🌹 కపిల గీత - 6 / Kapila Gita - 6🌹
2) 🌹. శివ మహా పురాణము - 562 / Siva Maha Purana - 562 🌹
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 46 / Agni Maha Purana - 46🌹
4) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 181 / Osho Daily Meditations - 181🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 370-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 370-2 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ బుధవారం మిత్రులందరికీ 🌹*
*సౌమ్య వాసరే, 11, మే 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*పండుగలు మరియు పర్వదినాలు : Thrissur Pooram*
*🍀. శ్రీ నారాయణ కవచం - 3 🍀*
*నారాయణమయం వర్మ సన్నహ్యేద్భయ ఆగతే |*
*దైవభూతాత్మకర్మభ్యో నారాయణమయః పుమాన్*
*పాదయోర్జానునోరూర్వోరుదరే హృద్యథోరసి |*
*ముఖే శిరస్యానుపూర్వ్యాదోంకారాదీని విన్యసేత్*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : అన్ని మానసిక రూపములను పరిత్యజించుట,గాఢమయిన మానసిక పరిమితుల నివృత్తియే పరమాత్మ లేక బ్రహ్మము. - సద్గురు శ్రీరామశర్మ 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, వైశాఖ మాసం
ఉత్తరాయణం, వసంత ఋతువు
తిథి: శుక్ల-దశమి 19:32:59 వరకు
తదుపరి శుక్ల-ఏకాదశి
నక్షత్రం: పూర్వ ఫల్గుణి 19:28:16 వరకు
తదుపరి ఉత్తర ఫల్గుణి
యోగం: వ్యాఘత 19:25:05 వరకు
తదుపరి హర్షణ
కరణం: తైతిల 07:32:36 వరకు
వర్జ్యం: 02:56:40 - 04:35:48
మరియు 26:40:54 - 28:17:06
దుర్ముహూర్తం: 11:46:45 - 12:38:20
రాహు కాలం: 12:12:32 - 13:49:16
గుళిక కాలం: 10:35:49 - 12:12:32
యమ గండం: 07:22:21 - 08:59:05
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:37
అమృత కాలం: 12:51:28 - 14:30:36
సూర్యోదయం: 05:45:37
సూర్యాస్తమయం: 18:39:27
చంద్రోదయం: 14:11:46
చంద్రాస్తమయం: 02:15:48
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: సింహం
స్థిర యోగం - శుభాశుభ మిశ్రమ ఫలం
19:28:16 వరకు తదుపరి వర్ధమాన
యోగం - ఉత్తమ ఫలం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
#PanchangDaily
#DailyTeluguCalender
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కపిల గీత - 6 / Kapila Gita - 6🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*📚. ప్రసాద్ భరధ్వాజ*
*🌴. తన తల్లి దేవహూతి బాధ్యతను కపిల ప్రభువు వహించుట 🌴*
*6. తమాసీనమ కర్మాణం తత్త్వమార్గాగ్ర దర్శనమ్*
*స్వసుతం దేవహూత్యాహ ధాతుః సంస్మరతీ వచః*
*దేవహూతి, ఆశ్రమములో కూర్చుని ఉన్నా, ఏ కర్మ ఫలమునూ ఆశించకుండా ఉన్న, తత్వ సమూహం తెలిసిన వాడైన కొడుకుని దేవహూతి అడిగింది. కపిలుడిని పుత్రునిగా పొందనపుడే, బ్రహ్మ వచ్చి "నీ గర్భములో ఉండి అవతరించబోతున్న పరమాత్మ నీకు తత్వము చెప్పి బంధము తొలగిస్తాడు" అని చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. ఆ వాక్యాన్ని స్మరించి కపిలుడిని ప్రశించింది.*
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Kapila Gita - 6 🌹*
*✍️ Swami Prabhupada.*
*📚 Prasad Bharadwaj*
*🌴 Lord Kapila Takes Charge of His Mother, Devahuti 🌴*
*6. tam asinam akarmanam tattva-margagra-darsanam*
*sva-sutam devahuty aha dhatuh samsmarati vachah*
*When Kapila, who could show her the ultimate goal of the Absolute Truth, was sitting leisurely before her, Devahuti remembered the words Brahma had spoken to her, and she therefore began to question Kapila as
follows.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#కపిలగీత #KapilaGita
#కపిలగీతKapilaGita
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 562 / Sri Siva Maha Purana - 562 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 53 🌴*
*🌻. శివుని కైలాస యాత్ర - 4 🌻*
మేన ఇట్లు పలికెను -
ఓ దయానిధీ! నీవు దయచేసి పార్వతిని చక్కగా పాలించుము. తేలికగా సంతసించు నీవు ఆపార్వతి యొక్క వేయి దోషములను క్షమించుము (30). నా కుమార్తె జన్మ జన్మల యందు నీ పాదపద్మములపై భక్తి కలిగి యుండెను. ఆమె తెలివిగా ఉన్ననూ, కలగన్ననూ ఆమె స్మృతిలో మహాదేవ ప్రభుడు లేని కాలము లేదు (31). ఆమె నీ భక్తి గురించి విన్నంత మాత్రాన ఆనందముతో కన్నీరు గార్చెడిది. శరీరము గగుర్పొడిచెడిది. ఓ మృత్యుంజయా ! నిన్ను నిందించినచో ఆమె మరణించిన దానివలె మౌనముగ నుండెడిది (32).
బ్రహ్మ ఇట్లు పలికెను-
మేనక ఇట్లు పలికి అపుడు తన కుమార్తెను ఆయనకు సమర్పించి బిగ్గరగా రోదించి వారిద్దరి యెదుట మూర్ఛిల్లెను (33). అపుడు ఆ మేనకు తెలివి వచ్చునట్లు చేసి శివుడు మేనా హిమవంతుల అనుమతిని పొంది దేవతలతో గూడి మహోత్సవముతో యాత్రను చేసెను (34). అపుడా దేవతలందరు శివుని గణములతో కూడి యాత్రను మొదలిడిరి. వారు మౌనముగా హిమవంతునకు మంగళాశాసనమును చేసిరి (35). హిమవంతుని నగరము యొక్క బాహ్యో ద్యానవనమునందు దేవతలు శివునితో గూడి ఉత్సాహముతో ఆనందముతో వేచియుండిరి. వారు పార్వతి రాకను ప్రతీక్షించుచుండిరి (36).
ఓ మహర్షీ! దేవతలతో గూడిన శివుని యాత్రను ఇంత వరకు వర్ణించితిని. వియోగ దుఃఖముతో మరియు ఆనందముతో కలిసియున్న పార్వతి యాత్రను ఇపుడు వినుము (37).
శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహితయుందు పార్వతీ ఖండలో యాత్రను వర్ణించే ఏబదిమూడవ అధ్యాయము ముగిసినది (53).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 562 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 53 🌴*
*🌻 Description of Śiva’s return journey - 4 🌻*
Menā said:—
30. O merciful lord, do mercifully protect Pārvatī. You are quickly pleased. Hence you will please forgive even a thousand faults in her.
31. My dear daughter is devoted to your lotus-like feet in every birth. Even sleeping or awake she does not think about anything else.
32. O conqueror of death, even on hearing about your devotion she is filled with tears of pleasure and horripilation. On hearing your censure she becomes silent as though dead.
Brahmā said:—
33. Saying this, Menakā dedicated her daughter to Him and crying aloud became unconscious in front of them.
34. When she regained consciousness, Śiva took leave of her and the mountain and set on journey with the gods jubilantly.
35. The gods with the lord and His Gaṇas started on their journey silently. They wished the mountain well.
36-37. The lord and the gods waited in a part outside the city of Himavat for the arrival of Pārvatī there. O great sage, thus I have narrated the journey of Śiva. Now listen to the journey of Pārvatī and of her departure with festivities.
Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 46 / Agni Maha Purana - 46 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 17*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*🌻. సృష్టి వర్ణనము - 2 🌻*
ఉదకములో నున్న ఆ వీర్యము బంగారు వర్ణము గల అండముగా అయెను. దానియందు స్వయంభు దైన బ్రహ్మ జనించెనని మేము వింటిమి.
భగవంతుడైన హిరణ్యగర్భుడు ఆ అండము నందు పరివత్సరము కాలముండి, దానిని రెండు వ్రక్కలుగా చేసి ద్యులోకమును, భూలోకమును నిర్మించెను ఆ రెండు వ్రక్కల మధ్మ యందు ఆకాశమును సృజించెను.
ఉదకము నుందు తేలుచున్న భూమిని, పది దిక్కులను సృజించెను. అచట కాలమును, మనస్సును, వాక్కును, కామమును, క్రోధమును, మరియు రతిని నిర్మించెను. ప్రజాపతి ఈ రాబోవు సృష్టిని పైన చెప్పిన ఆకాశాదులతో సంబంధించిన దానినిగా చేయదలచి, ముందుగా వాటిని సృజించెను.
మేఱుపులను, వజ్రమును (పిడుగును). మేఘములను, రక్తమును, ఇంద్రధనస్సును లేదా ఎఱ్ఱని రంగుగల ఇంద్రధనుస్సులను, పక్షులను వర్జన్యుని సృజించెను పిదప యజ్ఞసిదికొరకై ముఖమునుండి బుగ్యజుఃసామవేదములను సృజించెను.
ఆ వేదములచే సాధ్యులను, దేవతలను ఉద్దేశించి యజ్ఞము చేసెను. అనేక విధముల లగు భూతములను సృజించెను. భుజమునుండి సనత్కుమారుని, క్రోధమునుండి రుద్రుని సృజించెను. మరీచి, ఆత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు. క్రతువు, వసిష్ఠుడు అనువారిని సృజించెను. ఈ ఏడుగురును బ్రహ్మమానసపుత్రు లగు బ్రహ్మ లని ప్రసిద్ది చెందిరి. ఈ సప్త బ్రహ్మలును. రుద్రులను ప్రజాసృష్టి చేసిరి.
తన దేహమును రెండు భాగములుగా చేసి. ఒక భాగము పురుసుడు గాను, మరొక భాగము స్త్రీగాను అయి బ్రహ్మ ఆమె యందు ప్రజలను సృజించెను.
అగ్ని మహాపురాణమునందు జగత్సృష్టివర్ణన మను సప్తదశాధ్యాయము సమాప్తము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 46 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *
*Chapter 17*
*🌻 Description of Creation - 2 🌻*
9-10. From that, Brahmā was born of his own accord, whom we know as the self-born (Svayambhū). Having lived (in it) for one full year, the Hiraṇyagarbha,[5] made that egg into two, the heaven and the earth. Between those two pieces, the lord created the sky.
11-13. The ten directions supported the earth floating on the waters. Then the lord of the beings (Prajāpati) desirous of creation, created time, mind, speech, desire, anger, attachment and other counter-parts. From the lightning he created thunder and clouds, the rain-bow and birds. He first created Parjanya (Indra). Then he created the Ṛk hymns (Ṛcaḥ), Yajur hymns (Yajūṃṣi) and the Sāman hymns (Sāmāni) for accomplishing the sacrifice.
14. Those who want to accomplish, worship devas with these (hymns). The higher and lower beings (were created) from the arms. He created Sanatkumāra and Rudra, born of anger.
15. He then created the sages Marīci, Atri, Aṅgirasa, Pulastya, Pulaha, Kratu, Vasiṣṭha, who are regarded as the:seven mind-born sons of Brahmā.
16. O! Excellent one! these seven (sages) procreated (many) beings and the Rudras. Having divided his body into two, he became a male with one half and a female with another. 'Then Brahmā procreated children through her (the female half).
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join
🌹Agni Maha Purana Channel 🌹
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 181 / Osho Daily Meditations - 181 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*
*🍀 181. జ్ఞాపకం 🍀*
*🕉. అంతా దైవమే! ఇది మీ మొదటి ప్రాథమిక జ్ఞాపకంగా ఉండనివ్వండి - ఇది మిమ్మల్ని పూర్తిగా మార్చగలదు. 🕉*
*అన్నీ పరమాత్మ అని మీరు చాలాసార్లు మరచిపోవడం సహజం; దాని గురించి చింతించకండి. మీరు మళ్ళీ గుర్తుచేసుకున్న క్షణం, అది అక్కడ ఉండనివ్వండి. ఒక్క గంట మర్చిపోయానని పశ్చాత్తాప పడకు. అది సహజం. ఇది చాలా పాత అలవాటు; చాలా జీవితాలు మనం ఆ అలవాటులో జీవించాము. కనుక ఇది సహజం. దాని గురించి దోషంగా భావించ వద్దు.*
*ఇరవై నాలుగు గంటలలో కొన్ని సెకన్ల పాటు మీరు గుర్తుంచుకోగలిగితే కూడా చాలు. పని జరిగి పోతుంది. ఎందుకంటే నిజం చాలా చాలా శక్తివంతమైనది. మీ అసత్య ప్రపంచాన్ని నాశనం చేయడానికి దానిలోని ఒక చిన్న చుక్క సరిపోతుంది. వేల సంవత్సరాల చీకటిని నాశనం చేయడానికి ఒక్క కాంతి కిరణం సరిపోతుంది. కాబట్టి ఇది పరిమాణం యొక్క ప్రశ్న కాదు, గుర్తుంచుకోండి. మీరు రోజుకు ఇరవై నాలుగు గంటలు గుర్తుంచుకోవడం ప్రశ్న కాదు - మీరు ఎలా చేయగలరు దానిని? కానీ ఒక రోజు మీరు అకస్మాత్తుగా అసాధ్యమైనది సాధ్యమవడం చూస్తారు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 181 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 181. REMEMBERANCE 🍀*
*🕉 All is divine! Let this be your first fundamental - It can change you utterly. 🕉*
*It is natural that you will forget that all is divine many times; don't be worried about that. The moment you remember again, let it be there. Don't repent that you forgot for one hour. That is natural. It is such an old habit; for many lives we have lived in the habit. So it is natural. Don't feel guilty about it.*
*If you can remember even for a few seconds out of twenty-four hours, that will do-because truth is so potential, so powerful, that a small drop of it is enough to destroy your whole world of untruth. Just one ray of light is enough to destroy the darkness of thousands of years. So it is not a question of quantity, remember. It is not a question of your remembering twenty-four hours a day--how can you? But one day you will suddenly see that the impossible has become the possible.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://oshodailymeditations.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 370-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 370-2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 81. పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా ।*
*మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా ॥ 81 ॥ 🍀*
*🌻 370 -2. ‘మధ్యమా’🌻*
*ఒకే విషయమును పలువురు చూచినపుడు, వినునపుడు ఎవరి భావము వారికి కలుగును. గ్రహించుట యందలి వ్యత్యాసమే దీనికి కారణము. విషయమునందు వ్యత్యాసము లేనప్పటికిని, చూచువారిని బట్టి వ్యత్యాస మేర్పడు చుండును. తత్కారణముగ భావ వైవిధ్యము సామాన్యము. ఇతరులు రంగుటద్దములలో చూచునట్లుగ చూతురు. కావున వారికి వివిధములై గోచరించును. అపార్థము లన్నియూ అట్లే యేర్పడుచుండును.*
*రామ పట్టాభిషేక సమయమున హనుమంతుని నవ్వు అట్లే అపార్థము కలిగించినది. అట్లే రాజసూయమున మయసభలో ద్రౌపది నవ్వు అపార్థము కలిగించినది. సామాన్యుల జీవితములందు అపార్థములు కోకొల్లలు. వాని ననుసరించి మాట లుండును. మాటలు బట్టి ఘర్షణ యుండును. పరమును స్పృశించిన వారియందే పశ్యంతి సత్యదర్శన మిచ్చును. అట్టి వారియందే భావములు సత్యమం దుండును. ఇట్లు సత్య స్వరూపిణిగ నుండు భావము మధ్యమ అని కొనియాడబడుచున్నది. అట్టి వారి భాషణము కూడ సత్యమునే ప్రకటించును.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 370 -2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*
*🌻 81.Parapratyakchitirupa pashyanti paradevata*
*Madhyama vaikharirupa bhaktamanasa hansika ॥ 81 ॥ 🌻*
*🌻 370-2. Madhyamā मध्यमा 🌻*
*Mantra-s are chanted and recited in this stage only. This is because, while reciting mantra japa-s, only the inner Self alone should listen to the mantra-s and not anybody else, not even one’s etheric body.*
*In this stage only the uttering self alone can listen to the sound. Whisper develops from this stage. Step by step of Her manifestation in the form of sound is discussed in these nāma-s*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment