🌹. శివగీత - 56 / The Siva-Gita - 56 🌹
🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ
ఎనిమిదో అధ్యాయము
🌻. గర్భో త్పత్త్యాది కథనము -2 🌻
మానసస్తు పరః దేవానామేవ సస్మృతః
తత్ర వక్ష్యే ప్రథమతః - ప్రధానత్వా జ్జరా యుజమ్ 4
శుక్ర శోణిత సంభూత - వృత్తిరేవ జరాయుజః
స్త్రీణాం గర్భాశయే శుక్ర - మృతుకాలే విశేద్యదా 5
రాజసా యోషితో యుక్తం - తదేవ స్యా జ్జరా యుజమ్,
బాహులాద్ర జసః స్త్రీ స్యా - చ్చుక్రా ధీ క్యే పుమాన్భవేత్ 6
శుక్రశోణిత యోస్సామ్యే - జాయతే థ నపుంసకః
రుతుస్నాటా భవేన్నారీ - చతుర్ధ దివ సేతతః 7
ఋతుకాలస్తు నిర్దిష్ట :- అషోడ శది నావధి,
తత్రాయుగ్మది నే స్త్రీ స్యా - త్పుమా న్యు గ్మది నే భవేత్ 8
పైన వివరించిన దేహముల కంటెను భిన్నమైనది మానస దేహమని మరొకటి కలదు, అది కేవలము దేవతలకు మాత్రమే సంభందించి యున్నది. పురుషార్ధ సాధన, భూతమగుట వలన ప్రధానమైనది. కనుక జరాయుజ దేహహును. మొట్టమొదట వివరించెను, వినుము. శుక్రశోణితము నుండి యుద్భవించినదే జరాయుజ మనబడును.
ఋతు సమయములో స్త్రీ యొక్క గర్భకోశములో శుక్రము ప్రవేశించి స్త్రీ యొక్క శోణితములో కల్పినదైనచో అదే జరాయుజమగును. శుక్రము అధికమైన పురుషుడును, శోణిత మధికమైనచో స్త్రీయును, శుక్ర శోణితముల సమానత్వమున నపుంశక వ్యక్తి జన్మించును. స్త్రీ రుతుస్నాతురాలైనది మొదలుకొని పిదప యారు దినముల వరకు రుతుసమయముగా నిర్దేశింపబడినది.
అందులో అయిదవ దినము మొదలుకొని బేసి దినములు (5 - 7 - 9 - 11 -13 ) ఈ దినములలో రాత్ర భర్త సంగమము కలిగినచో స్త్రీ సంతానమును, స్నానదినము మొదలుకొని సరి దినములు ( 4 - 6 - 8 - 10 - 12 - 14 - 16 ) ఈ సరిదినాల రాత్రులందు భర్త సంగమమేర్పడిన యెడల పురుష సంతానము కల్గును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 The Siva-Gita - 56 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj
Chapter 08 :
🌻 Pindotpatti Kathanam - 2 🌻
There is another body called 'Manasa Deham' different from the aforementioned bodies. That is related and limited to the gods only. Let me first explain you the Jarayoja deham, listen!
The body formed by the union of ‘Shukra’ and ‘Shonita’ (male and female seeds), is known as 'Jaraayujam'. When Shukra enters woman's womb and unites with her Shonitam during the Rutukaalam (fertility period), it creates Jarayujam.
If Shukram becomes excess, male child, if Shonitam becomes excess a female child, and if both remain in equal quantity, a eunuch is born. Starting from the menses period of a female, for next sixteen days is called as 'Rutukaalam' (fertility period).
During this period starting from the fifth day on any odd numbered days (5, 7, 9, 11, and 13) if she unites with her husband during night time, a female child would be born. If a female unites with her husband in night, from the fourth day of menses on any even numbered day (4, 6, 8, 10, 12, 14, 16), she would give birth to a male child.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివగీత #SivaGita
08.Sep.2020
No comments:
Post a Comment