1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 11, సెప్టెంబర్ 2022 ఆదివారం, భాను వాసరే SUNDAY 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 261 / Bhagavad-Gita -261 - 6-28 ధ్యాన యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 660 / Vishnu Sahasranama Contemplation - 660 🌹
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 622 / Sri Siva Maha Purana - 622 🌹
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 339 / DAILY WISDOM - 339 🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 239 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹11, September 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : ద్వైత శ్రద్ధ, Dwitiya Shraddha🌻*
*🍀. ఆదిత్య స్తోత్రం - 03 🍀*
*03. నిర్గచ్ఛన్తోఽర్కబింబాన్ని ఖిలజనిభృతాం హార్దనాడీప్రవిష్టాః*
*నాడ్యో వస్వాదిబృన్దారకగణ మధునస్తస్య నానాదిగుత్థాః |*
*వర్షన్తస్తోయముష్ణం తుహిన మపి జలాన్యాపిబన్తః సమన్తాత్*
*పిత్రాదీనాం స్వధౌషధ్యమృత రసకృతో భాన్తి కాన్తిప్రరోహాః*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : నీవు పట్టుకోవలసినది ప్రకృతి గుప్తాత్మను. ఏ నిత్యసత్యానికి ఆమె ఛాయారూపం నిత్య ప్రతీకయో దాని కొరకే నీవు నిత్యమూ అన్వేషించవలసి వున్నది. అన్వేషించే నిన్ను గాని, అన్వేషించబడే ప్రకృతిని గాని ఏదర్పణాలూ పట్టజాలవు. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, దక్షిణాయణం,
వర్ష ఋతువు, భాద్రపద మాసం
తిథి: కృష్ణ పాడ్యమి 13:16:44 వరకు
తదుపరి కృష్ణ విదియ
నక్షత్రం: పూర్వాభద్రపద 08:03:23
వరకు తదుపరి ఉత్తరాభద్రపద
యోగం: శూల 11:59:21 వరకు
తదుపరి దండ
కరణం: కౌలవ 13:19:43 వరకు
వర్జ్యం: 17:13:12 - 18:45:04
దుర్ముహూర్తం: 16:43:19 - 17:32:32
రాహు కాలం: 16:49:29 - 18:21:46
గుళిక కాలం: 15:17:12 - 16:49:29
యమ గండం: 12:12:38 - 13:44:55
అభిజిత్ ముహూర్తం: 11:48 - 12:36
అమృత కాలం: 00:33:40 - 02:03:20
మరియు 26:24:24 - 27:56:16
సూర్యోదయం: 06:03:30
సూర్యాస్తమయం: 18:21:46
చంద్రోదయం: 19:16:24
చంద్రాస్తమయం: 06:43:20
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: మీనం
చర యోగం - దుర్వార్త శ్రవణం
08:03:23 వరకు తదుపరి స్థిర
యోగం - శుభాశుభ మిశ్రమ ఫలం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 261 / Bhagavad-Gita - 261 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 28 🌴*
*28. యుంజన్నేవం సదాత్మానం యోగీ విగతకల్మష: |*
*సుఖేన బ్రహ్మసంస్పర్శమత్యన్తం సుఖమశ్నుతే ||*
🌷. తాత్పర్యం :
*ఆ విధముగా ఆత్మనిగ్రహుడైన యోగి నిరంతరము యోగము నభ్యసించును భౌతికకల్మషములకు దూరుడై, భగవానుని దివ్యమైన ప్రేమయుతసేవ యందు అత్యున్నతమైన పూర్ణానందస్థితిని పొందును.*
🌷. భాష్యము :
భగవానుని సంబంధములో తన నిజస్థితిని మనుజుడు తెలిసికొనగలుగుటయే ఆత్మానుభవమనబడును. ఆత్మ శ్రీకృష్ణభగవానుని అంశయైనందున ఆ దేవదేవునికి సేవను గూర్చుటయే దాని నిజస్థితియై యున్నది. ఆత్మకు భగవానునితో గల ఇట్టి దివ్యసంబంధమే “బ్రహ్మసంస్పర్శ” మని పిలువబడును.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 261 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 6 - Dhyana Yoga - 28 🌴*
*28. yuñjann evaṁ sadātmānaṁ yogī vigata-kalmaṣaḥ*
*sukhena brahma-saṁsparśam atyantaṁ sukham aśnute*
🌷 Translation :
*Thus the self-controlled yogī, constantly engaged in yoga practice, becomes free from all material contamination and achieves the highest stage of perfect happiness in transcendental loving service to the Lord.*
🌹 Purport :
Self-realization means knowing one’s constitutional position in relationship to the Supreme. The individual soul is part and parcel of the Supreme, and his position is to render transcendental service to the Lord. This transcendental contact with the Supreme is called brahma-saṁsparśa.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 660 / Vishnu Sahasranama Contemplation - 660🌹*
*🌻660. ధనఞ్జయః, धनञ्जयः, Dhanañjayaḥ🌻*
*ఓం ధనంజయాయ నమః | ॐ धनंजयाय नमः | OM Dhanaṃjayāya namaḥ*
*అర్జునో యద్దిగ్విజయో ప్రభూతమజయద్ధనమ్ ।*
*ధనఞ్జయాఖ్యోఽర్జునోఽపి స్వాభేదేనోచ్యతే హరిః ।*
*పాణ్డవానాం ధనఞ్జయ ఇతిగీతా సమీరణాత్ ॥*
*ధర్మరాజు చేసిన రాజసూయ యాగమునకై దిగ్విజయ కాలము నందు అత్యధికమగు ధనమును జయించి తెచ్చెనుగనుక అర్జునునకు ధనంజయుడు అను పేరు గలదు. శ్రీమద్భగవద్గీత (10.30) లో గీతాచార్యుడు 'పాణ్డవానాం ధనఞ్జయః' అనగా పాండవులలో ధనంజయుడను నేనే అను వచనమును బట్టి ఆ అర్జునుడూ శ్రీ విష్ణుదేవుని విభూతియే.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 660🌹*
*🌻660. Dhanañjayaḥ🌻*
*OM Dhanaṃjayāya namaḥ*
अर्जुनो यद्दिग्विजयो प्रभूतमजयद्धनम् ।
धनञ्जयाख्योऽर्जुनोऽपि स्वाभेदेनोच्यते हरिः ।
पाण्डवानां धनञ्जय इतिगीता समीरणात् ॥
*Arjuno yaddigvijayo prabhūtamajayaddhanam,*
*Dhanañjayākhyo’rjuno’pi svābhedenocyate hariḥ,*
*Pāṇḍavānāṃ dhanañjaya itigītā samīraṇāt.*
*Arjuna acquired, by conquest abundant wealth required for the Rājasūya Yajña performed by Dharmarāja and Hence Arjuna has the name of Dhanañjaya also; and in Śrīmad Bhagavad Gīta Lord Himself said 'Pāṇḍavānāṃ Dhanañjayaḥ' meaning I am Arjuna amongst the pāṇḍavānās.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
कामदेवः कामपालः कामी कान्तः कृतागमः ।अनिर्देश्यवपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ॥ ७० ॥
కామదేవః కామపాలః కామీ కాన్తః కృతాగమః ।అనిర్దేశ్యవపుర్విష్ణుర్వీరోఽనన్తో ధనఞ్జయః ॥ 70 ॥
Kāmadevaḥ kāmapālaḥ kāmī kāntaḥ krtāgamaḥ,Anirdeśyavapurviṣṇurvīro’nanto dhanañjayaḥ ॥ 70 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 622 / Sri Siva Maha Purana - 622 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 09 🌴*
*🌻. దేవాసురసంగ్రామ వర్ణన - 5 🌻*
ప్రతాపశాలి, బలవంతుడు అగు వీరభద్రుడు త్రిశూలమునెత్తి రాక్షసరాజగు తారకుని గట్టిగా కొట్టెను (47). అపుడాతడు ఆ త్రిశూలపు దెబ్బచే నేలపై బడెను. మహాతేజశ్శాలియగు తారకుడు క్రింద బడిననూ మరల లేచి నిలబడెను (48). మహావీరుడు, సమస్త రాక్షసులకు నాయకుడు అగు తారకుడు కోపించి అపుడు గొప్ప శక్తితో వీరభద్రుని వక్షస్థ్సలముపై గొట్టెను (49). ఆ గొప్ప శక్తిచే క్రోధముతో వక్షస్థ్సలము నందు బలముగా కొట్టబడిన వీరభద్రుడు క్షణకాలము మూర్ఛిల్లి నేలపై బడెను (50).
గణములు, దేవతలు, గంధర్వులు, నాగులు, రాక్షసులు కూడా పెద్ద హాహాకారములను చేసి అనేక పర్యాయములు ఆక్రోశించిరి(51). గొప్ప బలశాలి, శత్రునాశకుడు అగు ఆ వీరభద్రుడు క్షణకాలములో లేచి మెరుపు వలె ప్రకాశిస్తూ నిప్పులను వెదజల్లే త్రిశూలమును చేత బట్టి విరాజిల్లెను (52).
ఆ త్రిశూలము తన కాంతులచే దిక్కులన్నిటినీ ప్రకాశింప జేయుచూ సూర్యచంద్ర బింబములవలె, అగ్ని మండలమువలె గొప్ప ప్రభలు గలదై, ప్రళయ కాలాగ్ని వలె మహో జ్వలముగా నున్నదై వీరులకు గొప్ప భయమును కలిగించెను (53). మహాబలుడగు వీరభద్రుడు త్రిశూలముతో ఆ రాక్షసుని చంపుటకు ఉద్యుక్తుడగుచుండగా కుమారస్వామి నివారించెను (54).
శ్రీ శివమహాపురాణములో రుద్రసంహితయందు కుమారఖండలో దేవాసురసంగ్రామ వర్ణన మనే తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (9).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 622🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 09 🌴*
*🌻 Boasting of Tāraka and fight between him and Indra, Viṣṇu, Vīrabhadra - 5 🌻*
47. The powerful Vīrabhadra hit him with all his force.
48. Hit by the trident he fell on the ground. Though he fell down, Tāraka of mighty splendour got up again.
49. The great hero, the leader of the entire host of Asuras hit Vīrabhadra in his chest with his great spear.
50. Vīrabhadra, hit by the spear furiously in his chest, fell unconscious on the ground.
51. The gods, the Gaṇas, Gandharvas, Serpents and Rākṣasas lamented frequently with cries of “Alas” “Alas.”
52. Within a moment, the powerful Vīrabhadra, the slayer of enemies, got up lifting his trident aloft, that had the lustre of lightning and was blazing forth.
53. The trident had a halo around, like that of the sun, the moon and the fire. It illuminated the quarters by means of its brilliance; caused terror even in the hearts of the brave. It had a deadly splendour and blazed well.
54. When the powerful Vīrabhadra was about to hit the Asura with his trident, he was prevented by Kumāra.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 339 / DAILY WISDOM - 339 🌹*
*🍀 📖. ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి 🍀*
*📝. ప్రసాద్ భరద్వాజ్*
*🌻 4. మనిషికి తన స్వయంలోనే సమస్యలు ఉన్నాయి 🌻*
*మనిషి సమస్యలు ఏమిటి? తనలో ఉన్న లోపాలు ఏమిటి? ఇది సమస్యల సముద్రం. ఈ ఇబ్బందుల మూలాన్ని సూచించే సమాధానం ఎవరూ అంత సులభంగా ఇవ్వలేరు. మనిషి అన్ని వైపులా అనేక సమస్యలు అవరించి ఉన్నాయి. మనిషికి తనంతట తానుగా సృష్టించుకునే సమస్యలు, బయటి సమాజం నుండి సమస్యలు ఉన్నాయి. అంతేకాక ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు మొదలైన దైవీపరమైన తెలియని ఇబ్బందులు ఉన్నాయి. భారతీయ తాత్విక పరిభాషలో, ఈ మూడు రకాల ఇబ్బందులను తాపత్రయం అంటారు. ఇవి కాక స్వభావ అంతర్భాగంలో కొంత సమస్య ఉంది, బాహ్యంగా కొంత ఉంది, మరియు పై నుండి మొత్తంగా ఇంకేదో ఉంది.*
*మనిషికి తన వెలుపలి వస్తువుల నుండి, మనుషుల నుండి మరియు విషయాల నుండి కలిగే భయమే బాహ్య సమస్య. వ్యక్తి విషయాలను పూర్తిగా విశ్వసించలేడు. ప్రతిదాని గురించి కొంత ఆందోళన చెందుతాడు. బయట జరిగే పరిణామాల వల్ల అతను పడే కష్టం ఇది. వరదలు, కరువులు, భూకంపాలు, తుఫానులు, పిడుగులు వంటి ఇతర ప్రకృతి వైపరీత్యాలు వల్ల కలిగే విభిన్న రకాల భయాలు కూడా ఉన్నాయి. కానీ వీటికి మించి, ప్రతి వ్యక్తికి స్వంత అంతర్గత ఇబ్బందులు కూడా ఉన్నాయి. మనిషి తనలో తాను మానసిక వికలాంగుడు. అతని వ్యక్తిత్వంలోనే ఒక వైరుథ్యత, సంఘర్షణ కనబడుతుంది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 339 🌹*
*🍀 📖 from The Philosophy of Religion 🍀*
*📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj*
*🌻 4. Man has Problems within His Own Self 🌻*
*What are man's problems? What does he lack finally? It is an ocean of problems, and no one can easily give an answer offhand indicating the source of these difficulties. Man is apparently buffeted from every side. Man has problems within his own self, problems from outside society, and problems and unknown difficulties descending from the heavens like natural cataclysms, catastrophes, etc. In Indian philosophical terminology, these difficulties arising from the three sources are called tapatraya, a problem which is threefold in its nature. Inwardly there is some problem, outwardly there is some, and from above there is something else altogether.*
*The fear that man has from things outside him, from men and things, etc., is the external problem. One cannot trust things fully. There is an anxiety about everything. This is the difficulty that he faces from the phenomena outside. There are also fears of a different type whose causes are unknown, which are capable of descending on man from above, like floods, droughts, earthquakes, cyclones, tempests and thunderstorms, and other such natural calamities. But over and above these, there are inward difficulties of one's own. Man is a psychological derelict in himself. There is a conflict in his own personality.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 239 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. అపూర్వ నిశ్శబ్ద స్థితిని అందుకుంటే నువ్వు దైవత్వానికి అతిథి కాగలిగిన అర్హత సంపాదిస్తావు. 🍀*
*మరింత మరింత నిశ్శబ్దంగా మారడానికి ప్రయత్నించు. మరింత నిశ్చలంగా మారడానికి యత్నించు. నిశ్శబ్దాన్ని, నిశ్చలత్వాన్ని ఆనందించు.*
*చివర్లో వచ్చే అతిథి కోసం యివన్నీ సిద్ధం చేసే పనులు. నువ్వు అపూర్వ నిశ్శబ్ద స్థితిని అందుకుంటే నువ్వు దైవత్వానికి అతిథి కాగలిగిన అర్హత సంపాదిస్తావు.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment