🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 134 / Agni Maha Purana - 134 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 41
🌻. అథ శిలా విన్యాస విధి - 4🌻
ఈ విధి యంతయు పూర్తి చేసి కుండమునందు గర్భమును స్థాపింపవలెను. ఆ సమయమున ఆచార్యునకు గోవస్త్రాది దానమును, ఇతరులకు అన్నదానమును చేయవలెను. ఈ విధముగ గర్భపాత్రనుంచి, ఇటకలను గూడ ఉంచి ఆ కుండమును నింపవలెను. పిమ్మట దేవాలయము ఎత్తు ననుసరించి ప్రధాన దేవతకు పీఠమును నిర్మింపవలెను.
ఆలయము వైశాల్యములో సగము ఎంతయో అంత ఎత్తుగల పీఠము ఉత్తమపీఠము. దానికంటె నాల్గవవంతు ఎత్తు తగ్గినది మధ్యమ పీఠము. ఉత్తమ పీఠము ఎత్తులో సగము ఎత్తు ఉన్నది. కనిష్ఠ పీఠము. పీఠ బంధము చేసిన పిమ్మట మరల వాస్తు పూజ చేయవలెను. కేవల పాద ప్రతిష్ఠ చేయువాడు కూడ సకల పాపవిముక్తుడై దేవలోకములో ఆనంద మగుభవించును.
''నేను దేవాలయ నిర్మాణము చేసెదను'' అతని సంకల్పించిన వాని శారీరక పాపము లన్నియు ఆదివసమునే నశించిపోవును. యథాశాస్త్రముగా దేవాలయ నిర్మాణము చేయువాని మాట చెప్పవలెనా! ఎనిమిది ఇటుకలతో దేవాలయము నిర్మించువానికి కలుగు ఫలము కూడ వర్ణింపశక్యము కానిది. దీనిని పట్టి విశాలమైన దేవాలయములను నిర్మించిన వానికి కలుగు ఫలమును ఊహించుకొన వచ్చును.
గ్రామ మధ్యము నందుగాని, గ్రామమునకు తూర్పుగా గాని దేవాలయమును నిర్మించినచో దాని ద్వారము పశ్చిమమున కుండవలెను. విదిక్కులందు నిర్మించినచో దానిద్వారము గ్రామాభి ముఖముగ ఉండవలెను. గ్రామమునకు దక్షిణ-ఉత్తర-పశ్చి దిక్కులందు నిర్మించిన దేవాలయము ద్వారము తూర్పు వైపు ఉండవలెను.
అగ్నేయ మహాపురాణమునందు శిలావిన్యాసకథనమను నలుబది యొకటవ అధ్యాయము సమాప్తము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 134 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 41
🌻 Mode of performing consecration - 4 🌻
29. Having done so, one should place in the pit (such that) the impregnation would take place in the night. One should give away cows and clothes to the preceptor (the officiating priest), and food to other people.
30. Having filled the hole and placing the bricks in the hole, the hole is completely filled. Then one should construct the base of the deity proportionate to the edifice of the deity.
31. An excellent base is that where it is more than half the breadth of the edifice, while a quarter lesser than that would be mediocre and that which is half of the excellent base (aforesaid) would be the lowest (in merit).
32. After completing the base, the rite for the presiding deity (of the ground) should be done again. One who performs the consecration of the base would enjoy in heavens free from sin.
33. One who would mentally think that “I am going to build a temple”, the sins which had stuck to his body would get destroyed that day itself.
34-35. No need to speak (about the merits) of one who has built a temple in the prescribed manner. It is impossible for anyone to describe the merits one would accrue by building a temple with eight bricks alone. One should indeed infer from this the (proportionate) fruits (accrued) (from the building) of temples of greater dimensions.
36. The door of the temple at the centre of the village or on the eastern part should face the west, while in other directions the door should be facing the west and in the southern, northern and western parts (the door) should face the east.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment