శ్రీ మదగ్ని మహాపురాణము - 46 / Agni Maha Purana - 46
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 46 / Agni Maha Purana - 46 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 17
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
🌻. సృష్టి వర్ణనము - 2 🌻
ఉదకములో నున్న ఆ వీర్యము బంగారు వర్ణము గల అండముగా అయెను. దానియందు స్వయంభు దైన బ్రహ్మ జనించెనని మేము వింటిమి.
భగవంతుడైన హిరణ్యగర్భుడు ఆ అండము నందు పరివత్సరము కాలముండి, దానిని రెండు వ్రక్కలుగా చేసి ద్యులోకమును, భూలోకమును నిర్మించెను ఆ రెండు వ్రక్కల మధ్మ యందు ఆకాశమును సృజించెను.
ఉదకము నుందు తేలుచున్న భూమిని, పది దిక్కులను సృజించెను. అచట కాలమును, మనస్సును, వాక్కును, కామమును, క్రోధమును, మరియు రతిని నిర్మించెను. ప్రజాపతి ఈ రాబోవు సృష్టిని పైన చెప్పిన ఆకాశాదులతో సంబంధించిన దానినిగా చేయదలచి, ముందుగా వాటిని సృజించెను.
మేఱుపులను, వజ్రమును (పిడుగును). మేఘములను, రక్తమును, ఇంద్రధనస్సును లేదా ఎఱ్ఱని రంగుగల ఇంద్రధనుస్సులను, పక్షులను వర్జన్యుని సృజించెను పిదప యజ్ఞసిదికొరకై ముఖమునుండి బుగ్యజుఃసామవేదములను సృజించెను.
ఆ వేదములచే సాధ్యులను, దేవతలను ఉద్దేశించి యజ్ఞము చేసెను. అనేక విధముల లగు భూతములను సృజించెను. భుజమునుండి సనత్కుమారుని, క్రోధమునుండి రుద్రుని సృజించెను. మరీచి, ఆత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు. క్రతువు, వసిష్ఠుడు అనువారిని సృజించెను. ఈ ఏడుగురును బ్రహ్మమానసపుత్రు లగు బ్రహ్మ లని ప్రసిద్ది చెందిరి. ఈ సప్త బ్రహ్మలును. రుద్రులను ప్రజాసృష్టి చేసిరి.
తన దేహమును రెండు భాగములుగా చేసి. ఒక భాగము పురుసుడు గాను, మరొక భాగము స్త్రీగాను అయి బ్రహ్మ ఆమె యందు ప్రజలను సృజించెను.
అగ్ని మహాపురాణమునందు జగత్సృష్టివర్ణన మను సప్తదశాధ్యాయము సమాప్తము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 46 🌹
✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj
Chapter 17
🌻 Description of Creation - 2 🌻
9-10. From that, Brahmā was born of his own accord, whom we know as the self-born (Svayambhū). Having lived (in it) for one full year, the Hiraṇyagarbha,[5] made that egg into two, the heaven and the earth. Between those two pieces, the lord created the sky.
11-13. The ten directions supported the earth floating on the waters. Then the lord of the beings (Prajāpati) desirous of creation, created time, mind, speech, desire, anger, attachment and other counter-parts. From the lightning he created thunder and clouds, the rain-bow and birds. He first created Parjanya (Indra). Then he created the Ṛk hymns (Ṛcaḥ), Yajur hymns (Yajūṃṣi) and the Sāman hymns (Sāmāni) for accomplishing the sacrifice.
14. Those who want to accomplish, worship devas with these (hymns). The higher and lower beings (were created) from the arms. He created Sanatkumāra and Rudra, born of anger.
15. He then created the sages Marīci, Atri, Aṅgirasa, Pulastya, Pulaha, Kratu, Vasiṣṭha, who are regarded as the:seven mind-born sons of Brahmā.
16. O! Excellent one! these seven (sages) procreated (many) beings and the Rudras. Having divided his body into two, he became a male with one half and a female with another. 'Then Brahmā procreated children through her (the female half).
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
11 May 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment