శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 370-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 370-2
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 370-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 370-2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 81. పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా ।
మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా ॥ 81 ॥ 🍀
🌻 370 -2. ‘మధ్యమా’🌻
ఒకే విషయమును పలువురు చూచినపుడు, వినునపుడు ఎవరి భావము వారికి కలుగును. గ్రహించుట యందలి వ్యత్యాసమే దీనికి కారణము. విషయమునందు వ్యత్యాసము లేనప్పటికిని, చూచువారిని బట్టి వ్యత్యాస మేర్పడు చుండును. తత్కారణముగ భావ వైవిధ్యము సామాన్యము. ఇతరులు రంగుటద్దములలో చూచునట్లుగ చూతురు. కావున వారికి వివిధములై గోచరించును. అపార్థము లన్నియూ అట్లే యేర్పడుచుండును.
రామ పట్టాభిషేక సమయమున హనుమంతుని నవ్వు అట్లే అపార్థము కలిగించినది. అట్లే రాజసూయమున మయసభలో ద్రౌపది నవ్వు అపార్థము కలిగించినది. సామాన్యుల జీవితములందు అపార్థములు కోకొల్లలు. వాని ననుసరించి మాట లుండును. మాటలు బట్టి ఘర్షణ యుండును. పరమును స్పృశించిన వారియందే పశ్యంతి సత్యదర్శన మిచ్చును. అట్టి వారియందే భావములు సత్యమం దుండును. ఇట్లు సత్య స్వరూపిణిగ నుండు భావము మధ్యమ అని కొనియాడబడుచున్నది. అట్టి వారి భాషణము కూడ సత్యమునే ప్రకటించును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 370 -2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 81.Parapratyakchitirupa pashyanti paradevata
Madhyama vaikharirupa bhaktamanasa hansika ॥ 81 ॥ 🌻
🌻 370-2. Madhyamā मध्यमा 🌻
Mantra-s are chanted and recited in this stage only. This is because, while reciting mantra japa-s, only the inner Self alone should listen to the mantra-s and not anybody else, not even one’s etheric body.
In this stage only the uttering self alone can listen to the sound. Whisper develops from this stage. Step by step of Her manifestation in the form of sound is discussed in these nāma-s
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
11 May 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment