శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 443 / Sri Lalitha Chaitanya Vijnanam - 443


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 443 / Sri Lalitha Chaitanya Vijnanam - 443 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 94. కుమార గణనాథాంబా, తుష్టిః, పుష్టి, ర్మతి, ర్ధృతిః ।
శాంతిః, స్వస్తిమతీ, కాంతి, ర్నందినీ, విఘ్ననాశినీ ॥ 94 ॥ 🍀

🌻 443. 'మతిః' 🌻


మతి స్వరూపము శ్రీమాతయే అని అర్థము. మతి లేనిదే యే అనుభూతియు లేదు. మతి ఒక వైభవము. అది మానవులకే సంపూర్ణముగ నీయబడినది. మతి ఆధారముగనే మానవు డాలోచన చేయుచున్నాడు. తెలుసుకొను చున్నాడు. సృష్టిని విభజించు కొనుచు గుణములను బట్టి సృష్టితో సంబంధముల నేర్పరచు కొనుచున్నాడు. ఇది నిప్పు అని, ఇది నీరు అని, ఇది శుద్ధమని, ఇది అశుద్ధమని తెలియుచున్నాడు. ఇట్లు తెలియుటకు మతియే ప్రధానము. ఆచరణము ద్వారా 'మతి సుమతియో, కుమతియో కాగలదు. కుమతులు కష్టములకు లోనై ఆచరింప కూడనివి నేర్చుచున్నారు. సుమతులు సత్కర్మాచరణమున శ్రీమాత సిద్ధులను పొందుచున్నారు. కుమతులకు శిక్షణము, సుమతులకు రక్షణము కలుగుట చూచు చున్నారు. ఇట్లు అసంఖ్యాకములైన విషయములను నేర్చుట కాధారము మతియే. అట్టి మతి స్వరూపము శ్రీమాతయే.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 443 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 94. Kumara gananadhanba tushtih pushtirmati dhrutih
Shanti spastimati mantirnandini vignanashini ॥ 94 ॥ 🌻

🌻 443. 'matihi ' 🌻


It means mind is a form of Sri Mata . Without mind there is no feeling. Mind is a glory. It is given completely only for humans. Man is able to think due to the mind. He is able to know. He is classifying the creation and knows the relationship with each aspect of the creation according to its qualities. He knows that this is fire, this is water, this is pure and this is impure. Mind is the key to know this. Through practice Mind can become pure or impure. Men with impure mind are learning what not to practice through hardships. The ones with pure minds are getting the siddhas of Srimata by doing good deeds. Srimata ensures the training for the impure and protection of the pre minds. Mind is the basis for learning these innumerable things. Sri Mata is the embodiment of that mind.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment