🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 178 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. సగుణము - నిర్గుణము-2 🌻సాధన అన్నది గుణమే కాని, నిర్గుణము కాదు. ఏ గుణముల నభ్యసించుట వలన గుణాతీతమగు శాశ్వత సత్యము అనుభవింపబడునో అట్టి గుణములు ఉపాసింపబడనిచో సాధన జరుగదు.
గుణములకును , అంతర్యామికిని ఎప్పుడునూ అవినాభావ సంబంధమున్నది. గుణములు అంతర్యామికి దేహధాతువుల వంటివి. అందు సద్గుణములు ఆరోగ్యవంతమైన దేహమును , దుర్గుణములు వ్యాధిగ్రస్తమైన దేహమును తెలియజేయును.
...✍️ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹
12 Apr 2022
No comments:
Post a Comment