శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 562 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 562 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 562 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 562 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 114. తాంబూల పూరిత ముఖీ, దాడిమీ కుసుమప్రభా ।
మృగాక్షీ, మోహినీ, ముఖ్యా, మృడానీ, మిత్రరూపిణీ ॥ 114 ॥ 🍀

🌻 562. 'మోహినీ’ - 2 🌻


మోహము కలుగుట, మోహము వీడుట శ్రీమాత సంకల్పముగ జరుగును. మాయా మోహములనుండి ఎవ్వరునూ తప్పించుకొనలేరు. కావుననే మహాత్ములు సైతము శ్రీమాత శరణు కోరుదురు. మోహ మత్యంత బలమైనది. అది జీవుని బలవత్తరముగ పశువును తాటితో లాగినట్లు లాగును. త్రిమూర్తులు కూడ మోహమునకు లోబడి సృష్టించు చున్నామని, రక్షించు చున్నామని, తిరోధానము కలిగించు చున్నామని భ్రమ పడుదురు. ఇక సామాన్యుల మాట ఏల? దేహముపై మోహము, తనపై తనకు మోహము, తనది, తన వారు అను మోహము, తిరోగతి మోహము, పదవీ మోహము, కీర్తి మోహము, ధనమోహము, స్త్రీ మోహము, జాతి కుల మత మోహము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 562 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 114. Tanbulapuritamukhi dadimi kusuma prabha
mrugashi mohini mudhya mrudani mitrarupini ॥114 ॥ 🌻

🌻 561. 'Mohini' - 2 🌻


The arising of delusion and the dispelling of delusion happen according to the will of Shri Mata. No one can escape the illusion of Maya. Even great souls seek the refuge of Shri Mata because of this. Delusion is extremely powerful; it pulls a living being as forcefully as an animal being dragged by a leash. Even the Trimurtis (Brahma, Vishnu, and Shiva) are subject to delusion, thinking that they are creating, preserving, and dissolving the universe. If that is the case for the gods, what about ordinary people? There is attachment to the body, attachment to oneself, attachment to one’s belongings and loved ones, attachment to status, to fame, to wealth, to women, and even attachment to caste, race, and religion.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment