శ్రీ శివ మహా పురాణము - 562 / Sri Siva Maha Purana - 562


🌹 . శ్రీ శివ మహా పురాణము - 562 / Sri Siva Maha Purana - 562 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 53 🌴

🌻. శివుని కైలాస యాత్ర - 4 🌻



మేన ఇట్లు పలికెను -

ఓ దయానిధీ! నీవు దయచేసి పార్వతిని చక్కగా పాలించుము. తేలికగా సంతసించు నీవు ఆపార్వతి యొక్క వేయి దోషములను క్షమించుము (30). నా కుమార్తె జన్మ జన్మల యందు నీ పాదపద్మములపై భక్తి కలిగి యుండెను. ఆమె తెలివిగా ఉన్ననూ, కలగన్ననూ ఆమె స్మృతిలో మహాదేవ ప్రభుడు లేని కాలము లేదు (31). ఆమె నీ భక్తి గురించి విన్నంత మాత్రాన ఆనందముతో కన్నీరు గార్చెడిది. శరీరము గగుర్పొడిచెడిది. ఓ మృత్యుంజయా ! నిన్ను నిందించినచో ఆమె మరణించిన దానివలె మౌనముగ నుండెడిది (32).

బ్రహ్మ ఇట్లు పలికెను-

మేనక ఇట్లు పలికి అపుడు తన కుమార్తెను ఆయనకు సమర్పించి బిగ్గరగా రోదించి వారిద్దరి యెదుట మూర్ఛిల్లెను (33). అపుడు ఆ మేనకు తెలివి వచ్చునట్లు చేసి శివుడు మేనా హిమవంతుల అనుమతిని పొంది దేవతలతో గూడి మహోత్సవముతో యాత్రను చేసెను (34). అపుడా దేవతలందరు శివుని గణములతో కూడి యాత్రను మొదలిడిరి. వారు మౌనముగా హిమవంతునకు మంగళాశాసనమును చేసిరి (35). హిమవంతుని నగరము యొక్క బాహ్యో ద్యానవనమునందు దేవతలు శివునితో గూడి ఉత్సాహముతో ఆనందముతో వేచియుండిరి. వారు పార్వతి రాకను ప్రతీక్షించుచుండిరి (36).

ఓ మహర్షీ! దేవతలతో గూడిన శివుని యాత్రను ఇంత వరకు వర్ణించితిని. వియోగ దుఃఖముతో మరియు ఆనందముతో కలిసియున్న పార్వతి యాత్రను ఇపుడు వినుము (37).

శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహితయుందు పార్వతీ ఖండలో యాత్రను వర్ణించే ఏబదిమూడవ అధ్యాయము ముగిసినది (53).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 SRI SIVA MAHA PURANA - 562 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 53 🌴

🌻 Description of Śiva’s return journey - 4 🌻


Menā said:—

30. O merciful lord, do mercifully protect Pārvatī. You are quickly pleased. Hence you will please forgive even a thousand faults in her.

31. My dear daughter is devoted to your lotus-like feet in every birth. Even sleeping or awake she does not think about anything else.

32. O conqueror of death, even on hearing about your devotion she is filled with tears of pleasure and horripilation. On hearing your censure she becomes silent as though dead.


Brahmā said:—

33. Saying this, Menakā dedicated her daughter to Him and crying aloud became unconscious in front of them.

34. When she regained consciousness, Śiva took leave of her and the mountain and set on journey with the gods jubilantly.

35. The gods with the lord and His Gaṇas started on their journey silently. They wished the mountain well.

36-37. The lord and the gods waited in a part outside the city of Himavat for the arrival of Pārvatī there. O great sage, thus I have narrated the journey of Śiva. Now listen to the journey of Pārvatī and of her departure with festivities.


Continues....

🌹🌹🌹🌹🌹



11 May 2022

No comments:

Post a Comment