విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 687 / Vishnu Sahasranama Contemplation - 687
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 687 / Vishnu Sahasranama Contemplation - 687🌹
🌻687. పుణ్యః, पुण्यः, Puṇyaḥ🌻
ఓం పుణ్యాయ నమః | ॐ पुण्याय नमः | OM Puṇyāya namaḥ
పుణ్యః, पुण्यः, Puṇyaḥ
స్మృతి మాత్రేణ సర్వేషాం కల్మషాణి మహాన్యపి ।
మహావిష్ణుః క్షపయతీత్యచ్యుతః పుణ్య ఉచ్యతే ॥
స్మరణ మాత్రముననే స్మరించిన వారి కల్మషములను నశింపజేసి వారిని పవిత్రులనుగా చేయువాడుగనుక ఆ మహా విష్ణువునకు పుణ్యః అను నామము కలదు.
:: పోతన భాగవతము ప్రథమ స్కంధము ::
...పుణ్యశ్రవణకీర్తనుండైన కృష్ణుండు దన కథలు వినువారి హృదయంబులందు నిలిచి శుభంబు లాచరించు; నశుభంబులు పరిహరించు; నశుభంబులు నష్టంబు లయిన, భాగవతశాస్త్రసేవావిశేషంబున నిశ్చల భక్తి యుదయించు... ( 58)
పుణ్య శ్రవణ కీర్తనుడైన పురుషోత్తముడు తన కథలు ఆలకించే భక్తుల అంతరంగములలో నివసించి వారికి సర్వశుభములూ సమకూర్చి అశుభములను పోకార్చుతాడు. అశుభ పరిహారము వలన భాగవత సేవ లభిస్తుంది. భాగవత సేవ వలన అచంచల భక్తి ప్రాప్తిస్తుంది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 687🌹
🌻687. Puṇyaḥ🌻
OM Puṇyāya namaḥ
स्मृति मात्रेण सर्वेषां कल्मषाणि महान्यपि ।
महाविष्णुः क्षपयतीत्यच्युतः पुण्य उच्यते ॥
Smrti mātreṇa sarveṣāṃ kalmaṣāṇi mahānyapi,
Mahāviṣṇuḥ kṣapayatītyacyutaḥ puṇya ucyate.
Merely a thought of Him cleanses the impurities and sanctifies those who dwell upon Him and hence He is called Puṇyaḥ.
:: श्रीमद्भागवते प्रथम स्कन्धे द्वितीयोऽध्यायः ::
सृण्वतां स्वकथाः कृष्णः पुण्यश्रवनकिर्तनः ।
हृद्यन्तः स्थो ह्यभद्रणि विधुनोति सुहृत्सताम् ॥ 17 ॥
Śrīmad Bhāgavata - Canto 1, Chapter 2
Srṇvatāṃ svakathāḥ krṣṇaḥ puṇyaśravanakirtanaḥ,
Hrdyantaḥ stho hyabhadraṇi vidhunoti suhrtsatām. 17.
The Paramatma in everyone's heart and the benefactor of the truthful devotee, cleanses desire for material enjoyment from the heart of the devotee who has developed the urge to hear His messages, which are in themselves virtuous when properly heard and chanted.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
स्तव्यस्स्तवप्रियस्स्तोत्रं स्तुतिः स्तोता रणप्रियः ।पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः ॥ ७३ ॥
స్తవ్యస్స్తవప్రియస్స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః ।పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః ॥ 73 ॥
Stavyasstavapriyasstotraṃ stutiḥ stotā raṇapriyaḥ,Pūrṇaḥ pūrayitā puṇyaḥ puṇyakīrtiranāmayaḥ ॥ 73 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment