విజయదశమి – దశపాప హర దశమి శుభాకాంక్షలు, Happy Vijayadashami – DasaPapa Hara Dasami


🌹. విజయదశమి – దశపాప హర దశమి శుభాకాంక్షలు అందరికి , Happy Vijayadashami – DasaPapa Hara Dasami to All. 🌹

✍️. ప్రసాద్ భరద్వాజ

🌷. విజయదశమి పండుగ విశిష్టత / The specialty of Vijayadashami festival 🌷


దేవదానవులు పాల సముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభ ముహూర్త దినం ఈ విజయ దశమి రోజే అని తెలియచేయ బడింది . 'శ్రవణా' నక్షత్రంతో కలిసిన ఆశ్వయుజ దశమికి "విజయ"అనే సంకేతమున్నది. అందుకనే దీనికి 'విజయ దశమి' అను పేరు వచ్చినది. ఏ పనైనా తిధి ,వారము తారా బలము , గ్రహాబలము ముహూర్తము మున్నగునవి విచారించకుండా, విజయదశమి నాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యము .'చతుర్వర్గ చింతామణి 'అనే ఉద్గ్రందము ఆశ్వయుజ శుక్లదశమి నాటి నక్షత్రోదయ వేళనే 'విజయం ' అని తెలిపి యున్నది . ఈ పవిత్ర సమయము సకలవాంచితార్ద సాధకమైనదని గురు వాక్యము.

విజయదశమి పండుగ అపరాజిత పేరు మీద వస్తుంది. పరాజయం లేకుండా విజయాన్ని సాధించేది కాబట్టి, విజయదశమి అయింది. పాండవులు శమీ వృక్ష రూపమున ఉన్న అపరాజిత దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయము సాదించారు . "శ్రీ రాముడు" విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి రావణుని సంహరించి, విజయము పొందినాడు. విజయదశమి రోజు పరాజయం లేని అపరాజితాదేవిని .. శ్రీచక్ర అధిష్టాన దేవత... షోడశ మహావిద్యా స్వరూపిణి అయిన శ్రీ విజయదుర్గను ... శ్రీ రాజరాజేశ్వరీదేవిని ఎవరైతే పూజిస్తారో! వారందరికీ ఖచ్చితంగా విజయం లభిస్తుంది. అమ్మవారు పరమశాంత స్వరూపంతో, సమస్త నిత్యామ్నయ పరివార సమేతంగా, మహా కామేశ్వరుడుని అంకంగా చేసుకొని, ఆది పరాశక్తి... రాజరాజేశ్వరి దేవిగా శాంత స్వరూపంతో చిరునవ్వులు చిందిస్తూ, చెరకుగడను (ఇక్షుఖండం) ధరించి, ఒక చేతితో అభయ ముద్రతో దర్శనమిస్తుంది. మణిద్వీప వర్ణనలో "శ్రీపురంలో చింతామణి "అనే గృహంలో నివసిస్తూ ఉంటుంది. చెడుపై సాధించే విజయమే విజయదశమి. ముఖ్యంగా మన మనసులో ఉన్న చెడు ప్రవర్తన మార్చుకుని (చెడుపై సాధించిన విజయంగా..) విజయదేవిని, విజయదశమి రోజు పూజిస్తే సర్వ శుభాలూ కలుగుతాయి. ఈమె ఆది ప్రకృతి స్వరూపిణి. దుర్గాదేవి వివిధ కల్పాలలో, వివిధ రూపాలు ధరించి నానా దుష్టజనులని సహకరించి, లోకాలకి ఆనందం కలిగించింది. మహిమాన్విత అయిన శ్రీచక్ర అధిష్టాన దేవతయే... లలితా దేవతయే... శ్రీరాజరాజేశ్వరీ దేవి. ఈ తల్లి నివాసం "శ్రీమణిద్వీప -- శ్రీనగర స్థిత -- చింతామణి గృహం". ఈ తల్లి ఎక్కడ నివసిస్తుందో! అక్కడ అన్నీ శుభాలే!!!


🍀. దసరా సాధనాపర విశిష్టత 🍀

దసరా అంటే ఏమిటి ? మనలో ఉన్న పంచ జ్ఞాన, పంచ కర్మేన్ద్రియాలైన దశ ఇంద్రియాలు- దోపిడీ, హింస, స్త్రీ వ్యామోహం, లోభం, వంచన, పరుష వాక్కు, అసత్యం, పరనింద, చాడీ చెప్పటం, అధికార దుర్వినియోగం అనే దశ అంటే పది పాపపు పనులు చేస్తాయి. ఈ పది రకాల పాపాలు హరి౦చటానికి జగన్మాతను కొలిచే పండగనే "దశ హర" అంటారు. అదే దసరా గా మారింది. బాల్య, యవ్వన, కౌమార వార్ధక్య౦ 4 దశలు దాటి పోవాలంటే జన్మ రాహిత్య స్థితి పొందాలి. ఈ జన్మ రాహిత్య స్థితిని పొందటానికి , మానవ జన్మల దశలను హరి౦చ మని శ్రీ దేవిని నవరాత్రులు ఆరాధించటమే దశహరా – దసరా. పరుషంగా మాట్లాడటం, అబద్ధాలు చెప్పటం, అసంబద్ధమైన మాటలు మాట్లాడటం, సమాజం వినలేని మాటలు మాట్లాడటం – ఈ నాలుగు రకాల పాపాలు మాటల ద్వారా చేసేవి. తనది కాని ధనము, వస్తువులపై వ్యామోహం కలిగి ఉండటం, ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులను చేయటం, ఇతరులకు చెడు చేయాలనుకోవడం ఈ మూడు మానసికంగా చేసే పాపాలు. అర్హత లేని వానికి దానాన్ని ఇవ్వడం, శాస్త్రము ఒప్పని హింసను చేయడం, పర స్త్రీని లేదా పురుషున్ని స్వీకరించడం ఈ మూడు శరీరంతో చేసే పాపాలు. మొత్తం ఇవి పది పాపాలు. ఈ పది పాపాల నుండి విముక్తిని ప్రసాదించి, మనందరి జీవితాలు సుఖసంతోషాలతో, సకల ఐశ్వర్యాలతో ఉండేలా చేయమని దుర్గామాతను వేడుకోవాలి.


🙏. చదువుకోవలసిన స్తోత్రాలు 🙏

రాజరాజేశ్వరి దేవి అష్టోత్తరం, కవచం, సహస్రనామ స్తోత్రం, శ్రీ విజయదుర్గా స్తోత్రం ఇత్యాదివి చదువుకోవాలి. లలితా సహస్రనామాల్లో "రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభా" అనే శ్లోకం అత్యంత ఫలదాయకం. "ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవతాయై నమః" అనే మంత్రం జపించుకోవచ్చు. రాజరాజేశ్వరి దేవి గాయత్రి మంత్రం "ఓం రాజరాజేశ్వరి రూపాయ విద్మహే! అంబికాయై ధీమ హి తన్నోమాతః ప్రచోదయాత్ "అనే మంత్రాన్ని జపించుకోవాలి.


🍀. శ్రీ అపరాజితా దేవి స్తోత్రం 🍀

నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః |

నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్

రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్ర్యై నమో నమః |

జ్యోత్స్నాయై చేన్దురూపిణ్యై సుఖాయై సతతం నమః



🍀. శ్రీ విజయ దుర్గా స్తోత్రము 🍀

దుర్గాదుర్గార్తిశమనీ దుర్గాపద్వినివారిణీ | దుర్గమచ్చేదినీ దుర్గసాధినీ దుర్గానాశినీ

దుర్గాతోద్ధారిణీ దుర్గనిహంత్రీ దుర్గమాపహా | దుర్గమ జ్ఞానదా దుర్గదైత్య లోకదవానలా

🌹 🌹 🌹 🌹 🌹






🌹. Happy Vijayadashami – DasaPapa Hara Dasami to All.

✍️. Prasad Bhardwaj

🌷. The specialty of Vijayadashami festival 🌷


It is said that this Vijaya Dasami is the auspicious day when Amrita was born when the gods churned the ocean of milk. Ashvayuja Dashami associated with 'Shravana' Nakshatra has the sign of 'Vijaya'. That is why it got the name 'Vijaya Dashami'. If any work is undertaken on Vijayadashami without asking Tidhi, Vara, Tara Balam, Grahabalam Muhurta, then success is assured. The saying 'Chaturvarga Chintamani' says 'Victory' at the time of star rise on Ashvayuja Shukladashami. Guru Vakya says that this holy time is beneficial for all

Vijayadasami festival comes in the name of Aparajita. It is Vijayadasami because it means victory without defeat. The Pandavas won the victory over the Kauravas with the blessings of the invincible Goddess Aparajita Devi in the form of Shami vruksha. 'Sri Rama' worshiped this 'Aparajita' Devi on Vijayadashami and killed Ravana and got victory. Whoever worships the invincible Aparajitadevi on the day of Vijayadashami .. Srichakra Adhisthana deity ... Shree Vijaydurga who is the embodiment of Shodasa Mahavidya ... Shree Rajarajeshwaridevi! All of them will definitely get success. Ammavaru appears in Paramashanta form, accompanied by all Nityamnaya Parivara, with Maha Kameshwar as her figure, Adi Parashakti... Rajarajeshwari as Goddess Rajarajeswari smiling in a Shanta form, wearing a sugar cane (Ikshukhandam) and holding abhaya mudra in one hand. In Manidvipa description she is described as living in a house called 'Chintamani in Sripuram'. Victory over evil is Vijaya dasami. Especially if we change the bad behavior in our mind (as a victory over evil..) and worship Goddess Vijaya on Vijayadashami day, all good things will come. She is the embodiment of primordial nature. Goddess Durga in different kalpas, dressed in different forms, helped many evil people and brought joy to the worlds. The glorious presiding deity of Srichakra…the deity Lalita herself is…the deity Srirajarajeshwari. The abode of this mother is 'Shrimanidweepa -- Srinagara Stitha -- Chintamani Griha'. Where this mother resides, All good there!!!


🍀. Dussehra Sadhanapara Speciality 🍀

What is Dussehra? The Dasa Indriyas which are the Pancha Gnana and Pancha Karmendriyas- Extortion, Violence, Woman Infatuation, Greed, Hypocrisy, Harsh Speech, Lying, Backbiting, Slander, Abuse of Power, Dasa i.e. Ten Sinful Actions. The festival where Jaganmata is worshiped to remove these ten types of sins is called 'Dasa Hara'. The same became Dussehra. To pass through the 4 stages of childhood, youth, adolescence and old age, one must attain the state of birthlessness. Dashahara – Dussehra is the worship of Shri Devi for 10 nights to destroy the stages of human births, to attain this birthless state. Speaking harshly, telling lies, speaking nonsense, speaking words that society cannot tolerate – these four kinds of sins are committed through words. To be infatuated with money that is not one's own, to be infatuated with things, to do things that cause trouble to others, and to want to do evil to others - these three are mental sins. Giving alms to an unworthy person, committing violence against the law, and accepting another woman or man are the three bodily sins. These are ten sins in total. We should pray to Goddess Durga to grant us freedom from these ten sins and make our lives full of happiness and all the riches.


🙏. Hymns to study 🙏

Rajarajeshwari Devi Ashtottaram, Kavacham, Sahasranama Stotram, Sri Vijayadurga Stotram etc. should be studied. The hymn 'Rajarajeshwari Rajyadaiini Rajyavallabha' is the most fruitful in Lalita's Sahasranamas. One can chant the mantra 'Om Sri Rajarajeshwari Devatayai Namah'. Rajarajeshwari Devi Gayatri Mantra 'Om Rajarajeshwari Rupaya Vidmahe! ambikayai dhima hi tannomatah prachodayat' One should chant the mantra '



🍀. Shri Aparajita Devi Stotram 🍀

Namo Devyai Mahadevyai Shivayai Satatam Namah |

namah prakrtyai bhadrayai niyatah pranatah smatham

Raudrayai Namo Nityayai Gaurayai Dhatryai Namo Namah |

Jyotsnayai Chendurupinyai Sukhayai Satatam Namah




🍀. Sri Vijaya Durga Stotra 🍀

Durgadurgartishamani Durgapadvinivarini |

Durgatoddharini Durganihantri Durgamapaha | Durgama Jnanada Durgadaitya Lokadavanala


🌹 🌹 🌹 🌹 🌹




No comments:

Post a Comment