🌹. శ్రీమద్భగవద్గీత - 587 / Bhagavad-Gita - 587 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 16 🌴
16. అనేకచిత్తవిభ్రాన్తా మోహజాలసమావృతా: |
ప్రసక్తా: కామభోగేషు పతన్తి నరకేశుచౌ ||
🌷. తాత్పర్యం : అనేక చింతలచే కలతనొందినవారై; మోహజాల మాయావలచే చుట్టబడినవారై అపవిత్రమైన ఇంద్రియ భోగములందు ఆసక్తులై నరకమునందు పడుదురు.
🌷. భాష్యము : అసురస్వభావుడు తన ధనార్జన కాంక్షకు హద్దును గాంచడు. అది అపరిమితమైనది. ప్రస్తుతము తనవద్ద ధనమెంతున్నది, దానిని వినియోగించి మరింతగా ధనమునెట్లు వృద్ధిచేయగలననెడి ప్రణాళికలను మాత్రమే అతడు ఆలోచించును. తత్కారణముగా అతడు అధర్మమార్గమున వర్తించుటకును వెరువక నల్లబజారులో కార్యములను సాగించును. భూమి, కుటుంబము, గృహము, ధనసంపత్తులచే మోహితుడైయుండు నాతడు వానిని ఇంకను వృద్ధిచేసికొనవలెననియే యోచించుచుండును. స్వశక్తి పైననే నమ్మకమునుంచు నతడు తాను పొందునదంతయు తన పూర్వ పుణ్యఫలమని ఎరుగడు. వాస్తవమునకు గృహాదులను ప్రోగుచేసికొనుటకు ఈ జన్మమున అతనికి అవకాశమొసగబడినది.
వాస్తవమునకు గృహాదులను ప్రోగుచేసికొనుటకు ఈ జన్మమున అతనికి అవకాశమొసగబడినది. అదియంతయు పూర్వకర్మల ఫలమనెడి భావనము అతనికి ఉండదు. తనకున్న ధనమంతయు తన ప్రయత్నము చేతనే లభించినదని అతడు తలపోయును. అనగా అసురస్వభావుడు తన స్వీయయత్నముచే నమ్మునుగాని కర్మసిద్ధాంతమును కాదు. కాని కర్మసిద్ధాంతము ప్రకారము మనుజుడు ఉన్నత కుటుంబమున జన్మించుట, ధనవంతుడగుట, విద్యను పొందుట, సౌందర్యమును కలిగియుండుట యనునవి పూర్వజన్మ పుణ్యకార్యము వలన ఒనగూడును. అయినను ఆసురస్వభావముగలవాడు ఇవన్నియు యాదృచ్చికములనియు మరియు స్వీయసామర్థ్యము వలన కలుగుననియు భావించును. మానవుల యందలి వైవిధ్యము, సౌందర్యము, విద్య మున్నగువాని వెనుకగల పూర్ణ అమరికను వారు గుర్తెరుగజాలరు. తనకు పోటీవచ్చువానిని అట్టి దానవస్వభావుడు తన శత్రువుగా భావించును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 587 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 16 🌴
16. aneka-citta-vibhrāntā moha-jāla-samāvṛtāḥ
prasaktāḥ kāma-bhogeṣu patanti narake ’śucau
🌷 Translation : Thus perplexed by various anxieties and bound by a network of illusions, they become too strongly attached to sense enjoyment and fall down into hell.
🌹 Purport : The demoniac man knows no limit to his desire to acquire money. That is unlimited. He thinks only of how much assessment he has just now and schemes to engage that stock of wealth further and further. For that reason, he does not hesitate to act in any sinful way and so deals in the black market for illegal gratification. He is enamored by the possessions he has already, such as land, family, house and bank balance, and he is always planning to improve them. He believes in his own strength, and he does not know that whatever he is gaining is due to his past good deeds. He is given an opportunity to accumulate such things, but he has no conception of past causes. He simply thinks that all his mass of wealth is due to his own endeavor.
A demoniac person believes in the strength of his personal work, not in the law of karma. According to the law of karma, a man takes his birth in a high family, or becomes rich, or very well educated, or very beautiful because of good work in the past. The demoniac think that all these things are accidental and due to the strength of one’s personal ability. They do not sense any arrangement behind all the varieties of people, beauty and education. Anyone who comes into competition with such a demoniac man is his enemy. There are many demoniac people, and each is enemy to the others. This enmity becomes more and more deep – between persons, then between families, then between societies, and at last between nations. Therefore there is constant strife, war and enmity all over the world.
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment