🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 241 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. నీకు నువ్వు ఒంటరిగా నీ ప్రపంచాన్ని కనిపెట్టాలి. దానికి గొప్ప ధైర్యం అవసరం. ఇది జీవితంలోని గొప్ప సాహసం. సాహసికి విజయం సిద్ధిస్తుంది. 🍀
నువ్వు లోపలికి ప్రయాణిస్తే నీ అడుగులు ఎవరి కోసమూ ఎట్లాంటి జాడలూ వదిలిపెట్టవు. ప్రతి మనిషి ప్రయాణం అతనిదే. బుద్ధుని అడుగుజాడలు కూడా ఎవరికీ వుపకరించవు. అది అనుభవంగా చెప్పేవే కానీ బుద్ధుని అడుగుజాడలయినా కనిపించవు. నిజానికి నువ్వు బుద్ధుని అడుగుజాడల్ని అనుసరించినా నిన్ను నువ్వు కనిపెట్టలేవు. అది సాయపడదు. అది పరోక్షంగా నీకు సహకరిస్తుంది. నీ లోపలి విషయాల పట్ల నిన్ను అప్రమత్తం చేస్తుంది. అదే అస్పష్ట రీతిలో. అది నీకు ఆత్మ విశ్వాసాన్ని కలిగిస్తుంది.
అవును. అక్కడ లోపల ఒక ప్రపంచముంది. సందేహం లేదు. ఎందుకంటే చాలా మంది అబద్ధం చెప్పే వీలు లేదు. బుద్ధుడు లాంటి వారు అబద్ధాలు చెప్పే వీలు లేదు. వాళ్ళేమీ కుట్రదారులు కారు. ఎందుకని కుట్ర పన్నుతారు? వాళ్ళు ఒకే కాలంలో, ఒకే చోట వున్నవాళ్ళు కారు. వేరు వేరు భాషలు మాట్లాడేవారు. వాళ్ళు ఎంత అపూర్వ వ్యక్తులంటే ఎవరికి వారు అసాధారణమైన వాళ్ళు. అట్లాగే నీకు నువ్వు ఒంటరిగా నీ ప్రపంచాన్ని కనిపెట్టాలి. దానికి గొప్ప ధైర్యం అవసరం. ఇది జీవితంలోని గొప్ప సాహసం. సాహసికి విజయం సిద్ధిస్తుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment