✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
చతుర్ధాధ్యాయం - సూత్రము - 59
🌻 59. ప్రమాణాంతరస్యా నపేక్షత్యాత్ స్వయం ప్రమాణత్వాత్ ॥ 🌻
భక్తిని తెలుసుకోవడానికి స్వయం ప్రమాణమే గాని, ఇతర ప్రమాణాల ఆవశ్యకత ఉండదు. స్వానుభవంలో ఉదయించిన భక్తికి స్వయం ప్రమాణమే సత్యం. ఇతర ప్రమాణాలున్నాా అవి మొదటగా స్వానుభవ ప్రమాణాల ఆధారంగా వచ్చినవే. ఆ విధంగా వచ్చిన ప్రమాణాలు కాకపోతే, ఆ ఇతర ప్రమాణాలకు విలువ లేదు.
శాస్త్ర ప్రమాణం కూడా స్వానుభవజ్ఞుల ద్వారా వచ్చినదే. అందువలన ఏ శాస్తం ముందస్తుగా దానికదే ప్రమాణం కాదు. ఒకవేళ ఆ శాస్తాన్ని ఎవరైనా స్వానుభవం లెకుండా తయారు చేస్తే ఆ శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోవడానికి వీలులేదు.
ఆగమ ప్రమాణం ద్వారా పుట్టిన శాస్త్రం ప్రమాణమే. అప్పుడది సాధకులకు మార్గదర్శకమవుతుంది. సిద్ధ వస్తువు స్వానుభవమే అయినప్పుడు అన్ని శాస్త్రాలు ఆ స్వానుభవం ముంగిట్లో ఆగిపోతాయి.
పైగా సిద్ధ వస్తువు రెండవ దానికి అవకాశమివ్వనిది గావున పోలికగా చెప్పడానికి కూడా ఎ వస్తువు సరిపోదు. అందుకే భగవంతుడు అప్రమేయం, అనుపమానం. సాధకులకు స్వయంవేద్యం. అందువలన ముఖ్యభక్తికి ఇతర ప్రమాణాలుండవు. దానికదే స్వయం ప్రమాణం.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ
08.Sep.2020
No comments:
Post a Comment