🌹 22 SEPTEMBER 2024 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు🌹

🍀🌹 22 SEPTEMBER 2024 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు🌹🍀
1) 🌹 ఆత్మ ప్రయాణ రహస్యాలు - 3 భాగం - ఆత్మ ప్రయాణం - భగవంతుడిగా మారడమే లక్ష్యం. 🌹*
2) *🌹 Soul Journey Secrets - Part 3 - The Journey of the Soul - The Ultimate Goal is to Become Divine 🌹 *
3) *🌹 आत्म यात्रा के रहस्य - भाग 3 - आत्मा की यात्रा - परम लक्ष्य है दिव्यता प्राप्त करना 🌹*
4) 🌹. శ్రీమద్భగవద్గీత - 587 / Bhagavad-Gita - 587 🌹
🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 16 / Chapter 16 - The Divine and Demoniac Natures - 16 🌴
5) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 984 / Vishnu Sahasranama Contemplation - 984 🌹
🌻 984. అన్నాదః, अन्नादः, Annādaḥ 🌻
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 562 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 562 - 2 🌹 
🌻 562. 'మోహినీ’ - 2 / 561. 'Mohini' - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 ఆత్మ ప్రయాణ రహస్యాలు - 3 భాగం - ఆత్మ ప్రయాణం - భగవంతుడిగా మారడమే లక్ష్యం. 🌹*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*ఈ పాఠంలో ఆత్మ ప్రయాణం విశేషాలను పరిశీలిస్తూ, జీవితం పుట్టడం, పెరుగుదల, మరణం మాత్రమే కాదని, ఆత్మ శాశ్వతమై భౌతిక పరిమితులను దాటి భగవంతునితో తిరిగి మిళితం కావడమే జీవిత లక్ష్యం అని చెప్పబడింది. ప్రసాద్ భరధ్వాజ గారి ఈ పాఠంలో ధ్యానం, సేవ, మరియు ఆధ్యాత్మిక వృద్ధితో భగవంతునితో ఏకత్వాన్ని సాధించడం అత్యంత ముఖ్యమైన గమ్యంగా పేర్కొనబడింది.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Soul Journey Secrets - Part 3 - The Journey of the Soul - The Ultimate Goal is to Become Divine 🌹*
*✍️ Prasad Bharadwaj*

*In this text, the concept of the soul's journey is explored, explaining that life is not just about birth, growth, and death. The soul is eternal, surpassing material limitations, and its ultimate goal is to reunite with the Divine. Prasad Bharadwaj emphasizes that meditation, service, and spiritual growth are crucial to achieving oneness with God, which is the most important goal in life.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 आत्म यात्रा के रहस्य - भाग 3 - आत्मा की यात्रा - परम लक्ष्य है दिव्यता प्राप्त करना 🌹*
*✍️ प्रसाद भारद्वाज*

*इस पाठ में आत्मा की यात्रा के महत्व पर प्रकाश डाला गया है, जिसमें यह बताया गया है कि जीवन केवल जन्म, वृद्धि और मृत्यु तक सीमित नहीं है। आत्मा शाश्वत है और भौतिक सीमाओं से परे है, इसका अंतिम लक्ष्य ईश्वर से मिलन है। प्रसाद भारद्वाज इस बात पर जोर देते हैं कि ध्यान, सेवा और आध्यात्मिक प्रगति के माध्यम से ईश्वर के साथ एकत्व प्राप्त करना जीवन का सबसे महत्वपूर्ण उद्देश्य है।*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 587 / Bhagavad-Gita - 587 🌹*
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 16 🌴*

*16. అనేకచిత్తవిభ్రాన్తా మోహజాలసమావృతా: |*
*ప్రసక్తా: కామభోగేషు పతన్తి నరకేశుచౌ ||*

*🌷. తాత్పర్యం : అనేక చింతలచే కలతనొందినవారై; మోహజాల మాయావలచే చుట్టబడినవారై అపవిత్రమైన ఇంద్రియ భోగములందు ఆసక్తులై నరకమునందు పడుదురు.*

*🌷. భాష్యము : అసురస్వభావుడు తన ధనార్జన కాంక్షకు హద్దును గాంచడు. అది అపరిమితమైనది. ప్రస్తుతము తనవద్ద ధనమెంతున్నది, దానిని వినియోగించి మరింతగా ధనమునెట్లు వృద్ధిచేయగలననెడి ప్రణాళికలను మాత్రమే అతడు ఆలోచించును. తత్కారణముగా అతడు అధర్మమార్గమున వర్తించుటకును వెరువక నల్లబజారులో కార్యములను సాగించును. భూమి, కుటుంబము, గృహము, ధనసంపత్తులచే మోహితుడైయుండు నాతడు వానిని ఇంకను వృద్ధిచేసికొనవలెననియే యోచించుచుండును. స్వశక్తి పైననే నమ్మకమునుంచు నతడు తాను పొందునదంతయు తన పూర్వ పుణ్యఫలమని ఎరుగడు. వాస్తవమునకు గృహాదులను ప్రోగుచేసికొనుటకు ఈ జన్మమున అతనికి అవకాశమొసగబడినది.*

*వాస్తవమునకు గృహాదులను ప్రోగుచేసికొనుటకు ఈ జన్మమున అతనికి అవకాశమొసగబడినది. అదియంతయు పూర్వకర్మల ఫలమనెడి భావనము అతనికి ఉండదు. తనకున్న ధనమంతయు తన ప్రయత్నము చేతనే లభించినదని అతడు తలపోయును. అనగా అసురస్వభావుడు తన స్వీయయత్నముచే నమ్మునుగాని కర్మసిద్ధాంతమును కాదు. కాని కర్మసిద్ధాంతము ప్రకారము మనుజుడు ఉన్నత కుటుంబమున జన్మించుట, ధనవంతుడగుట, విద్యను పొందుట, సౌందర్యమును కలిగియుండుట యనునవి పూర్వజన్మ పుణ్యకార్యము వలన ఒనగూడును. అయినను ఆసురస్వభావముగలవాడు ఇవన్నియు యాదృచ్చికములనియు మరియు స్వీయసామర్థ్యము వలన కలుగుననియు భావించును. మానవుల యందలి వైవిధ్యము, సౌందర్యము, విద్య మున్నగువాని వెనుకగల పూర్ణ అమరికను వారు గుర్తెరుగజాలరు. తనకు పోటీవచ్చువానిని అట్టి దానవస్వభావుడు తన శత్రువుగా భావించును.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 587 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 16 🌴*

*16. aneka-citta-vibhrāntā moha-jāla-samāvṛtāḥ*
*prasaktāḥ kāma-bhogeṣu patanti narake ’śucau*

*🌷 Translation : Thus perplexed by various anxieties and bound by a network of illusions, they become too strongly attached to sense enjoyment and fall down into hell.*

*🌹 Purport : The demoniac man knows no limit to his desire to acquire money. That is unlimited. He thinks only of how much assessment he has just now and schemes to engage that stock of wealth further and further. For that reason, he does not hesitate to act in any sinful way and so deals in the black market for illegal gratification. He is enamored by the possessions he has already, such as land, family, house and bank balance, and he is always planning to improve them. He believes in his own strength, and he does not know that whatever he is gaining is due to his past good deeds. He is given an opportunity to accumulate such things, but he has no conception of past causes. He simply thinks that all his mass of wealth is due to his own endeavor.*

*A demoniac person believes in the strength of his personal work, not in the law of karma. According to the law of karma, a man takes his birth in a high family, or becomes rich, or very well educated, or very beautiful because of good work in the past. The demoniac think that all these things are accidental and due to the strength of one’s personal ability. They do not sense any arrangement behind all the varieties of people, beauty and education. Anyone who comes into competition with such a demoniac man is his enemy. There are many demoniac people, and each is enemy to the others. This enmity becomes more and more deep – between persons, then between families, then between societies, and at last between nations. Therefore there is constant strife, war and enmity all over the world.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 984 / Vishnu Sahasranama Contemplation - 984 🌹*

*🌻 984. అన్నాదః, अन्नादः, Annādaḥ 🌻*

*ఓం అన్నాయ నమః | ॐ अन्नाय नमः | OM Annāya namaḥ*

అన్నామత్తీత్యతో విష్ణురన్నాద ఇతి కీర్త్యతే ।
సర్వమన్నాదిరూపేణ జగదేతచ్చరాచరమ్ ॥
భోక్తృ భోగ్యాత్మక మేవ నైవాన్యత్ కేశవాదితి ।
దర్శయితు మేవకారః ప్రయుక్తోఽన్వర్ధకోఽత్రహి ॥
కేశవే జగదాత్మకే చ శబ్దః పరమే పుంసి ।
ఏకస్మిన్ సర్వనామ్నాఞ్చ వృత్తిం దర్శయితుం హరౌ ॥

*అన్నమును తిను ప్రాణి. ఇచట శ్లోకమున 'అన్నమన్నాద ఏవ చ' అని చెప్పబడినది. సర్వ జగత్తును అన్న రూపమున భోగ్యరూపమున ఉన్నది. జగద్రూపము ఇదియే అని చెప్పుటకే ఈ 'ఏవ' శబ్దమును ఉచ్చరించుట. 'చ' అనునది అనేకములను ఒకే ఆశ్రయమునందు వర్తింపజేయు సముచ్చయమును తెలుపును. అట్టి 'చ' శబ్దమును ఈ శ్లోకాంతమున ఉచ్చరించుటచే అన్ని నామములును ఏకైక పరమార్థ తత్త్వమగు పరమ పురుషుని యందే వర్తించును.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 984🌹*

*🌻984. Annādaḥ🌻*

*OM Annāya namaḥ*

अन्नामत्तीत्यतो विष्णुरन्नाद इति कीर्त्यते ।
सर्वमन्नादिरूपेण जगदेतच्चराचरम् ॥
भोक्तृ भोग्यात्मक मेव नैवान्यत् केशवादिति ।
दर्शयितु मेवकारः प्रयुक्तोऽन्वर्धकोऽत्रहि ॥
केशवे जगदात्मके च शब्दः परमे पुंसि ।
एकस्मिन् सर्वनाम्नाञ्च वृत्तिं दर्शयितुं हरौ ॥

Annāmattītyato viṣṇurannāda iti kīrtyate,
Sarvamannādirūpeṇa jagadetaccarācaram.
Bhoktr‌ bhogyātmaka meva naivānyat keśavāditi,
Darśayitu mevakāraḥ prayukto’nvardhako’trahi.
Keśave jagadātmake ca śabdaḥ parame puṃsi,
Ekasmin sarvanāmnāñca vr‌ttiṃ darśayituṃ harau.

*He who eats annam. The stanza concludes as 'Annamannāda eva ca.'  Here 'eva' is used to show that the whole world is a consumable as food in the form of the eater and the eaten. 'ca' is used to show that all words can be applied together to One Supreme Person.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
यज्ञभृद्यज्ञकृद्यज्ञी यज्ञभुग्यज्ञसाधनः ।यज्ञान्तकृद्यज्ञगुह्यमनमन्नाद एव च ॥ १०५ ॥
యజ్ఞభృద్యజ్ఞకృద్యజ్ఞీ యజ్ఞభుగ్యజ్ఞసాధనః ।యజ్ఞాన్తకృద్యజ్ఞగుహ్యమనమన్నాద ఏవ చ ॥ 105 ॥
Yajñabhr‌dyajñakr‌dyajñī yajñabhugyajñasādhanaḥ,Yajñāntakr‌dyajñaguhyamanamannāda eva ca ॥ 105 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 562 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 562 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 114. తాంబూల పూరిత ముఖీ, దాడిమీ కుసుమప్రభా ।*
*మృగాక్షీ, మోహినీ, ముఖ్యా, మృడానీ, మిత్రరూపిణీ ॥ 114 ॥ 🍀*

*🌻 562. 'మోహినీ’ - 2 🌻*

*మోహము కలుగుట, మోహము వీడుట శ్రీమాత సంకల్పముగ జరుగును. మాయా మోహములనుండి ఎవ్వరునూ తప్పించుకొనలేరు. కావుననే మహాత్ములు సైతము శ్రీమాత శరణు కోరుదురు. మోహ మత్యంత బలమైనది. అది జీవుని బలవత్తరముగ పశువును తాటితో లాగినట్లు లాగును. త్రిమూర్తులు కూడ మోహమునకు లోబడి సృష్టించు చున్నామని, రక్షించు చున్నామని, తిరోధానము కలిగించు చున్నామని భ్రమ పడుదురు. ఇక సామాన్యుల మాట ఏల? దేహముపై మోహము, తనపై తనకు మోహము, తనది, తన వారు అను మోహము, తిరోగతి మోహము, పదవీ మోహము, కీర్తి మోహము, ధనమోహము, స్త్రీ మోహము, జాతి కుల మత మోహము.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 562 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 114. Tanbulapuritamukhi dadimi kusuma prabha*
*mrugashi mohini mudhya mrudani mitrarupini  ॥114 ॥ 🌻*

*🌻 561. 'Mohini' - 2 🌻*

*The arising of delusion and the dispelling of delusion happen according to the will of Shri Mata. No one can escape the illusion of Maya. Even great souls seek the refuge of Shri Mata because of this. Delusion is extremely powerful; it pulls a living being as forcefully as an animal being dragged by a leash. Even the Trimurtis (Brahma, Vishnu, and Shiva) are subject to delusion, thinking that they are creating, preserving, and dissolving the universe. If that is the case for the gods, what about ordinary people? There is attachment to the body, attachment to oneself, attachment to one’s belongings and loved ones, attachment to status, to fame, to wealth, to women, and even attachment to caste, race, and religion.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
https://www.youtube.com/channel/UC6UB7NB3KJ_CSrdwnokH_NQ
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.threads.net/@prasad.bharadwaj

No comments:

Post a Comment