భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 105



🌹.  భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 105  🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. పిప్పలాద మహర్షి - 7 🌻

39. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే ఆరు శత్రువులు; సమదమాది షట్కసంపత్తి; తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం అనే సుగుణాలు - వాటి యొక్క నిష్ఠనుబట్టి - ఆ దేహాన్ని ఆశ్రయించి ఎప్పుడూ ఉంటాయి.

40. వీటిలో ఏ గుణములు అతడు ఆశ్రయిస్తాడో అటువంటి ఫలాన్నే పొందుతాడు. అంటే శమాది షట్కసంపత్తి, అరిషడ్వర్గము రెండూకూడా దేహమందు సహజంగా ఉంటాయి.

41. ఈ జీవుడు దేనిని వాడుకుని దేనిని ఆశ్రయిస్తాడో, తన దేహమదుండే ఆ వస్తువులను బట్టి అతడు ఫలం పొందుతాడు. ఇన్ని విషయాలు చెప్పనక్కరలేదు. ఒక్కటే మార్గం ఉంది.

42. నీలో ఆరు దుర్గుణాలు, ఆరు సుగుణాలు ఉన్నాయి. నువ్వు దేనిని ఆశ్రయిస్తే, నిరంతరం మనిషిజన్మనెత్తుతూ సుఖదుఃఖాలు అనుభవిస్తావు. రెండూ స్వతంత్ర మార్గాలు. ఇందులో ఉండి అందులో వెళ్ళలేడు. అందులో ఉండి ఇందులోకి రాలేడు.

43. “ఇష్టానిష్ట శబ్దములు అనే పేరుతో షడ్జము, ఋషభము, గాంధారము, పంచమము,మధ్యమము, ధైవతము, నిషాదము అని ఉన్నవి. శుక్ల, రక్త, కృష్ణ, ధూమ్ర, కపిల, పాండురములని ఏడుధాతువులున్నాయి. వాటికి వర్ణములున్నవి. రసము నుండి రక్తము, రక్తము నుండి మాంసము, మాంసము నుండి మేదస్సు, మేదస్సు నుంచీ మజ్జ, మజ్జ నుంచీ శుక్లము, ఇవన్నీ కలుగుతాయి” అని చప్పాడు.

44. దుఃఖానికి కారణము జన్మమే అంటారు. ఇది పరమ దుస్సహమైనది అని తెలిసినవాడు జన్మ నివృత్తి కోసం ధర్మాన్నిగాని, యోగజ్ఞానసాధన కాని అవలంబిస్తాయి.

45. అందుకే ఈ జన్మనుగూర్చి, గర్భనరకంలో ఉన్నప్పుడు దుఃఖపడతాడు. ఆ విషయం, ఆ జీవికి గర్భమ్నుండి బయటపది జన్మనెత్తిన తర్వాత ఎప్పుడో, తనుగర్భంలో ఉండి వేదనపడిన విషయం స్మృతిపథానికి వచ్చి, మోక్షమందు తీవ్రమైన ఇచ్చ కలుగుతుంది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

08.Sep.2020

No comments:

Post a Comment