88000 twice-borns as before. Then (he) went to the King of Virāṭa, with the other names, the king (Yudhiṣṭhira) unrecognised as the brahmin Kaṅka, Bhīma as the cook, Arjuna as Bṛhannalā, (their) wife (Draupadī) as Sairandhri and the twins. And Bhīmasena killed Kīcaka[3] in the night as he was desirous of winning over Draupadī. And Arjuna conquered the Kurus, who were engaged in seizing and lifting the cows. (Hence) they were recognised as Pāṇḍavas (by the Kurus).

25-28. (Then) Subhadrā, the sister of Kṛṣṇa, gave birth to ABhīmanyu, from Arjuna. And (King) Virāṭa gave his daughter Uttarā to him. Dharmarāja (Yudhiṣṭhira), the master of seven akṣauhiṇī[4], was (ready) for the war. That Kṛṣṇa, the messenger, having gone to the intolerant Duryodhana said to that lord of eleven akṣauhiṇī, “Give half the kingdom or five villages to Yudhiṣṭhira. Or else (you) fight (with him).” Hearing (these) words, Suyodhana (Duryodhana) said to Kṛṣṇa, “I will not give land (even of the size) of a needle tip. I will fight engaged in seizing it.”

Agni said:

29. Having shown the invincible omnipresent form (and) being honoured by Vidura, (Kṛṣṇa) returned to Yudhiṣṭhira and said to Yudhiṣṭhira, “Fight with this Suyodhana (Duryodhana).”


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


22 Apr 2022

No comments:

Post a Comment