🌹 25, MAY 2024 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు🌹

🍀🌹 25, MAY 2024 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు🌹🍀
1) 🌹. శ్రీమద్భగవద్గీత - 534 / Bhagavad-Gita - 534 🌹
🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 45 / Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 45 🌴
2) 🌹. శ్రీ శివ మహా పురాణము - 888 / Sri Siva Maha Purana - 888 🌹
🌻. శంఖచూడుని వధ - 3 / The annihilation of Śaṅkhacūḍa - 3 🌻
3) 🌹 సిద్దేశ్వరయానం - 65 🌹
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 546 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 546 - 1 🌹 
🌻 546. 'బంధమోచనీ’ - 1 / 546. 'Bandhamochani' - 1 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 534 / Bhagavad-Gita - 534 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 10 🌴*

*10. రజస్తమశ్చాభిభూయ సత్త్వం భవతి భారత |*
*రజ: సత్త్వం తమశ్చైవ తమ: సత్త్వం రజస్తథా ||*

*🌷. తాత్పర్యం : ఓ భరతవంశీయుడా! కొన్నిమార్లు రజస్తమోగుణములను జయించి సత్త్వగుణము ప్రబలమగుచుండును. మరికొన్నిమార్లు రజోగుణము సత్త్వ, తమోగుణములను జయించుచుండును. ఇంకొన్నిమార్లు తమోగుణము సత్త్వ, రజోగుణములను జయించుచుండును. ఈ విధముగా గుణముల నడుమ ఆధిపత్యము కొరకు సదా పోటీ జరుగుచుండును.*

*🌷. భాష్యము : రజోగుణము ప్రబలమైనప్పుడు సత్త్వగుణము మరియు తమోగుణము జయింపబడును. సత్త్వగుణము ప్రధానమైనప్పుడు రజస్తమోగుణములు జయింపబడును. ఇక తమోగుణము ప్రబలమైనప్పుడు సత్త్వగుణము మరియు రజోగుణము జయింపబడి యుండును. త్రిగుణముల నడుమ ఇట్టి పోటీ సదా కొనసాగుచునే యుండును కావున కృష్ణభక్తిభావనలో వాస్తవముగా పురోగతి కోరువాడు వీటిని అధిగమింపబలయును. మనుజుని యందు ప్రబలమైయున్నట్టి గుణము అతని వ్యవహారములు, కర్మలు, ఆహారము మొదలగు విషయముల ద్వారా వ్యక్తమగుచుండును. ఈ విషయము రాబోవు అధ్యాయములలో వివరింపబడును.*

*కాని మనుజుడు తలచినచో సాధన ద్వారా సత్త్వగుణమును వృద్ధిచేసికొని రజస్తమోగుణములను జయింపవచ్చును. అదే విధముగా అతడు రజోగుణము వృద్ధిచేసికొని సత్త్వతమోగుణములను జయింపవచ్చును లేదా తమోగుణమును అలవరచుకొని సత్త్వరజోగుణములను జయింప వచ్చును. ఈ విధముగా ప్రకృతిగుణములు మూడువిధములైనను స్థిరనిశ్చయము కలిగినవాడు సత్త్వగుణమునందు స్థితుడు కాగలడు. పిదప ఆ సత్త్వగుణమును సైతము అతడు అధిగమించి “వసుదేవస్థితి” యను శుద్ధసత్త్వమునకు చేరగలడు. అట్టి స్థితియందే మనుజుడు భగవద్విజ్ఞానమును అవగాహనము చేసికొనగలడు. అనగా మనుజుని కర్మల ననుసరించి అతడు ఎట్టి గుణమునందు స్థితుడైయున్నాడో తెలిసికొనవచ్చును.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 534 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 10 🌴*

*10. rajas tamaś cābhibhūya sattvaṁ bhavati bhārata*
*rajaḥ sattvaṁ tamaś caiva tamaḥ sattvaṁ rajas tathā*

*🌷 Translation : Sometimes the mode of goodness becomes prominent, defeating the modes of passion and ignorance, O son of Bharata. Sometimes the mode of passion defeats goodness and ignorance, and at other times ignorance defeats goodness and passion. In this way there is always competition for supremacy.*

*🌹 Purport : When the mode of passion is prominent, the modes of goodness and ignorance are defeated. When the mode of goodness is prominent, passion and ignorance are defeated. And when the mode of ignorance is prominent, passion and goodness are defeated. This competition is always going on. Therefore, one who is actually intent on advancing in Kṛṣṇa consciousness has to transcend these three modes. The prominence of some certain mode of nature is manifested in one’s dealings, in his activities, in eating, etc. All this will be explained in later chapters.*

*But if one wants, he can develop, by practice, the mode of goodness and thus defeat the modes of ignorance and passion. One can similarly develop the mode of passion and defeat goodness and ignorance. Or one can develop the mode of ignorance and defeat goodness and passion. Although there are these three modes of material nature, if one is determined he can be blessed by the mode of goodness, and by transcending the mode of goodness he can be situated in pure goodness, which is called the vasudeva state, a state in which one can understand the science of God. By the manifestation of particular activities, it can be understood in what mode of nature one is situated.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 888 / Sri Siva Maha Purana - 888 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 40 🌴*

*🌻. శంఖచూడ వధ - 3 🌻*

*బ్రాహ్మణ భక్తుడు, సత్యవాక్పరిపాలకుడు అగు ఆ దానవ చక్రవర్తి దివ్యమైన, ప్రాణములవలె ప్రియమైన కవచమును ఆ బ్రాహ్మణునకు ఇచ్చివేసెను (19). విష్ణువు ఈ విధముగా మాయను పన్ని శంఖచూడుని నుండి కవచమును గ్రహించి, ఆతని రూపమును దాల్చి తులసి వద్దకు వెళ్లెను (20). మాయాపండితుడు, సర్వసమర్థుడు అగు విష్ణువు దేవకార్యము కొరకై ఆమెతో సంభోగించెను (21).*

*ఈ సమయములో దానవప్రభుడగు శంఖచూడుడు శంభుని యుద్ధమునకు ఆహ్వానిస్తూ మాటలాడెను. శివుడు శంఖచూడుని వధించుట కొరకై నిప్పులు గ్రక్కే శూలమును చేతబట్టెను (22). శంకరపరమాత్ముని విజయమను పేరు గల ఆ శూలము సర్వదిక్కులను అంతరిక్షమును గొప్ప కాంతులతో ప్రకాశింపజేసెను (23). ఆ శూలము కోటి మధ్యాహ్న సూర్యులతో మరియు ప్రలయకాలాగ్ని జ్వాలలతో పోల్చదగిన కాంతిని కలిగియుండెను. శత్రుసంహారకమగు ఆ శూలము నివారింప శక్యము కానిది మరియు సంహిపశక్యము కానిది. దానిని ప్రయోగించినచో వ్యర్ధమయ్యే ప్రసక్తి లేదు (24).*

*సర్వబ్రహ్మాండమును సంహరించే శక్తి ఒకచో సమగూడి దానియందు నిహితమై సర్వోత్కృష్టముగా ప్రకాశించుచుండెను. దానిని శివుడు అవలీలగా పట్టుకొనెను (26). వేయి ధనస్సుల పొడుగు, వంద చేతుల వెడల్పు గల ఆ శూలము జీవబ్రహ్మల స్వరూపమును కలిగియుండెను. శాశ్వత స్వరూపమగు ఆ శూలమునకు అది లేదు. (27).*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 888 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bhadwaj *

*🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 40 🌴*

*🌻 Śaṅkhacūḍa is slain - 3 🌻*

19. On hearing that, the lord of Dānavas, a well wisher of the brahmins and of truthful word handed over the divine armour, his vital breath, to the brahmin.

20. Viṣṇu thus snatched off his armour by means of deception. Then in the guise of Śaṅkhacūḍa Viṣṇu approached Tulasī.

21. Lord Viṣṇu, an expert in wielding magic went there and deposited his semen in her vaginal passage for the protection of gods.

22. In the meantime the lord of Dānavas approached Śiva without the armour. He took up his trident that blazed to slay Śaṅkhacūḍa.

23. That trident, named Vijaya, of Śiva, the great Ātman, shone illuminating heaven and earth.

24. It was as refulgent as a crore midday suns and as fierce as the shooting flame of fire at the time of dissolution. It could neither be prevented nor withstood. It was never ineffective in destroying enemies.

25. It had a fierce halo all round. It was the best of all weapons and missiles. It was unbearable to gods and Asuras. It was terrible to all.

26. In order to annihilate the whole cosmos sportively all brilliance had converged into it.

27. It was a thousand Dhanus in length and a hundred Hastas in width. It was in the form of individual as well as universal soul. It was eternal and uncreated.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 సిద్దేశ్వరయానం - 66 🌹*

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
     
*🏵 శిష్యురాలు భైరవీ బ్రాహ్మణి 🏵*

*మధురాబాబు కొద్ది రోజులలోనే పండితసభ ఏర్పాటు చేశాడు. 'అందులో జరిగిన రకరకాల వాద ప్రతివాదాలలో వచ్చిన విద్వాంసులు రెండురకాలుగాను తర్కించారు. భైరవీబ్రాహ్మణి తన వాగ్వైభవమువల్ల పాండిత్యమువల్ల రామకృష్ణ పరమహంస అవతారపురుషుడని శాస్త్రబద్ధంగా తర్కనైపుణ్యంతో వాదించింది. ఆమెనెవరూ కాదనలేకపోయినారు. ఆ విధంగా ఆ సభ ముగిసింది. దీనివల్ల రామకృష్ణుని కీర్తి మరింతగా కలకత్తా నగరం అంతా వ్యాపించింది. ఈ విధంగా కొంత కాలం గడిచిన తరువాత ఒకసారి అందరూ కలిసి రామకృష్ణులవారి స్వగ్రామానికి వెళ్ళారు. అక్కడ వైభవోపేతంగా కాళీ పూజలు ఏర్పాటు చేయబడ్డాయి.*

*పూజానంతరం సమారాధన జరిగింది. భోజనాలయిన తరువాత భైరవీబ్రాహ్మణి సేవాభావంతో ఎంగిలి విస్తళ్ళను ఎత్తివేసింది. అది చూచిన రామకృష్ణుల మేనల్లుడు హృదయ్ ఆమెను పెద్దగా అవమానకరంగా దూషించాడు. అక్కడ ఉన్న వారి కుటుంబ సభ్యుల పెద్దలు ఆమె చేసిన పనిని గర్హించారు. ఆ సంఘటనంతా చూస్తూ కూడా రామకృష్ణులవారు ఏమీమాట్లాడలేదు. దానితో ఆయన జీవితంలో తన పాత్ర ముగిసిందని, తానిక నిష్క్రమించవలసిన సమయమాసన్నమైనదని గుర్తించింది. అది లోకసహజమే, కలకత్తా వెళ్ళిన తరువాత రామకృష్ణుల వారితో చెప్పి అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయింది. ఆయన కూడా ఉండమని ఏమీ బలవంతం చేయలేదు.*

*అక్కడి నుంచి మళ్ళీ కొద్ది సంవత్సరాల పాటు దేశసంచారం చేస్తూ కాశీకి వెళ్ళి తన చెల్లెలితో పాటు ఆమె కొన్న గృహములో ఉన్నది. అప్పుడప్పుడు త్రైలింగసామిని చూచి ఆయన ఆశీస్సులు తీసుకొంటూ జప ధ్యానములతో కాలం గడపసాగింది. ఇలా ఉండగా రామకృష్ణులవారు కాశీ వస్తున్నారన్న వార్తవచ్చింది. కొద్దిమందితో కలిసి రాగా, వారందరికి తమ ఇంటిలో వసతి ఏర్పాటు చేసింది. రామకృష్ణులు కొన్నాళ్ళు అక్కడ ఉండి, కాశీలో చూడవలసినవి చూచి తరువాత మళ్ళీ కలకత్తా వెళ్ళి పోయినాడు.*

*ఈ విధంగా మరికొంత కాలం గడచిన తరువాత కాళీభక్తు డెవరో వచ్చి దగ్గరలో ఉన్న ఒక ధర్మశాలలో బసచేశారని విని ఆసక్తి కొద్ది దర్శిద్దామని వెళ్ళింది. అక్కడికి వెళ్ళి చూస్తే అతడు సుమారు 30, 35 సంవత్సరాల యువకుడు చిన్న నల్లని గడ్డము కొద్దిగా ఉంగరాలు తిరిగి విరబోసిన కేశపాశములు చామనచాయ శరీరము, తెల్లని వస్త్రాలు ధరించి ఉన్నాడు. లోపలికి వెళ్ళి ఆయనను దర్శించగానే, ఆయన కూర్చున్న చోటుకు వెనకాల నిలువెత్తు చిత్ర పటం ఆమెను ఆకర్షించింది. అందులోని కాళీదేవి అచ్చం అరణ్యాలలో తన గురువైన కాళీయోగి స్థాపించిన మూర్తివలె ఉన్నది. అయితే అక్కడిది విగ్రహం, ఇక్కడిది చిత్రము.*

*తను ఎన్నోచోట్ల కాళీదేవి విగ్రహాలను చూచింది. చిత్రకారులు చిత్రించిన చిత్రాలను చూచింది. కాశీలో శవశివకాళీ మందిరం, అక్కడికి దగ్గరలోని, తారాపీఠములోని కాళి అక్కడికి మరొక వైపున్న కరుణాకాళీ, దయాకాళి తన నెంతో ఆకర్షించినవి. అవి గొప్ప శక్తి కేంద్రాలు. త్రైలింగస్వామి పూజించిన మంగళాకాళి, కీనారాం అర్చించిన హింగుళాకాళి, ఈ కాళీమూర్తులు తనయందు అనుగ్రహం ఎప్పుడూ చూపిస్తునే ఉన్నారు. కానీ ఆమె పూజించిన కళింగారణ్యకాళీ చిత్రం చూడటం ఇదే మెదటిసారి. తన దేవత చిత్రాన్ని ఎవరు గీశారు? ఈయన దగ్గరకు ఎలా వచ్చింది? అందరూ స్వామి అని పిలుస్తున్న ఈ యువకుడు ఎవరు? ఇలా ఆలోచిస్తూ మూతలువడిన కన్నులు తెరిచే సరికి గదిలో ఆ స్వామి, తాను తప్ప ఎవరూలేరు. అందరూ బయటకు వెళ్ళి పోయినారు. సంధ్యా సమయం దాటి చిరుచీకట్లు చిమ్ముతూ, వెలిగించబడిన దీపాలకాంతిలో, ఆ తరుణస్వామి విచిత్ర వ్యక్తిగా భాసిస్తున్నాడు. ఆయనను, ఆ చిత్రంలోని కాళీదేవతను గురించి అడుగుదామని అనుకొంటుండగానే అత డిలా అన్నాడు.*

*యోగి: యోగీశ్వరీ! నీమనస్సులో కల్లోలిత మవుతున్న సందేహాలు నాకు తెలుసు. కాళీ చిత్రాన్ని గురించి తెలుసుకోవాలని అడుగ బోతున్నావు.*
*భైరవి: స్వామీ! నా పేరు మీకు ఎలా తెలుసు. నా మనసులోని ఆలోచనలు మీకు ఎలా తెలిసినవి?*
*యోగి: 50 ఏండ్ల క్రింద బృందావనంలో నా దగ్గరకు వచ్చినపుడు ఇదే ప్రశ్నవేశావు. అప్పుడు నేను, ఏది కావాలంటే అది తెలుసుకోగలను అని చెప్పాను *గుర్తుతెచ్చుకో.*
( విద్వత్కవిగా ప్రసిద్ధిచెంది ఏవో ఉద్యోగాలలో సద్యోగాలలో కొంత కాలం గడిపి దక్షిణదేశంలోని కుర్తాళ సిద్ధేశ్వరీపీఠాధిపతి దగ్గర సన్యాసం తీసుకొని తరువాత దానికి పీఠాధిపతినై ఉన్నసమయంలో ఇప్పటివలెనే మళ్ళీ అప్పుడు నా దగ్గరకు వస్తావు. అప్పటినీ వివరాలు అప్పుడు నీవు తెలుసుకోగలవు. ఇప్పటి వలెనే గుర్తు చేస్తాను. తపస్వినివై, యోగినివై, ప్రకాశింతువుగాక!)*
*యోగి: బృందావనం నుంచి బయలు దేరినపుడు నీకొక మాట చెప్పాను. చిన్నతనంలో బిడ్డను తల్లి చెయ్యిపట్టుకొని నడక నేర్పుతుంది. తరువాత తండ్రి చేయిపట్టుకొని విద్యాశాలకు తీసుకు వెడతాడు. వయసు వచ్చిన తరువాత భర్త, చెయ్యి పట్టుకునిజీవితంలో నడిపిస్తాడు. ఆనాడు నీవు రెండవదశలో ఉన్నావని చెప్పాను. రాబోయే జన్మలలో ఏదశలో నాదగ్గరకు వస్తావో! ఎలా వచ్చినా నిన్ను అనుగ్రహిస్తాను.*
*భైరవి: ధన్యురాలిని, అని స్వామి వారి పాదములకు నమస్కరించింది.*

*( సశేషం )*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 546 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 546 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 111. పుణ్యకీర్తిః, పుణ్యలభ్యా, పుణ్యశ్రవణ కీర్తనా ।*
*పులోమజార్చితా, బంధమోచనీ, బంధురాలకా ॥ 111 ॥ 🍀*

*🌻 546. 'బంధమోచనీ’ - 1 🌻*

*బంధము నుండి విడిపించునది శ్రీమాత అని అర్థము. అవిద్యయే బంధము. తానొకడు ప్రత్యేకముగా నున్నానను కొనుట వలన అవిద్య యేర్పడును. ప్రతివ్యక్తి తన ప్రత్యేకతను పోషించు చుండును. ప్రత్యేక భావము, వేర్పాటుధోరణి యేర్పడుచుండును. అపుడు తన కొరకు జీవించుట యుండును. తత్కారణముగ స్వార్థచింతన పెరుగును. తన ప్రత్యేకతను పోషించుకొనుటలో భాగముగ ఇతరుల యందు హీనభావము కలిగి యుండును. తా ననగా తన పేరు, తన రూపము అనుకొనుచు నిర్వచించు కొనును. అటుపైన తనది, తనవారు అనెడి భావములు ప్రోగు అగును. ఇట్లు మొత్తము చైతన్యముతో, ప్రాణముతో విడిపడి ఒంటరియై జీవిత పోరాటమును సాగించు చుండును. ఇట్టివాని జీవితము నిత్యపోరాటమై నిలచును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 546 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 111. Punyakirtih punyalabhya punyashravana kirtana*
*pulomajarchita bandhamochani bandhuralaka ॥111 ॥ 🌻*

*🌻 546. 'Bandhamochani' - 1 🌻*

*One who frees from bondage is Srimata. Ignorance is the bondage. Ignorance is thinking one is special. Everyone chooses to play their own specialty. A sense of speciality and separateness will prevail. Then he will live for himself. Then selfishness increases. Part of nurturing one's uniqueness is feeling others are inferior. He defines himself by his own name and form. On top of that, feelings of himself and his own begin to grow. Thus, separated from all consciousness and life, he will continue the struggle of life alone. His life will be an eternal struggle.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj

No comments:

Post a Comment