🌹 29, MARCH 2023 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹

🍀🌹 29, MARCH 2023 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 29, MARCH 2023 WEDNESDAY బుధవారం, సౌమ్య వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 347 / Bhagavad-Gita - 347 🌹 🌴 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం / Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 09 వ శ్లోకము 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 194 / Agni Maha Purana - 194 🌹 🌻. అధివాసనము - 1 / Preliminary consecration of an image (adhivāsana) - 1 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 059 / DAILY WISDOM - 059 🌹 🌻 28. సైన్స్ మనకు జ్ఞానాన్ని ఇవ్వదు / 28. Science Cannot Give Us Knowledge 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 324 🌹
6) 🌹. శివ సూత్రములు - 61 / Siva Sutras - 61 🌹 
🌻. శక్తిసంధానే శరీరోత్పత్తిః - 3 / 19. Śaktisandhāne śarīrotpattiḥ - 3 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 29, మార్చి, March 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌺. పండుగలు మరియు పర్వదినాలు : మాసిక దుర్గాష్టమి, Masik Durgashtami 🌺*

*🍀. శ్రీ గణేశ హృదయం - 15 🍀*

*16. నానా చతుఃస్థం వివిధాత్మకేన సంయోగరూపేణ నిజస్వరూపమ్ |*
*పూర్యస్య సా పూర్ణసమాధిరూపా స్వానందనాథం ప్రణమామి చాతః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : స్థానాల మార్పుతో ఏకాగ్రతాసాధన - కొన్ని సమయాల్లో హృదయ స్థానమున, కొన్ని సమయాల్లో శిరస్సున కూర్ధ్వమున, ఏకాగ్రతా సాధన చెయ్యడం వలన చెరుపు లేదు. కాని, ఏస్థానంలో చేసినా దృష్టిని ఆ స్థానమందు లగ్నం చెయ్యాలని కాదు దాని అర్ధం. నీ చైతన్య స్థానమును ఏదో ఒక చోట ఏర్పాటు చేసుకొని అచట ఆ స్థలము పైగాక బ్రహ్మముపై దృష్టి నేకాగ్రం చెయ్యడం అవసరం. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,  
వసంత ఋతువు, ఉత్తరాయణం, 
చైత్ర మాసం
తిథి: శుక్ల-అష్టమి 21:09:42 వరకు
తదుపరి శుక్ల-నవమి
నక్షత్రం: ఆర్ద్ర 20:08:40 వరకు
తదుపరి పునర్వసు
యోగం: శోభన 24:12:14 వరకు
తదుపరి అతిగంధ్
కరణం: విష్టి 08:02:58 వరకు
వర్జ్యం: 02:50:54 - 04:37:10
దుర్ముహూర్తం: 11:56:33 - 12:45:34
రాహు కాలం: 12:21:04 - 13:52:58
గుళిక కాలం: 10:49:10 - 12:21:04
యమ గండం: 07:45:22 - 09:17:16
అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:45
అమృత కాలం: 09:02:50 - 10:49:06
సూర్యోదయం: 06:13:28
సూర్యాస్తమయం: 18:28:40
చంద్రోదయం: 11:58:27
చంద్రాస్తమయం: 00:50:27
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: జెమిని
యోగాలు: ముసల యోగం - దుఃఖం 
20:08:40 వరకు తదుపరి గద యోగం
- కార్య హాని , చెడు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻    

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీమద్భగవద్గీత - 347 / Bhagavad-Gita - 347 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 09 🌴*

*09. న చ మాం తాని కర్మాణి నిబధ్నన్తి ధనంజయ |*
*ఉదాసీనవదాసీనమసక్తం తేషు కర్మసు ||*

🌷. తాత్పర్యం :
*ఓ ధనంజయా! ఈ కర్మయంతయు నన్ను బంధింపదు. నేను తతస్థునివలె ఉండి ఈ భౌతికకర్మలన్నింటి యెడ సదా ఆసక్తిలేనివాడనై యుందును.*

🌷. భాష్యము : 
*భగవానునకు ఎట్టి కర్మము లేదని ఈ విషయమున ఎవ్వరును భావింపరాదు. ఆధ్యాత్మికజగత్తులో అతడు సదా దివ్యకర్మల యందు నిమగ్నుడై యుండును. కనుకనే శ్రీకృష్ణభగవానుడు సదా సచ్చిదానందపూర్ణములైన కర్మలలో నిమగ్నుడైయుండుననియు, భౌతికకర్మలతో అతనికెట్టి సంబంధము లేదనియు బ్రహ్మసంహిత యందు తెలుపబడినది (ఆత్మారామస్య తస్యా స్తి ప్రకృత్యా న సమాగమ: ). భౌతికకర్మలన్నియు అతని వివధశక్తులచే నిర్వహింపబడును. అతడు మాత్రము సృష్టించబడిన జగత్తు యొక్క భౌతికకర్మల యెడ సదా తటస్థుడై యుండును. ఆ తటస్థత్వమే “ఉదాసీనవత్” యను పదము ద్వారా ఇచ్చట తెలుపబడినది. అనగా భౌతికకర్మల యందలి ప్రతి సుక్ష్మంశము పైనను అదుపు కలిగియున్నప్పటికిని అతడు తతస్థుని వలె వర్తించుచుండును. న్యాయస్థానమున కూర్చుండు న్యాయాధికారి ఉదాహరణను ఇచ్చట ఒసగవచ్చును.*

*అతని ఆజ్ఞచే కొందరికి మరణశిక్ష, ఇంకొందరికి కారాగారవాసము, మరికొందరికి ధనలాభములు వంటివి జరుగుచున్నను అతడు మాత్రము అచ్చట జరుగు లాభనష్టములతో సంబంధములేక తటస్థుడై యుండును. అదే విధముగా జగము యొక్క ప్రతికార్యమందును తన ప్రమేయమున్నప్పటికి భగవానుడు సదా తటస్థుడై యుండును. కనుకనే వేదాంతసూత్రము (2.1.34) “వైషమ్యనైర్ఘృణ్యేన” అని ప్రవచించినది. అనగా శ్రీకృష్ణభగవానుడు భౌతికజగత్తు ద్వంద్వములతో సంబంధములేక వాటికి పరుడై యుండును. అలాగుననే జగత్తు యొక్క సృష్టి, లయములతో కూడా అతనికి సంబంధము లేదు. అనగా జీవులు తమ పూర్వకర్మల ననుసరించి పలువిధములైన జన్మలను పొందుచుండగా, శ్రీకృష్ణభగవానుడు వారితో ఎట్టి జ్యోక్యమును కల్పించుకొనడు.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 347 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 09 🌴*

*09 . na ca māṁ tāni karmāṇi nibadhnanti dhanañ-jaya*
*udāsīna-vad āsīnam asaktaṁ teṣu karmasu*

🌷 Translation : 
*O Dhanañjaya, all this work cannot bind Me. I am ever detached from all these material activities, seated as though neutral.*

🌹 Purport :
*One should not think, in this connection, that the Supreme Personality of Godhead has no engagement. In His spiritual world He is always engaged. In the Brahma-saṁhitā (5.6) it is stated, ātmārāmasya tasyāsti prakṛtyā na samāgamaḥ: “He is always involved in His eternal, blissful, spiritual activities, but He has nothing to do with these material activities.” Material activities are being carried on by His different potencies. The Lord is always neutral in the material activities of the created world. This neutrality is mentioned here with the word udāsīna-vat. Although He has control over every minute detail of material activities, He is sitting as if neutral.*

*The example can be given of a high-court judge sitting on his bench. By his order so many things are happening – someone is being hanged, someone is being put into jail, someone is awarded a huge amount of wealth – but still he is neutral. He has nothing to do with all that gain and loss. Similarly, the Lord is always neutral, although He has His hand in every sphere of activity. In the Vedānta-sūtra (2.1.34) it is stated, vaiṣamya-nairghṛṇye na: He is not situated in the dualities of this material world. He is transcendental to these dualities. Nor is He attached to the creation and annihilation of this material world. The living entities take their different forms in the various species of life according to their past deeds, and the Lord doesn’t interfere with them.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 194 / Agni Maha Purana - 194 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 59*

*🌻. అధివాసనము - 1 🌻*

*హయగ్రీవుడు చెప్పెను: శ్రీహరి సాన్నిధ్యము సంపాదించుటకు అధివాసనమని పేరు. "నేను సర్వజ్ఞుడు సర్వవ్యాపియు అయిన పురుషోత్తముడను" అని భావన చేయుచు సాధకుడు ఓంకారవాచ్యుడగు పరమాత్మతో ఏకత్వమును చేయవలెను. పిమ్మట చైతన్యాభిమానియైన జీవుని వేరుచేసి ఆత్మకును, ఆ జీవునకును ఏకత్వమును చేయవలెను. ఈ విధముగా చేసి స్వత్మరూపుడును, సర్మవ్యాపియు అగు పరమేశ్వరునితో దానిని కలిపివేయవలెను. పిమ్మట ప్రాణ వాయువు ద్వారా (లం బీజరూపయగు) పృథివిని అగ్ని బీజ (రం) చింతనముచే ఆవిర్భవించిన అగ్నియందు కాల్చివేయవలెను. అనగా పృథివి అగ్నిలో లీనమైనదని భావన చేయవలెను. పిమ్మట అగ్నిని వాయువునందు, వాయువును ఆకాశమునందు లీనము చేయవలెను అధిభూత-అథ్యాత్మ-అధిదైవ విభవములతో కూడిన సమస్త భూతములను తన్మాత్రలలో విలీనము చేసి వీటినన్నింటిని క్రమముగా ఆకాశమునందు విలీనము చేయవలెను. ఆకశమును మనస్సునందు మనస్సును అహంకారమునందు అహంకారము మహత్తత్త్వమునందు, మహత్తత్త్వమును అవ్యాకృతప్రకృతియందును లీనము చేయవలెను.*

*అవ్యాకృతమును (ప్రకృతిని లేదామాయను) జ్ఞాన స్వరూపుడగు పరమాత్మయందు వినీనము చేయవలెను. ఈ పరమాత్మమే వాసుదేవుడు. శబ్ద స్వరూపుడైన ఆవాసుదేవుడు నృష్టిచేయవలెనని సంకల్పించి, అవ్యాకృత మాయా శ్రయము చే స్పర్శమను పేరు గల సంకర్షణుని ఆవిర్భవింపచేసెను. సంకర్షణుడు మాయను క్షుబ్ధముచేసి తేజోరూప ప్రద్యుమ్నుని సృజించెను. ప్రద్యుమ్నుడు రసరూపుడగు అనిరుద్ధుని, అనిరుద్ధుడు గంధస్వరూపుడగు బ్రహ్మను సృజించెను. బ్రహ్మ మొట్టమదట జలమును సృజించి, దానిలో పంచభూతములతో కూడిన బంగారు గ్రుడ్డును సృజించెను. ఆ అండమునందు జీవశక్తి సంచారమేర్పడెను. ఆత్మయందు లీనము చేయబడినట్లు మొదట చెప్పబడినది ఈ జీవశక్తియే. జీవశక్తితో ప్రాణమునకు సంయోగమేర్పడినప్పుడు అది 'వృత్తిమతి' అని చెప్పబడును. వ్యాహృతిసమేతుడగు జీవుడు ప్రాణములలో నుండి అధ్యాత్మిక పురుషుడని చెప్పబడుచున్నాడు. వానినుండి ప్రాణయుక్తమగు బుద్ధి పుట్టినది. దీనికి ఎనిమిది వృత్తులుండును.*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 194 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 59*
*🌻Preliminary consecration of an image (adhivāsana) - 1 🌻*

The Lord said:

1-4. The act of causing the presence of God Hari is said tobe the adhivāsana (preliminary consecration). Having contemplated on the self as the omniscient, all-pervasive and supreme spirit and having united one’s self-conceited conscious energy with (the syllable) oṃ and after having drawn it out and identifying one’s own self with the all-pervasive lord, (the priest) should unite the earth with the wind, illuminate it with the fire particle (mentally), draw the fire with the wind (particle) and lead the wind into the ethereal space. The wiseman should draw in the same order (the other gross elements) after having made them the receptacles of subtle principles along with the gross principles, the supreme being and the secondary forms such as the sādhyas[1].

5. The ethereal space should be drawn into the mind (principle), the mind (in its turn) should be (drawn) into (the principle of) ego, (the principle) of ego in the (principle of) mahat (first principle). The mahat should be led into the avyākṛta (unmanifest).

6-7. The unmanifest (is led) into the absolute knowledge known as Vāsudeva. Being desirous to create he, the Lord of sound by means of the unmanifest brought into being Saṅkarṣaṇa (the principle) known as touch. He created Pradyumna the form of splendour by agitating the illusion.

8. He created Aniruddha, (consisting of) taste only and Brahmā of the form of smell. That Aniruddha, the Brahmā created water at first.

9. He also laid the golden egg (of the five principles) in that (water). Impregnated with consciousness (this generated) a peculiar force within.

10. The breath united with life force is spoken as existence. The inner being also known as the vyāhṛti[2] is a spiritual entity amidst the five winds (prāṇāḥ [=prāṇa]).

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 59 / DAILY WISDOM - 59 🌹*
*🍀 📖. యోగా యొక్క తత్వశాస్త్రం నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻 28. శాస్త్రం మనకు జ్ఞానాన్ని ఇవ్వదు 🌻*

*జ్ఞానం అంటే ఏమిటి? ఇది చైతన్యంలోకి వస్తువు యొక్క సమీకరణ. నువ్వు నా చైతన్యంలో భాగం అయిపోతే, నేను నిన్ను తెలుసుకున్నట్లు. కానీ మీరు నాకు అపరిచితుడిగా, నా నుండి పూర్తిగా స్వతంత్రమైన వస్తువుగా నా చైతన్యం బయట నిలబడితే, నేను నిన్ను తెలుసుకోలేను. జ్ఞానం అంటే విషయంలో భాగస్వాములు అవడం. భాగస్వామ్యం అనేది వస్తువు యొక్క స్వభావంలోకి ప్రవేశించే మన సామర్థ్యాన్ని మరియు వస్తువు యొక్క మన జీవంలోకి, మన జ్ఞానంలోకి ప్రవేశించే సామర్థ్యాన్ని సూచిస్తుంది; అంటే వస్తువుల స్వభావం యొక్క పరస్పర సమీకరణ.*

*నేను పూర్తిగా నీ వెలుపల నిలబడితే, నువ్వు పూర్తిగా నా బయట నిలబడితే, ఇద్దరి మధ్య సఖ్యత ఉండదు. నేను నిన్ను తెలుసుకోలేను మరియు మీరు నన్ను తెలుసుకోలేరు. ఆధునిక కాలపు శాస్త్రీయ పరిశీలనలకు ఇదే జరిగింది. శాస్త్రం అనేది వస్తువుల పరిశీలన అయితే, వాటిని గమనించే విషయాలతో సంబంధం లేని వస్తువులుగా పరిగణించి నట్లయితే, శాస్త్రం మనకు జ్ఞానాన్ని ఇవ్వదు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 59 🌹*
*🍀 📖 Philosophy of Yoga 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 28. Science Cannot Give Us Knowledge 🌻*

*What is knowledge? It is an assimilation of the object into the consciousness. If I assimilate you in my consciousness, I know you, but if you stand outside as a stranger to me, as an object which is totally independent of me, I cannot know you. All knowledge is participation in the content thereof. Participation implies our capacity to enter into the nature of the object, and the capacity in the object to enter into the nature of our being, our knowledge; that is mutual assimilation of the nature of things.*

*If I stand outside you totally and you stand outside me wholly, there would be no concourse between the two. I cannot know you and you cannot know me. This is what has happened to the scientific observations of modern times. If science is an observation of objects, regarding them as objects having nothing to do with the subjects which observe them, then science cannot give us knowledge.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 324 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. నువ్వు పరిధి నించీ కేంద్రానికి వెళ్ళలేవు. ఎప్పుడు కేంద్రం నించే పరిధికి విస్తరిస్తావు. పరిధి అన్నది కేవలం ఛాయా మాత్రమైంది. 🍀*

*మన పునాదులు మన కేంద్రంలో వున్నాయి. మనం కేంద్రంలో ఒక వేళ కలుపు మొక్కల్ని నాటితే మనకు గులాబీ పూలు కావాలంటే కుదరదు. గులాబీపూలు కావాలంటే గులాబీ మొక్కల్ని పునాదుల్లో నాటాలి. అప్పుడే మృదువైన పూలు, మధురమయిన పరిమళం పరిసరాల్లో ప్రసరిస్తాయి. నువ్వు పరిధి నించీ కేంద్రానికి వెళ్ళలేవు. ఎప్పుడు కేంద్రం నించే పరిధికి విస్తరిస్తావు. పరిధి అన్నది కేవలం ఛాయా మాత్రమైంది. తరతరాలుగా మత పెద్దలు, నీతివాదులు పై నించీ సమన్వయాన్ని, సమశృతిని సాధిస్తామని చెబుతూ వచ్చారు.*

*పునాదుల్లో కలుపు మొక్కల్ని నాటి గులాబీల కోసం ఆశిస్తున్నాం. అవి రావు. లేదా మనం మోసంతో ప్లాస్టిక్ గులాబీ పూలని తెచ్చి కలుపు మొక్కలపై పెట్టి అలంకరిస్తాం. మనం యితర్లని మోసగించి చివరకు మనల్ని మనం మోసగించుకుంటాం. కానీ ప్లాస్టిక్పులు నిజమైన పూలు కావు. నీతి నిండిన పాత్రలు అలాంటివే. నిజమైన వ్యక్తిత్వాలు తయారు చేస్తే వచ్చేవి కావు. ధ్యానం గుండా సహజంగా ఏర్పడేవి.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శివ సూత్రములు - 061 / Siva Sutras - 061 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*1- శాంభవోపాయ*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻. శక్తిసంధానే శరీరోత్పత్తిః - 3 🌻*
*🌴. అతని సంకల్ప శక్తిని నింపడం ద్వారా సంకల్పం యొక్క స్వరూపం తక్షణం సంభవిస్తుంది.🌴*

*సృష్టికర్త అయిన శివుడు, పూర్తిగా నిర్మూలించబడని కోరికలను బయటకు తీసి, అప్పటికే యోగి మనస్సులో వాసన లేదా ముద్రలుగా మిగిలి ఉన్న వాటి ముద్రలను వ్యక్తపరుస్తాడు. ఇది ఉచ్ఛ్వాసనిశ్వాసాలను సమం చేయడం ద్వారా జరుగుతుంది, తద్వారా ప్రాణం సుషుమ్న నాడిలోకి ప్రవేశించి ఆధ్యాత్మిక శక్తిని కలిగిస్తుంది. స్పంద కారికాలో (పద్యము 3-2) వెన్నెముకలో అటువంటి శక్తి ఏర్పడినప్పుడు, శివుడు తన కలలో కనిపించి, ప్రార్థించిన వస్తువులను నెరవేరుస్తాడని చెప్పారు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras - 061 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 1 - Sāmbhavopāya
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 19. Śaktisandhāne śarīrotpattiḥ - 3 🌻*
*🌴. By infusing his energy of will the embodiment of that which is willed occurs at once. 🌴*

*Śiva, as the Creator brings out those not- totally eradicated desires, the impressions of which still remain as vāsana or impressions in the mind of yogi and make them to manifest. This is brought about by equalizing inhalation and exhalation so thatprāna enters suṣumna nādi causing spiritual energisation. Spanda Kārikā (verse III-2) says that when such energisation happens in the spinal cord, Śiva appears in his dream and reveals those objects that are prayed for.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama

No comments:

Post a Comment