శ్రీ శివ మహా పురాణము - 548 / Sri Siva Maha Purana - 548


🌹 . శ్రీ శివ మహా పురాణము - 548 / Sri Siva Maha Purana - 548 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 50 🌴

🌻. పరిహాసములు - 3 🌻


అపుడు ఆ దంపతులను చూచుటకు పదునార్గురు దివ్యస్త్రీలు వెంటనే మహాదరమతో విచ్చేసిరి (21). సరస్వతి, లక్ష్మి, సావిత్రి, గంగా, అదితి, శచి, లోపాముద్ర, అరుంధతి (22), అహల్య, తులసి, స్వాహా, రోహిణి, పృథివి, శతరూప, సంజ్ఞ, రతి అను దేవతా స్త్రీలు విచ్చేసిరి (23).

అక్కడ ఉన్న మనోహరలగు దేవకన్యలు, నాగకన్యలు, మునికన్యలు అందరు విచ్చెసిరి. వారి సంఖ్యను చెప్పగలిగే సామర్థ్యము ఎవరికి గలదు? (24) వారు సమర్పించిన రత్నమయమగు ఆసనమునందు శివుడానందముతో కూర్చుండెను. అపుడా దేవీమూర్తులు క్రమముగా ఆయనతో చిరునవ్వుతో గూడిన మధురవచనమునిట్లు పలికిరి (25).

సరస్వతి ఇట్లు పలికెను-

మహాదేవా! ఇపుడు నీకు ప్రాణముల కంటె అధిక ప్రియురాలగు సతీదేవి లభించినది. ఓయి సుందరా! ప్రియురాలి చంద్రుని వంటి ముఖమును చూచి తాపమును వీడుము (26). ఓయీ కాలనియంతా! నీవు సతితో కలిసి కాలమును గడుపుము. మీకు వియోగము ఏ కాలము నందైననూ ఉండబోదు. పార్వతి నాకు ఆశ్రితురాలు కాగలదు (27).

లక్ష్మీ దేవి ఇట్లు పలికెను-

ఓ దేవ దేవా! సిగ్గును వీడి సతిని నీ గుండెలలో దాచు కొనుము. ఆమె లేనిదే నీకు ప్రాణములు నిలువవు. ఆమె విషయములో లజ్ఞ యేల? (28)

సావిత్రి ఇట్లు పలికెను -

ఓ శంభూ! సతిని భుజింపజేసి నీవు శీఘ్రమే భూజించుము. ఖేదమును పొందకుము. తరువాత నీటిని త్రాగి కర్పూర తాంబూలమును ఆమెకు ఆదరముతో నిమ్ము (29).

గంగా దేవి ఇట్లు పలికెను

బంగరు కాంతి గల ప్రియురాలి చేతిని బట్టుకొని కేశములను సరిచేయుము. ప్రభువునకు లభించే సౌభాగ్య సుఖము ఇంతకంటె గొప్పది ఉండబోదు (30).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 548 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 50 🌴

🌻 Description of fun and frolic - 3 🌻


21-23. Then the sixteen celestial ladies arrived there and saw the couple with great respect. They were Sarasvatī, Lakṣmī, Sāvitrī, Jāhnavī, Aditi, Śacī, Lopāmudrā, Arundhatī, Ahalyā, Tulasī, Svāhā, Rohiṇī, Vasundharā, Śatarūpā, Saṃjñā and Rati.

24. There were several virgins of the gods, Nāgas, and the sages. They were charming and attractive. Who can enumerate them?

25. A gemset throne was offered to Śiva who sat on it joyously. The celestial ladies made these sweet witty remarks to Him one by one.


Sarasvatī said:—

26. O great lord, Satī who was more than your life to you has now joyously rejoined you. O lover, seeing the face of your beloved of moonlike splendour, cast off the heat of your distress.

27. Spend your time, O lord of time, in the close embrace of Satī. Thanks to my fervent wish, there will be no separation at any time between you both.


Lakṣmī said:—

28. O lord of gods, leave off your shyness. Take Satī to your bosom and stand close to her. Why do you feel shy of her without whom your vital airs may go off.


Sāvitrī said:—

29. O Śiva, give the sweets to Śatī and eat them yourself. Do not be in a flutter. Perform Ācamana and offer her betel leaves along with camphor.


Jāhnavī said:—

30. Take hold of the hand of your beloved wife glittering with gold and stroke her hair. There is no higher pleasure at the hands of her lover to a loving maiden than this.


Continues....

🌹🌹🌹🌹🌹


12 Apr 2022

No comments:

Post a Comment