🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 363-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 363-1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 80. చితి, స్తత్పదలక్ష్యార్థా, చిదేక రసరూపిణీ ।
స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః ॥ 80 ॥ 🍀
🌻 363-1. 'స్తత్పదలక్ష్యార్థి'తత్' 🌻
పథమును చేర్చుటయే లక్ష్యముగా గలది శ్రీమాత అని అర్థము. 'తత్' అనగా బ్రహ్మము. ఈ బ్రహ్మము అనిర్వచనీయము. చర్చనీయాంశము కానిది. తర్కమున కందనిది. ప్రజ్ఞకు మూలము. సృష్టి యున్నపుడు లేనపుడు కూడ నుండునది. సృష్టికి మూలమైనది. ప్రకృతి పురుషుల కాధారమైనది. స్త్రీ, పుంలింగములకు మూలమై స్త్రీయు పురుషుడు కాక యుండునది.
పరబ్రహ్మము అని, శుద్ధ బ్రహ్మము అని దీనిపేర్లు. దీనిని చేరినవారు తాము లేక అది అయి వుందురు. అదియే మోక్ష స్థితి. దీనిని పరము అని కూడ అందురు. దీని చేరు మార్గము పరమపదము లేక తత్పథము. జీవులను తత్పథము చేర్చుటకు శ్రీమాత నిత్యము కృషి సల్పుచు నుండును. జీవులు శ్రీమాత బిడ్డలు. వారందరూ పరిపూర్ణులు కావలెనని లక్ష్యముగా గొని సృష్టి నిర్మాణమును గావించును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 363-1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 80. Chiti statpadalakshyardha chidekarasa rupini
Svatyanandalavibhuta bramhadyananda santatih ॥ 80 ॥ 🌻
🌻 363-1. Tatpada-lakṣyārthā तत्पद-लक्ष्यार्था 🌻
Tat means that and pada means word. Tatpada (that word) means THAT referring the Brahman. Lakṣyārthā means indirect reference. Tat-tvam-asi or you are That is said to indicate that you are the Brahman where ‘That’ refers to the Brahman.
This goes to prove the omnipresence nature of the Brahman and His non-dualistic nature. The previous nāma discussed about the two forms of the Brahman.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
12 Apr 2022
No comments:
Post a Comment