నిర్మల ధ్యానాలు - ఓషో - 343
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 343 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. మామూలు మనిషి మానసిక వయసు పన్నెండేళ్ళు. మనం ఎదుగుదల లేని ప్రపంచంలో నివసిస్తున్నాం. మానసికంగా ఎదగని ప్రపంచంలో వున్నాం. సాహసంగా వుండు. సాహసంతో యిష్టం, గాఢత ప్రదర్శించు. సవాళ్ళని ఎదుర్కో, అప్పుడే లోపల దాగిన కాంతిని దర్శిస్తావు. 🍀
చలనం లేని వాటికి, తెలివి తక్కువ వాటికి, వ్యతిరేకంగా తిరగబడ్డమన్నది గొప్ప సాహసం, గొప్ప విప్లవం. అది నీ ఆత్మకు, తెలివికి చురుకుదనాన్ని ఇస్తుంది. నీలోని వ్యక్తికి అది సంపూర్ణత నిస్తుంది. ఆనంద సుమం వికసిస్తుంది. నువ్వు ఎదగడం ఆరంభిస్తావు. మామూలు మనిషి మానసిక వయసు పన్నెండేళ్ళు. మనం ఎదుగుదల లేని ప్రపంచంలో నివసిస్తున్నాం. మానసికంగా ఎదగని ప్రపంచంలో వున్నాం. ఎనభయి, తొంభయి ఏళ్ళ వృద్ధులు కూడా వయసులో పెద్దవాళ్ళు. కానీ మానసికంగా పన్నెండేళ్ళ వయసు దగ్గరే ఆగిపోయారు.
అందువల్ల వాళ్ళు ఒకోసారి తమ వయసు మరచిపోయి పసితనంతో ప్రవర్తిస్తారు. వాళ్ళకు కొంత విస్కీ యిచ్చి చూడు. తెలివిలేని పసివాడులా ప్రవర్తించడం ఆరంభిస్తారు. విస్కీ పసితనాన్ని సృష్టించలేదు. లోపల వున్న దాన్ని బయటికి తెస్తుంది. ఎవర్నయినా తక్కువ చేసి మాట్లాడు, అతను తన పెద్ద వయసు మరచిపోయి ఆగ్రహిస్తాడు, వివేకం, అనుభవం మాయమవుతాయి. సాహసంగా వుండు. సాహసంతో యిష్టం, గాఢత ప్రదర్శించు. సవాళ్ళని ఎదుర్కో, అప్పుడే లోపల దాగిన కాంతిని దర్శిస్తావు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment