🍀 10 - SEPTEMBER - 2022 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🍀

 🌹🍀 10 - SEPTEMBER - 2022 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🍀🌹
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 06, శనివారం, సెప్టెంబరు 2022 స్థిర వాసరే  SATURDAY 🌹
🌴. భాద్రపద పూర్ణిమ శుభాకాంక్షలు, విశిష్టత - Bhadrapada Poornima Wishes and Speciality 🌴
2) 🌹 కపిల గీత - 68 / Kapila Gita - 68 🌹 సృష్టి తత్వము - 24
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 107 / Agni Maha Purana - 107 🌹
4) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 242 / Osho Daily Meditations - 242 🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 403 - 5 / Sri Lalitha Chaitanya Vijnanam - 403 - 5 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹10, September 2022 పంచాగము - Panchagam  🌹*
*శుభ శనివారం, Saturday, స్థిర వాసరే*
🌴. భాద్రపద పూర్ణిమ శుభాకాంక్షలు, విశిష్టత - Bhadrapada Poornima Wishes and Speciality 🌴
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు :  భాద్రపద పూర్ణిమ,  Bhadrapada Purnima🌻*

*🍀. శ్రీ శని అష్టోత్తరశతనామ స్తోత్రం - 7 🍀*

*13. జ్యేష్ఠాపత్నీసమేతాయ శ్రేష్ఠాయ మితభాషిణే*
*కష్టౌఘనాశకార్యాయ పుష్టిదాయ నమో నమః*
*14. స్తుత్యాయ స్తోత్రగమ్యాయ భక్తివశ్యాయ భానవే*
*భానుపుత్రాయ భవ్యాయ పావనాయ నమో నమః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి :  ప్రకృతికి దర్పణం పట్టడమే నీ పనియైతే నీవు చేపే పనికి ప్రకృతి ఎంత మాత్రమూ సంతోషించదు. ఏలనంటే, నీవు దర్పణం పట్టేది ఆమె నిజ స్వరూపానికి కాదనీ, నిర్జీవమైన ఆమె ఛాయకు మాత్రమేననీ తెలుసుకో.  🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, దక్షిణాయణం,
వర్ష ఋతువు, భాద్రపద మాసం
తిథి: పూర్ణిమ 15:30:52 వరకు
తదుపరి కృష్ణ పాడ్యమి
నక్షత్రం: శతభిషం 09:38:42 వరకు
తదుపరి పూర్వాభద్రపద
యోగం: ధృతి 14:54:48 వరకు
తదుపరి శూల
కరణం: బవ 15:32:52 వరకు
వర్జ్యం: 15:35:40 - 17:05:20
దుర్ముహూర్తం: 07:41:56 - 08:31:13
రాహు కాలం: 09:08:11 - 10:40:35
గుళిక కాలం: 06:03:22 - 07:35:47
యమ గండం: 13:45:23 - 15:17:47
అభిజిత్ ముహూర్తం: 11:48 - 12:36
అమృత కాలం: 03:00:24 - 04:28:32
మరియు 24:33:40 - 26:03:20
సూర్యోదయం: 06:03:22
సూర్యాస్తమయం: 18:22:36
చంద్రోదయం: 18:36:43
చంద్రాస్తమయం: 05:45:03
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: కుంభం
ఆనంద యోగం - కార్య సిధ్ధి 09:38:42
వరకు తదుపరి కాలదండ యోగం
- మృత్యు భయం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో  నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం  దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. భాద్రపద పూర్ణిమ విశిష్టత / Speciality of Bhadrapada Purnima🌹*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. సత్యనారాయణ స్వామి ఆరాధన -  ఉమా మహేశ్వర వ్రతం 🍀*

*భాద్రపద మాసంలో పూర్ణిమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున విష్ణువు రూపమైన సత్యనారాయణ స్వామికి పూజలు చేస్తారు.  అదే రోజు, ఉమా-మహేశ్వర ఉపవాసం కూడా చేస్తారు. ఈ రోజు కూడా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఎందుకంటే అదే రోజు పితృపక్షం వస్తోంది. ఈ రోజున పితృదేవతలకు అర్ఘ్యమివ్వడం.. గోమాతకు అవిసె ఆకులు ఇవ్వడం శుభ ఫలితాలను ఇస్తాయి.*

*భాద్రపద పూర్ణిమ నాడు సత్యనారాయణ స్వామిని ఆరాధించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి. ఉదయం నిద్రలేచి శుచిగా స్నానమాచరించాలి. తీర్థాలు, కొలను, చెరువుల్లో అయితే మంచిది. సత్యనారాయణ వ్రతం ఆచరించడం.. పూజకు పువ్వులు, ప్రసాదం సమర్పించడం చేయాలి. సత్యనారాయణ కథకు విన్న తర్వాత ప్రసాదాన్ని తీసుకోవడం మరవకూడదు. ఆపై బ్రాహ్మణులకు వస్త్రదానం చేయాలి.*

*అలాగే ఉమా మహేశ్వర వ్రతం కూడా ఈ రోజు ఆచరించవచ్చు. భాద్రపద పూర్ణిమ రోజున ఉపవాసం చేస్తారు. ఉమా-మహేశ్వర వ్రతం మహిళలకు చాలా ముఖ్యం. దాని ప్రభావంతో, మహిళలు దీర్ఘ సుమంగళీ ప్రాప్తాన్ని సంపాదించుకోవచ్చు. వారికి తెలివైన సంతానంతో పాటు అదృష్టం కూడా వరిస్తుంది.*

*🌴. పూజ ఎలా చేయాలంటే? 🌴*

*శివపార్వతి దేవి విగ్రహాన్ని, లేదా పటాన్ని పూజ గదిలో వుంచి, వారికి ధూపం, దీపం, అత్తరు, పువ్వులు సమర్పించాలి. స్వచ్ఛమైన నెయ్యితో కలిపిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి.*

*మత్స్య పురాణంలో ఉమా-మహేశ్వర వ్రతం ప్రస్తావించ బడింది. ఒకసారి దుర్వాస మహర్షి భగవంతుడు శంకరుని దర్శనం ముగించి తిరిగి వస్తుండగా,  మార్గమధ్యంలో శ్రీ మహా విష్ణువును కలిశాడు. శివుడు విష్ణువుకు ఇచ్చిన బిల్వ మాలను ఆయనకు కానుకగా ఇచ్చారు. విష్ణువు దానిని గరుడ మెడలో వేశాడు. ఇది చూసిన మహర్షి దుర్వాసకు కోపం వచ్చి అతన్ని శపించాడు.*

*విష్ణువును హెచ్చరించాడు. శివుడిని అగౌరవపరిచారు. కాబట్టి, శ్రీ మహాలక్ష్మి నుంచి దూరమవుతారని విష్ణువును శపిస్తాడు. క్షీర సాగరం నుంచి మీరు దూరమవుతారని.. శేషనాగు కూడా మీకు సహకరించదని శపిస్తాడు. ఇది విన్న విష్ణువు గౌరవంగా శాపం నుండి విముక్తి పొందటానికి పరిష్కారాన్ని అడిగాడు.*

*అప్పుడే దుర్వాస మహర్షి ఉమా-మహేశ్వర వ్రతం ఆచరించాలని ఉపాయం చెప్తాడు. ఆ రోజు ఉపవాసం చేయమని మహర్షి వెల్లడిస్తాడు. అలా ఉమామహేశ్వర వ్రతం ఆచరించిన తర్వాతే శ్రీ మహా విష్ణువు లక్ష్మీదేవిని తిరిగి పొందగలిగాడని పురాణాలు చెప్తున్నాయి.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Speciality of Bhadrapada Purnima 🌹*
*Prasad Bharadwaj*

*🍀. Worship of Lord Satyanarayana - Uma Maheswara Vratam 🍀*

*Purnima is very important in Bhadrapada month. On this day, worship is done to Lord Satyanarayana, a form of Lord Vishnu. On the same day, Uma-Maheswara fast is also observed. Today is also very important. Because on the same day Pitrupaksha is coming. On this day offering arghyam to the patriarchs..giving flax leaves to the cow gives good results.*

*By worshiping Lord Satyanarayana on Bhadrapada Purnima, evils will be removed. Wake up in the morning and take a clean bath. It is good if it is in shrines, pool and ponds. Observance of Satyanarayana Vrat.. flowers and prasad should be offered for the puja. After listening to the story of Satyanarayana, don't forget to take prasad. And then the Brahmins should be clothed.*

*Also Uma Maheswara Vrat can be performed on this day. Fasting is observed on Bhadrapada Purnima day. Uma-Maheswara Vrat is very important for women. Due to its influence, women can gain husbands long life span. They will be blessed with intelligent children and good fortune.*

*🌴. How to do pooja? 🌴*

*Place an idol or picture of Goddess Shivaparvati in the worship room. Incense, lamp, attar and flowers should be offered to them. Prasad mixed with pure ghee should be offered as an offering.*

*The Uma-Maheswara Vrata is mentioned in the Matsya Purana. Once Durvasa Maharshi was returning after seeing Lord Shankara, he met Sri Maha Vishnu on the way. Lord Shiva gave Vishnu the Bilva Mala as a gift. Vishnu put it on Garuda's neck. Seeing this, Maharishi Durvasa got angry and cursed him.*

*Warned Vishnu. Shiva was disrespected. So, he curses Vishnu to get away from Sri Mahalakshmi. He curses that you will be far away from the milky sea.. Even Seshanagu will not cooperate with you. Hearing this, Vishnu respectfully asked for a solution to be freed from the curse.*

*Then Durvasa Maharishi advises Uma-Maheswara Vrat to be performed. The sage advises to fast on that day. Puranas say that Lord Vishnu was able to get back Goddess Lakshmi only after performing Umamaheswara Vrat.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. కపిల గీత - 68 / Kapila Gita - 68🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴  2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 24 🌴*

*24. వైకారికస్తైజసశ్చ తామసశ్చ యతో భవః*
*మనసశ్చేన్ద్రియాణాం చ భూతానాం మహతామపి*

*మహత్తత్త్వము వికారము చెందుట వలన దాని నుండి క్రియాశక్తి ప్రధానమైన అహంకారము ఉత్పన్నమాయెను. ఇది వైకారికము, తైజసము, తామసము అని మూడు విధములు. దీని నుండి క్రమముగా మనస్సు, ఇంద్రియములు, పంచ మహాభూతములు ఉత్పన్నము లైనవి.*

*ఈ మహత్ తత్వము నుండే వైకారిక (సాత్విక, వికారములు గలిగిన మనసుని సృష్టించేది కాబట్టి వైకారికం అని పేరు) అహంకారం, తైజస (రాజస), తామస అహంకారం. వైకారికం నుండి మనసు, రాజసం నుండి ఇంద్రియములు, తామసం నుండి పంచభూతములు పుట్టాయి.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 68 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 2. Fundamental Principles of Material Nature - 24 🌴*

*24.  vaikārikas taijasaś ca tāmasaś ca yato bhavaḥ*
*manasaś cendriyāṇāṁ ca  bhūtānāṁ mahatām api*

*From the mahat-tattva these three types good, passionate and ignorant of material ego that the mind, the senses of perception, the organs of action, and the gross elements evolve.*

*False ego is the basic principle for all material activities, which are executed in the modes of material nature. As soon as one deviates from pure consciousness, he increases his entanglement in material reaction. The entanglement of materialism is the material mind, and from this material mind, the senses and material organs become manifest.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 107 / Agni Maha Purana - 107 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚.  ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః  ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 34*

*🌻. హోమ విధి - అగ్ని కార్య కథనము  - 1🌻*

అగ్నిదేవుడు పలికెను :
సాధకుడు ఈ ''ఓం హ్రీం శ్రీం శ్రీధరాయ త్రైలోక్యమోహనాయ నమః'' అను మంత్రము చదువుచు యాగమండపమును ప్రవేశింపవలెను. యజ్ఞశాలను అలంకరింపవలెను. (ఈ క్రింది శ్లోకమును చదువుచు భగవంతునకు నమస్కారము చేయవలెను). ''వేదములకును బ్రాహ్మణులకును హితమును చేయు, అవ్యయ స్వరూపు డగు శ్రీధరునకు నమస్కారము. బుగ్యజుః సామాథర్వవేదములు విష్ణుస్వరూప మైనవి. శబ్దము లన్నియు విష్ణుస్వరూపమే.

అట్టి, భగవంతు డైన విస్ణువునకు నమస్కారము'' సాయంకాలమున సర్వతోభద్రము మొదలగు మండలముల రచన చేసి పూజాద్యుపయుక్తము లగు ద్రవ్యములను సమకూర్చుకొనవలెను. కాళ్లు చేతులు కడుగుకొనవలెను. ఆ యా ద్రవ్యములను తగు స్థానము లందుంచి, చేతితో అర్ఘ్యము గ్రహించి, ఆ జలముతో తన శిరముపై ప్రోక్షించుకొనవలెను. ద్వారాదిప్రదేశములందు నీళ్లు చల్లవలెను. ద్వారయాగ (ద్వారస్థ ) దేవతా పూజా ప్రారంభము చేయవలెను.

మొదటతోరణాధిపతులను బాగుగా పూజింపవలెను. తూర్పు మొదలగు దిక్కులలో అశ్వత్థ-ఉదుమ్బర-వట-ప్లక్ష వృక్షములను పూజింపవలెను. ఇవి కాక, తూర్పున బుగ్వేదమును, ఇంద్రుని, శోభనుని, దక్షిణమున యజుర్వేదమును, యముని, సుభద్రుని పశ్చిమమున సామవేదమును, వరుణుని సుదన్వుని, ఉత్తరమున అథర్వవేదమును, సోముని, సుహోత్రుని పూజింపవలెను.

తోరనము (ద్వారము) లోపల పతాకలు కట్టి రెండేసి కలశములను స్థాపింపవలెను. కుముదము మొదలగు దిగ్గజములను పూజింపవలెను. ఒక్కొక్క గుమ్మమువద్దను ఇద్ద రిద్దరు ద్వారపాలకును, వారి నామమంత్రములు చదువుచు పూజింపవలెను. తూర్పున పూర్ణ-పుష్కరులు, దక్షిణమున అనంద-నందనులు, పశ్చిమమున వీరసేన- సుషేణులు, ఉత్తరమున సంభవ-ప్రభవులు అను ద్వారపాలులను పూజింపవలెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 107 🌹*
*✍️ N. Gangadharan  📚. Prasad Bharadwaj *

*Chapter 34*
*🌻 Mode of performing oblation - 1 🌻*

Agni said:

1-2. One has to enter the sacrificial ground with the following mystic syllable and adorn it. “Salutations to the brahman, the lord, Śrīdhara (and) undecaying self, the form of Ṛg, Yajur and Sāma (veda), (possessing) a body (composed) of sound (and) Viṣṇu. Having drawn the circular altar in the evening, one has to bring materials for the sacrifice.

3. Having washed hands and feet and made assignment, and taken the arghya (respectful offering) in the hands one should sprinkle the arghya on the head and the gate-way.

4. He should then begin sacrifice at the gateway. He should worship the presiding deity of the arch. The aśvattha[1], udumbara[2], vaṭa[3] and plakṣa[4] are the trees of the east.

5. The Ṛg (veda) is the ornament of Indra on the west. The Yajur (veda) is auspicious for Yama. The Sāma (veda) is of the water-god and is known as Sudhanvan. The Atharva (veda) is of Soma (and is called) Suhotraka.

6. The edges of the gate, flags, (gate-keepers) Kumuda etc. and two pitchers should be adored at every door by their respective names, as well as a pitcher full of water in the east.

7. Then one should worship the guards of the doors—Ānanda, Nandana, Dakṣa, Vīrasena, Suṣeṇaka, Sambhava and Prabhava in the north (Saumya)[5].

8. One should enter after having removed obstacles by throwing flowers and the repetition of names of weapons. Having performed purificatory rites of the elements and the assignment (of limbs) one should show the posture of hands.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 242 / Osho Daily Meditations  - 242 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀 242. అమాయకమైన సాన్నిహిత్యం 🍀*

*🕉. మీరు ఒక వ్యక్తిని ప్రేమిస్తారు, మీరు అతని ఉనికిని పంచుకుంటారు, మీరు అతనితో మీ ఉనికిని పంచుకుంటారు, మీరు స్థలాన్ని పంచుకుంటారు. అదే ప్రేమ అంటే, ఇద్దరు వ్యక్తులకు చెందిన తటస్థ స్థలాన్ని సృష్టించడం - ఇద్దరికీ చెందిన లేదా ఇద్దరికీ చెందని స్థలం. 🕉*
 
*దృష్టి ప్రేమగా ఉండాలి. మీరు ఒక వ్యక్తిని ప్రేమిస్తారు, మీరు అతని ఉనికిని పంచుకుంటారు, మీరు అతనితో మీ ఉనికిని పంచుకుంటారు, మీరు స్థలాన్ని పంచుకుంటారు.  అదే ప్రేమ అంటే, ఇద్దరు వ్యక్తులకు చెందిన తటస్థ స్థలాన్ని సృష్టించడం - ఇద్దరికీ చెందిన లేదా ఇద్దరికీ చెందని స్థలం. ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక చిన్న స్థలం, అక్కడ వారు ఇద్దరూ కలుసుకుంటారు మరియు కలిసిపోతారు మరియు కరిగిపోతారు.*

*ఆ స్థలానికి భౌతిక స్థలంతో సంబంధం లేదు. ఇది కేవలం ఆధ్యాత్మికం. ఆ ప్రదేశంలో మీరు మీరు కాదు, మరొకరు మరొకరు కాదు. మీరిద్దరూ ఆ ప్రదేశంలోకి వస్తారు మరియు మీరు కలుసుకోవడం జరుగుతుంది. ఎదుటి వ్యక్తిని మోసం చేయాలనే ఉద్దేశ్యం మనసుకు లేనప్పుడు, ఆ కలయిక  స్వచ్ఛమైన, అమాయకమైన సాన్నిహిత్యం.*
 
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 242 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 242. Innocent intimacy 🍀*

*🕉. You love a person, you share his existence, you share your existence with him, you share space. That's love, creating a neutral space where two people belong - a space that belongs to both or neither. 🕉*
 
*The focus should be love. You love a person, you share his existence, you share your existence with him, you share space. That's love, creating a neutral space where two people belong - a space that belongs to both or neither. A small space between two people where they both meet and mingle and merge.*

*That space has nothing to do with physical space. It is simply spiritual. In that space you are not you, and the other is not the other. You both come into that space and you meet. When there is no intention of deceiving the other person, then that union is pure and innocent intimacy.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 403 - 5 / Sri Lalitha Chaitanya Vijnanam  - 403 - 5 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀  87. వ్యాపినీ, వివిధాకారా, విద్యాఽవిద్యా స్వరూపిణీ ।*
*మహాకామేశ నయనా కుముదాహ్లాద కౌముదీ ॥ 87 ॥ 🍀*

*🌻 403. 'మహాకామేశ నయనా కుముదాహ్లాద కౌముదీ ' - 5 🌻*

*కౌముది అనగా వెన్నెల అని తెలుపబడినది. వెన్నెల జీవుల స్థూల శరీరముపై ప్రభావము చూపును. ఆ సమయమున ప్రార్థనలు, ధ్యానము చేయువారికి సూక్ష్మశరీర నిర్మాణము జరుగును. ఆ శరీరము దివ్యకాంతితో కూడినదియై దైవమును చేరుటకు ఉపకరించును. ఇట్లు శ్రీమాత దయతో భక్తులను భగవంతుని వద్దకు చేర్చు కృషి సలుపు చున్నదని ఈ నామమున సూక్ష్మముగ తెలుపబడినది.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 403 - 5 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma   📚. Prasad Bharadwaj*

*🌻 87. Vyapini vividhakara vidya vidya svarupini*
*Mahakameshanayana kumudahlada kaomudi ॥ 87 ॥ 🌻*

*🌻 403. 'Mahakamesha Nayana Kumudahlada Kaumudi' - 5 🌻*

*Kaumudi is said to mean moonlight. Moonlight has an effect on the physical bodies of beings. Subtle bodies form in the moonlight for those who do prayers and meditation at that time. That subtle body is filled with divine light and helps to reach God. In this name it is subtly indicated that it is Srimata's efforts and grace which bring the devotees to God.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

No comments:

Post a Comment