27 - JUNE - 2022 MONDAY MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 27, జూన్ 2022 సోమవారం, ఇందు వాసరే Monday 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 223 / Bhagavad-Gita - 223 - 5- 19 కర్మ యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 622 / Vishnu Sahasranama Contemplation - 622🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 301 / DAILY WISDOM - 301🌹  
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 201 🌹
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 140 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. 27, June 2022 పంచాగము - Panchangam 🌹*
*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : మాసిక శివరాత్రి, రోహిణి వ్రతం, Masik Shivaratri, Rohini Vrat🌻*

*🍀. రుద్రనమక స్తోత్రం - 30 🍀*

*57. ఆతప్యాయ నమస్తుభ్యం వాత్యాయచ నమోనమః!*
*రేష్మియాయ నమస్తుభ్యం వాస్తవ్యాయ చ తే నమః!!*
*58. వాస్తుపాయ నమస్తుభ్యం నమస్సోమాయతే నమః!*
*నమో రుద్రాయ తామ్రాయాప్యరుణాయ చ తే నమః!!*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : ఏ మతములో పుట్టినా మానస శరీరధారికి ఒకే ధర్మము ఉంటుంది. ఆ ధర్మమే శ్రీచక్రము. మానవ శరీర ధర్మాన్ని తెలిపేదే శ్రీవిద్య. - మాస్టర్‌ ఆర్‌.కె. - మాస్టర్‌ ఆర్‌.కె.🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, జేష్ఠ మాసం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: కృష్ణ చతుర్దశి 29:53:28 వరకు
తదుపరి అమావాశ్య
నక్షత్రం: రోహిణి 16:03:40 వరకు
తదుపరి మృగశిర
యోగం: శూల 06:47:34 వరకు
తదుపరి దండ
కరణం: విష్టి 16:39:11 వరకు
వర్జ్యం: 07:04:00 - 08:51:48
మరియు 22:21:28 - 24:09:36
దుర్ముహూర్తం: 12:45:25 - 13:38:04
మరియు 15:23:23 - 16:16:03
రాహు కాలం: 07:22:53 - 09:01:37
గుళిక కాలం: 13:57:49 - 15:36:33
యమ గండం: 10:40:21 - 12:19:05
అభిజిత్ ముహూర్తం: 11:53 - 12:45
అమృత కాలం: 12:27:24 - 14:15:12
సూర్యోదయం: 05:44:09
సూర్యాస్తమయం: 18:54:01
చంద్రోదయం: 04:03:35
చంద్రాస్తమయం: 17:35:19
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: వృషభం
వర్ధమాన యోగం - ఉత్తమ ఫలం 16:03:40
వరకు తదుపరి ఆనంద యోగం - కార్య సిధ్ధి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 223 / Bhagavad-Gita - 223 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 19 🌴*

*19. ఇహైవ తైర్జిత: సర్గో యేషాం సామ్యే స్థితం మన: |*
* నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రాహ్మణి తే స్థితా: ||*

🌷. తాత్పర్యం :
*సమానత్వము మరియు ఏకత్వములందు మనస్సు నెలకొనినట్టివారు జననమరణస్థితిని జయించినట్టివారే. వారు బ్రహ్మము వలె దోషరహితులైనట్టి వారు. ఆ విధముగా వారు బ్రహ్మమునందు స్థితిని కలిగినట్టివారే యగుదురు.*

🌷. భాష్యము :
పైన తెలిపిన విధముగా మనస్సు నందలి సమానత్వము ఆత్మానుభవపు చిహ్నమై యున్నది. అట్టి స్థితిని పొందినవారిని జన్మమృత్యువుల వంటి భౌతికస్థితులను జయించినవారుగా భావింపవలెను. దేహముగా ఆత్మగా భావించు దేహాత్మభావనము కలిగియున్నంతవరకు మనుజుడు బద్ధునిగా భావింపబడినను, ఆత్మజ్ఞానము ద్వారా సమత్వస్థితికి ఉద్ధరింపబడినంతనే బద్ధజీవితము నుండి ముక్తిని పొందినవాడగును. 

అనగా మరణానంతరము అతడు తిరిగి ఈ భౌతికజగమున జన్మను పొందక ఆధ్యాత్మికజగమున ప్రవేశించును. రాగద్వేషములు లేనందున భగవానుడు దోషరహితుడైనట్లే, జీవుడును రాగద్వేషముల నుండి విడివడినప్పుడు దోషరహితుడై ఆధ్యాత్మికజగమున ప్రవేశించుటకు అర్హతను పొందును. అట్టివానిని ముక్తపురుషునిగానే భావింపవలెను. అతని లక్షణములు తరువాతి శ్లోకములో వర్ణింపబడినవి.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 223 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 5 - Karma Yoga - 19 🌴*

*19. ihaiva tair jitaḥ sargo yeṣāṁ sāmye sthitaṁ manaḥ*
*nirdoṣaṁ hi samaṁ brahma tasmād brahmaṇi te sthitāḥ*

🌷 Translation : 
*Those whose minds are established in sameness and equanimity have already conquered the conditions of birth and death. They are flawless like Brahman, and thus they are already situated in Brahman.*

🌹 Purport :
Equanimity of mind, as mentioned above, is the sign of self-realization. Those who have actually attained to such a stage should be considered to have conquered material conditions, specifically birth and death. As long as one identifies with this body, he is considered a conditioned soul, but as soon as he is elevated to the stage of equanimity through realization of self, he is liberated from conditional life. 

In other words, he is no longer subject to take birth in the material world but can enter into the spiritual sky after his death. The Lord is flawless because He is without attraction or hatred. Similarly, when a living entity is without attraction or hatred, he also becomes flawless and eligible to enter into the spiritual sky. Such persons are to be considered already liberated, and their symptoms are described below.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://www.tumblr.com/blog/bhagavadgitawisdom
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 622/ Vishnu Sahasranama Contemplation - 622🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 622. సత్కీర్తిః, सत्कीर्तिः, Satkīrtiḥ🌻*

*ఓం సత్కీర్తయే నమః | ॐ सत्कीर्तये नमः | OM Satkīrtaye namaḥ*

*సతీత్యవితధా కీర్తిర్యస్య సత్కీర్తిరేవ సః*

*అసత్యము కాని, సత్యమైన కీర్తి ఈతనికి కలదు.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 622🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻622. Satkīrtiḥ🌻*

*OM Satkīrtaye namaḥ*

*सतीत्यवितधा कीर्तिर्यस्य सत्कीर्तिरेव सः / Satītyavitadhā kīrtiryasya satkīrtireva saḥ*

*His renown is ever true, never belied.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
स्वक्षस्स्वङ्गश्शतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः ।विजितात्मा विधेयात्मा सत्कीर्तिश्छिन्नसंशयः ॥ ६६ ॥

స్వక్షస్స్వఙ్గశ్శతానన్దో నన్దిర్జ్యోతిర్గణేశ్వరః ।విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్ఛిన్నసంశయః ॥ 66 ॥

Svakṣassvaṅgaśśatānando nandirjyotirgaṇeśvaraḥ,Vijitātmā vidheyātmā satkīrtiśchinnasaṃśayaḥ ॥ 66 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 301 / DAILY WISDOM - 301 🌹*
*🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 27. నిజంగా మనస్సు అంటూ ఏమీ లేదు, కానీ ప్రతిదీ చేస్తుంది 🌻*

*ఒక చోట స్వామి శివానందజీ మహారాజ్ హాస్యాస్పదంగా ప్రస్తావించారు, మనస్సు అనేది నిజంగా ఏమీ లేనిది, కానీ ప్రతిదీ చేస్తుంది. ఇది ప్రపంచం - ఇది నిజంగా అక్కడ లేదు, కానీ ఇది భయంకరమైనది. కారణం లేకుండానే లేని పాత్రను భయంకరంగా పోషిస్తుంది. నిరంతరం మారుతున్న విలువల కారణంగా 'అవాస్తవం' యొక్క వాస్తవికత సాధ్యమవుతుంది. అవాస్తవం యొక్క స్పష్టమైన నిర్మాణంలోకి నిజమైన పాత్ర చొప్పించబడింది. అందువల్ల అవాస్తవం వాస్తవంగా కనిపిస్తోంది.*

*మన అవగాహనలోని వచ్చిన విషయాలకు, వస్తువులకు మనల్ని మనం బదిలీ చేసుకుంటాము. వస్తువుల వాస్తవికతపై మన నమ్మకానికి కారణం మన ఉనికి యొక్క వాస్తవిక నేపథ్యం. బయటకు ఇవన్నీ తెలియవు, ఎందుకంటే మన స్వంత వ్యక్తిత్వానికి కారణమైన నేపథ్యం మనకు తెలియదు, ఎందుకంటే మనం మన స్వంత భుజాల పైకి ఎక్కలేము, లేదా మన వెనుక వైపు మనం చూడలేము, లేదా మన స్వంత కళ్ళు మనం చూడలేము. మన వ్యక్తిత్వం ద్వారా చూపించబడిన, తెలియ పరచిన వివరాల నుంచి మన నిజ ఉనికిని తెలుసుకోలేము. మనం పెద్ద గందరగోళంలో చిక్కుకున్నాము. ఇది మొత్తం ఒక రుగ్మత.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 301 🌹*
*🍀 📖 from The Study and Practice of Yoga 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 27. The Mind Really Nothing, but does Everything 🌻*

*In one place Swami Sivanandaji Maharaj has mentioned in a humorous way that the mind is something which is really nothing, but does everything. This is the world—it is really not there, but it is terrible. That terrific character of it, which is not there, is due to something else that has taken place. There is a transposition of values, on account of which the reality of ‘unreal' becomes possible. The character of the real is injected into the apparent formation of the unreal, and then the unreal looks like a reality.*

*We transfer ourselves to the objects in our perceptions, and then it is the reality of the background of our being which is the cause for our belief in the reality of objects. All this is unknown because the causative background of our own individuality cannot be known by us since we cannot climb on our own shoulders, or look at our own back, or see our own eyes, etc. Because of the fact that the causes of our individual existence cannot be known by the faculties with which the individuality has been endowed, we are caught up in a confusion—a mess, which is a total disorder.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 201 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. నాకు కచ్చితంగా తెలుసునన్న వాడు మూర్ఖుడు. బుద్ధిహీనులు, మొండి మనుషులు. మేథకు కావలసినన్ని తీర్మానాలు. హృదయమెప్పుడూ అమాయకమైంది. తెలుసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా వుంటుంది. హృదయమెప్పుడూ పసిపాపే.🍀*

*వివేకవంతుడికి తనకు తెలిసింది ఎంతో అల్పమని తెలుసు. బుద్ధిహీనుడికి మాత్రమే తనకు చాలా తెలుసన్న భావన వుంటుంది. నాకు కచ్చితంగా తెలుసునన్నవాడు మూర్ఖుడు. బుద్ధిహీనులు మొండిమనుషులు. తమ జ్ఞానోదయాన్ని పొందామని భీష్మిస్తారు. వాళ్ళ తీర్మానాల్ని అందరిపై రుద్దడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు జనం పట్ల ప్రేమగా వుంటారు. సోక్రటీస్ నాకు ఒక్క సంగతి మాత్రమే తెలుసు. అది ఏమిటంటే నాకు ఏమీ తెలీదు.*

*పాశ్చాత్య ప్రపంచంలో ఆ నాటి నించీ ఉన్నతోన్నతమైన వ్యక్తి ఆయనే. ఆయన ఆనాటి నించే బుద్ధులలో ఒకడయ్యాడు. ఆనాటి నించీ ఆయన ఫిలాసఫర్ కాడు. ఆనాటి నించీ ఆయన జ్ఞానోదయం పొందిన వ్యక్తి. మేథకు కావలసినన్ని తీర్మానాలు. హృదయమెప్పుడూ అమాయకమైంది. తెలుసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా వుంటుంది. హృదయమెప్పుడూ పసిపాపే. మెదడు ఎప్పుడూ ముసలిదే. తల ఎప్పుడూ యవ్వనాన్ని పొందదు. హృదయమెప్పుడూ ముసల్ది కాదు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 140 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 106. విచికిత్సలు - 1🌻*

*మీ మానవ సంఘము నందు అధికారమును గూర్చి, హక్కులను గూర్చి, సహకారమును గూర్చి సుహృత్ భావమును గూర్చి అనేకానేక విచికిత్సలు జరుగుచుండును. అట్లే పేదరిక నిర్మూలనమును గూర్చి అనారోగ్య పరిస్థితులను గూర్చి, రోగములను గూర్చి ఆరోగ్యమును గూర్చి సదస్సులు జరుగు చుండును. సంఘమందలి సమస్త సమస్యలను గూర్చి, కోట్లాది ధనము ఖర్చుచేయుచు భౌగోళికముగ విచికిత్సలు జరుగుచుండును. సదస్సులలో తీర్మానములు కూడ చేయుచుందురు. ఆచరణ అంతంతమాత్రమే.*

*విచికిత్స ఎక్కువ, ఆచరణ తక్కువ. ఈ విచికిత్స జాతికి ప్రధానమైన రుగ్మతగా మాకు గోచరించు చుండును. సదస్సులు నిర్వహించి, విచికిత్సచేసి, కారణములు వెదకి, తీర్మానములు చేసి, వాటిని ఉల్లంఘించుట చేయుదురు. 'ఉల్లంఘించుటకే కదా తీర్మానములు !' అను భావము కూడ హాస్యముగ మీరు వ్యక్తము చేయుదురు. అందు సత్యము సమృద్ధిగా నున్నదని గమనింపవలెను.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #ChaitanyaVijnanam #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

No comments:

Post a Comment