నిర్మల ధ్యానాలు - ఓషో - 177
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 177 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. నువ్వు ఉన్నత శిఖరాన్ని అధిరోహించినపుడు, మనసు మాయమైనపుడు, నువ్వు పూర్తి చైతన్యంతో వుంటావు. అక్కడ ఎట్లాంటి లక్ష్యము వుండదు. స్వచ్ఛమయిన ఆత్మాశ్రయం వుంటుంది. అదే సమాధి. అట్లాంటి స్థితిని అందుకోనిదే ఏ మనిషి పరిపూర్ణుడు కాడు.🍀
నిజమైన మార్మికుడు యింద్రియాల్ని నియంత్రించేవాడు, శరీరాన్ని హింసించేవాడు కాదు. అతను జీవితాన్ని ప్రేమిస్తాడు. జీవితాన్ని ఆనందిస్తాడు. కారణం జీవితం దేవుని సృష్టి. నిజమైన మార్మికుడు సంగీతంతో నిండి వుంటాడు. అతని ప్రతి పదము పాటే! అర్థవంతమైందే. అతని ప్రతి కదలికా నాట్యమే.అతని ప్రతి చూపూ ఉత్సవమే! అది కేవలం చైతన్యం వల్లనే సంభవం. నువ్వు ఉన్నత శిఖరాన్ని అధిరోహించి నపుడు, అంతకు మించినదేదీ అక్కడ లేనప్పుడు, మనసు మాయమైనపుడు, నువ్వు పూర్తి చైతన్యంతో వుంటావు.
అక్కడ ఎట్లాంటి లక్ష్యము వుండదు. స్వచ్ఛమయిన ఆత్మాశ్రయం వుంటుంది. అదే సమాధి. అప్పుడు నీ అస్తిత్వం నించీ వేల పాటలు మొదలవుతాయి. వేల పూలు వికసిస్తాయి. అట్లాంటి స్థితిని అందుకోనిదే ఏ మనిషి పరిపూర్ణుడు కాడు. ఎవడు సంతృప్తి పడడు. మనిషి స్వర్గ సంబంధమయిన అనంతృప్తిని తనతో బాటు మోసుకెళ్ళాలి. సమాధి స్థితి కోసం తపించాలి. అనంత చైతన్యం కోసం ఆరాటపడాలి. అది ప్రతి వ్యక్తికీ వీలవుతుంది. అది ప్రతి మనిషి జన్మ హక్కు మనం దాన్ని అందుకోవాలి.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
10 May 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment