శ్రీ శివ మహా పురాణము - 888 / Sri Siva Maha Purana - 888

🌹 . శ్రీ శివ మహా పురాణము - 888 / Sri Siva Maha Purana - 888 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 40 🌴

🌻. శంఖచూడ వధ - 3 🌻


బ్రాహ్మణ భక్తుడు, సత్యవాక్పరిపాలకుడు అగు ఆ దానవ చక్రవర్తి దివ్యమైన, ప్రాణములవలె ప్రియమైన కవచమును ఆ బ్రాహ్మణునకు ఇచ్చివేసెను (19). విష్ణువు ఈ విధముగా మాయను పన్ని శంఖచూడుని నుండి కవచమును గ్రహించి, ఆతని రూపమును దాల్చి తులసి వద్దకు వెళ్లెను (20). మాయాపండితుడు, సర్వసమర్థుడు అగు విష్ణువు దేవకార్యము కొరకై ఆమెతో సంభోగించెను (21).

ఈ సమయములో దానవప్రభుడగు శంఖచూడుడు శంభుని యుద్ధమునకు ఆహ్వానిస్తూ మాటలాడెను. శివుడు శంఖచూడుని వధించుట కొరకై నిప్పులు గ్రక్కే శూలమును చేతబట్టెను (22). శంకరపరమాత్ముని విజయమను పేరు గల ఆ శూలము సర్వదిక్కులను అంతరిక్షమును గొప్ప కాంతులతో ప్రకాశింపజేసెను (23). ఆ శూలము కోటి మధ్యాహ్న సూర్యులతో మరియు ప్రలయకాలాగ్ని జ్వాలలతో పోల్చదగిన కాంతిని కలిగియుండెను. శత్రుసంహారకమగు ఆ శూలము నివారింప శక్యము కానిది మరియు సంహిపశక్యము కానిది. దానిని ప్రయోగించినచో వ్యర్ధమయ్యే ప్రసక్తి లేదు (24).

సర్వబ్రహ్మాండమును సంహరించే శక్తి ఒకచో సమగూడి దానియందు నిహితమై సర్వోత్కృష్టముగా ప్రకాశించుచుండెను. దానిని శివుడు అవలీలగా పట్టుకొనెను (26). వేయి ధనస్సుల పొడుగు, వంద చేతుల వెడల్పు గల ఆ శూలము జీవబ్రహ్మల స్వరూపమును కలిగియుండెను. శాశ్వత స్వరూపమగు ఆ శూలమునకు అది లేదు. (27).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 888 🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bhadwaj

🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 40 🌴

🌻 Śaṅkhacūḍa is slain - 3 🌻


19. On hearing that, the lord of Dānavas, a well wisher of the brahmins and of truthful word handed over the divine armour, his vital breath, to the brahmin.

20. Viṣṇu thus snatched off his armour by means of deception. Then in the guise of Śaṅkhacūḍa Viṣṇu approached Tulasī.

21. Lord Viṣṇu, an expert in wielding magic went there and deposited his semen in her vaginal passage for the protection of gods.

22. In the meantime the lord of Dānavas approached Śiva without the armour. He took up his trident that blazed to slay Śaṅkhacūḍa.

23. That trident, named Vijaya, of Śiva, the great Ātman, shone illuminating heaven and earth.

24. It was as refulgent as a crore midday suns and as fierce as the shooting flame of fire at the time of dissolution. It could neither be prevented nor withstood. It was never ineffective in destroying enemies.

25. It had a fierce halo all round. It was the best of all weapons and missiles. It was unbearable to gods and Asuras. It was terrible to all.

26. In order to annihilate the whole cosmos sportively all brilliance had converged into it.

27. It was a thousand Dhanus in length and a hundred Hastas in width. It was in the form of individual as well as universal soul. It was eternal and uncreated.


Continues....

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment