మైత్రేయ మహర్షి బోధనలు - 116


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 116 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 90. తగ్గింపు ధరలు -2🌻

విలువైన విషయములు బజారున కెక్కించుట సంస్కృతి కాదు. పవిత్రమగు విషయములను జాగ్రత్తగ, మరుగుగ ఉంచి కాపాడు కొనుట బాధ్యత. సృష్టిలో అన్నిటికన్న పవిత్రమైనది, అమూల్యమైనది జ్ఞానము - దాని కొఱకై వెదకు కొనువారికి దానినందించ వలెను. అట్లు కానిచో నిరుపయోగము. ఆసక్తి లేని వారికి జ్ఞానము నందించినచో వారు కూడ తమకందిన దానిని ప్రచారమే చేయుదురు కాని, దాని వలన ప్రచోదనము చెందరు.

జ్ఞానము ప్రచోదనమునకే కాని, ప్రచారమునకు కాదు. ప్రచారకులకు జ్ఞానము విలువ తెలియదు. వారు గురువును సహితము వెలగట్టి అమ్మగలరు. అవసరమైనచో ప్రత్యేక తగ్గింపు ధరలకు కూడ అమ్మివేయగలరు. మేము కోరునది ప్రచోదకులను మాత్రమే. ప్రచారకులు మాత్రము కాదు.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


10 May 2022

No comments:

Post a Comment