DAILY WISDOM - 150 : 29. The Self is not Momentary in Nature / నిత్య ప్రజ్ఞా సందేశములు - 150 : 29. ప్రకృతిలో స్వయం క్షణికమైనది కాదు



🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 150 / DAILY WISDOM - 150 🌹

🍀 📖 . జీవితం యొక్క తత్వము నుండి 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 29. ప్రకృతిలో స్వయం క్షణికమైనది కాదు 🌻


స్వయం అనేది స్వయం ప్రకాశవంతమైనది మరియు సద్బుద్ధి కలది. స్వయంప్రకాశం లేదా స్వీయ-చైతన్యం లేని జీవి అయిఉంటే, అది స్వయం ప్రకాశవంతంగా ఉన్న మరొక జీవి ద్వారా ఒక వస్తువుగా గుర్తించబడాలి. కానీ ఆత్మ స్వయం ప్రకాశవంతంగా ఉండకపోతే, జ్ఞానం యొక్క మూలం కోసం మన అన్వేషణకు అంతం ఉండదు. ఎందుకంటే స్వయం ప్రకాశం కాని ఆత్మ వెనుక స్వయం ప్రకాశవంతమైన మరొక ఆత్మ ఉండి ఉంటుంది అని మనం దానిని అన్వేషిస్తాము. తద్వారా ఒక దాని వెనక పరుగులు పెడుతూ మనం జ్ఞానానికి మూలమైన స్థానాన్ని ఎప్పటికీ కనుగొనలేము. ఆత్మ క్షణికమైనది కాదు, ఎందుకంటే క్షణికమైనది నశించగలదు. అది జ్ఞానానికి మూలం కాలేదు.

క్షణికం యొక్క ఆభాస అనేది కాలం నడుస్తున్న కొద్దీ అందులో వస్తువు చెందే మార్పుల వల్ల కలుగుతుంది. అంటే ఆత్మ కానీ, చైతన్యం కానీ క్షణికం కావు. కానీ చైతన్యం లో ఈ వస్తువుల యొక్క కాలానుగుణమైన మార్పు వల్ల క్షణికత అనుభూతిలోకి వస్తుంది. ఈ క్షణిక పార్శ్వాలను చైతన్యం వస్తువులుగా పరిగణిస్తుంది. బయటి వస్తువుల లాగా ఆత్మ యొక్క అస్తిత్వానికి బాహ్య ఆధారాలు ఉండవు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 150 🌹

🍀 📖 The Philosophy of Life 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 29. The Self is not Momentary in Nature 🌻


The Self is of the nature of self-luminosity and intelligence. If the Self were something other than a self-illumined or self-conscious being, it would have to be known as an object by another being which ought to be self-luminous. But if the Self is not at all to be self-luminous, we would be led to an infinite regress of positing a self behind self, so that there would be no end of our search for the origin of knowledge. The Self is not momentary in nature, for what is momentary is destructible and cannot be the source of knowledge.

The perception of momentariness is due to a succession of the appearance of objects at different instants of time. It is not the Self or the consciousness that is momentary, but the perception of objects determined by the nature of the appearance of objects to consciousness. Momentary elements are what are known by consciousness as its objects. The Self is not made manifest by external proofs as outward things are.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹



No comments:

Post a Comment