శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 546 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 546 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 546 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 546 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 111. పుణ్యకీర్తిః, పుణ్యలభ్యా, పుణ్యశ్రవణ కీర్తనా ।
పులోమజార్చితా, బంధమోచనీ, బంధురాలకా ॥ 111 ॥ 🍀

🌻 546. 'బంధమోచనీ’ - 1 🌻


బంధము నుండి విడిపించునది శ్రీమాత అని అర్థము. అవిద్యయే బంధము. తానొకడు ప్రత్యేకముగా నున్నానను కొనుట వలన అవిద్య యేర్పడును. ప్రతివ్యక్తి తన ప్రత్యేకతను పోషించు చుండును. ప్రత్యేక భావము, వేర్పాటుధోరణి యేర్పడుచుండును. అపుడు తన కొరకు జీవించుట యుండును. తత్కారణముగ స్వార్థచింతన పెరుగును. తన ప్రత్యేకతను పోషించుకొనుటలో భాగముగ ఇతరుల యందు హీనభావము కలిగి యుండును. తా ననగా తన పేరు, తన రూపము అనుకొనుచు నిర్వచించు కొనును. అటుపైన తనది, తనవారు అనెడి భావములు ప్రోగు అగును. ఇట్లు మొత్తము చైతన్యముతో, ప్రాణముతో విడిపడి ఒంటరియై జీవిత పోరాటమును సాగించు చుండును. ఇట్టివాని జీవితము నిత్యపోరాటమై నిలచును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 546 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 111. Punyakirtih punyalabhya punyashravana kirtana
pulomajarchita bandhamochani bandhuralaka ॥111 ॥ 🌻

🌻 546. 'Bandhamochani' - 1 🌻


One who frees from bondage is Srimata. Ignorance is the bondage. Ignorance is thinking one is special. Everyone chooses to play their own specialty. A sense of speciality and separateness will prevail. Then he will live for himself. Then selfishness increases. Part of nurturing one's uniqueness is feeling others are inferior. He defines himself by his own name and form. On top of that, feelings of himself and his own begin to grow. Thus, separated from all consciousness and life, he will continue the struggle of life alone. His life will be an eternal struggle.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment