15-October-2020 Messages

12) *🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 6 / Sri Devi Mahatyam - Durga Saptasati - 6🌹*
13) 🌹. శివ మహా పురాణము - 248 🌹
14) 🌹 Light On The Path - 6🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 136🌹
16) 🌹 Seeds Of Consciousness - 199 🌹 
17) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 53 📚
18) 🌹. అద్భుత సృష్టి - 55🌹
19) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 38 / Sri Vishnu Sahasranama - 38 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 6 / Sri Devi Mahatyam - Durga Saptasati - 6 🌹*
✍️. మల్లికార్జున శర్మ 
📚. ప్రసాద్ భరద్వాజ 

అధ్యాయము 1
*🌻. మధు కైటభుల వధ వర్ణనము - 6 🌻*

ఋషి పలికెను : మధుకైటభ సంహారార్థమై శ్రీమహావిష్ణును మేల్కొల్పడానికి బ్రహ్మచేత ఈ విధంగా స్తుతింపబడిన ఆ తామసికశక్తి - విష్ణువు యొక్క నేత్రాలు, నాసిక, బాహువులు, హృదయం, వక్షస్థలం నుండి వీడిపోయి అవ్యక్త జన్ముడు (ఎరుక రానట్టి పుట్టుక గలవాడు) అయిన బ్రహ్మకు దర్శనమిచ్చింది. 

ఆమెచేత విడువబడి జగన్నాథుడైన జనార్దనుడు ఏకార్ణవంలో తన శేషతల్పం నుండి లేచి బ్రహ్మను మ్రింగివేయ చూస్తున్న దురాత్ములు, అతి వీర్యపరాక్రమవంతులు, కోపంతో రక్తవర్ణం దాల్చిన నేత్రాలు గలవారు అయిన ఆ మధుకైటభులను చూసాడు. లేచి, సర్వవ్యాపియైన విష్ణుభగవానుడు తన చేతులనే ఆయుధాలుగా ఉపయోగించి ఐదువేల సంవత్సరాలు వారితో యుద్ధం చేసెను. 

అంతట వారు బలాతిశయ గర్వంతో మదించి, మహామాయచే సమ్మోహితులై, “మమ్మల్ని ఒక వరం అడుగు” అని విష్ణువుతో అన్నారు. (88–95)

శ్రీభగవానుడు పలికెను: నాపట్ల మీకు సంతుష్టి కలిగితే, మీరు ఇరువురూ ఇప్పుడు నాచేత వధింపబడాలి. ఇక్కడ అస్యపరంతో అక్కలు ఏమిటి? ఇదే నేను కోరే వరం, (96–98)

ఋషి పలికెను : ఇలా మహామాయచే వంచితులైన ఆ ఇరువురు, సర్వం జలమయమై ఉన్న జగత్తును చూసి, కమలాక్షుడైన భగవానునితో “భూమి ఎక్కడ నీటిలో మునిగి ఉండదో ఆ స్థలంలో మమ్మల్ని చంపు” అని చెప్పారు. (99–101)

ఋషి పలికెను . “అలాగే కానివ్వండి" అని చెప్పి శంఖచక్రగదా హస్తుడైన భగవానుడు వారిని తన కటి ప్రదేశం (మొల)పై ఉంచుకొని వారి తలలను తన చక్రంతో ఛేదించివేసెను. (101 - 103)

ఈ విధంగా ఆమె (మహామాయ) బ్రహ్మచే సంస్తుతింపబడి స్వయంగా
ప్రత్యక్షమయ్యింది. ఈ దేవి ప్రభావాన్ని ఇంకా విను, నేను తెలియజేస్తాను. (104) 

ఇది శ్రీమార్కండేయ పురాణమునందలి సావర్ణి మన్వంతరమున
“దేవీమాహత్మ్యము” లో “మధుకైటభవధ” యను పేరిటి
ప్రథమాధ్యాయము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Devi Mahatyam - Durga Saptasati - 6 🌹*
✍️. P. R. Ramachander
📚 Prasad Bharadwaj

Chapter 1
*🌻 Description of Killing of Madhu and Kaidabha - 6 🌻*

 88-95. There, the Devi of delusion extolled thus by Brahma, the creator, in order to awaken Vishnu for the destruction of Madhu and Kaitabha, drew herself out from His eyes, mouth, nostrils, arms, heart and breast, and appeared in the sight of Brahma of inscrutable birth. 

Janardana, Lord of the universe, quitted by her, rose up from His couch on the universal ocean, and saw those two evil(asuras), Madhu and Kaitabha, of exceeding heroism and power, with eyes red in anger, endeavoring to devour Brahma. 

Thereupon the all-pervading Bhagavan Vishnu got up and fought with the asuras for five thousand years, using his own arms as weapons. And they, frenzied with their exceeding power, and deluded by Mahamaya, exclaimed to Vishnu, ' Ask a boon from us.' Bhagavan (Vishnu) said:

96-98. 'If you are satisfied with me, you must both be slain by me now. What need is there of any other boon here? My choice is this much indeed.' The Rishi said:

99-101. Those two (asuras), thus bewitched (by Mahamaya), gazing then at the entire world turned into water, told Bhagavan, the lotus eyed One, 'Slay us at the spot where the earth is not flooded with water.' The Rishi said:

102-104. Saying 'Be it so', Bhagavan (Vishnu), the great wielder of conch, discus and mace, took them on His loins and there severed their heads with His discus. 

Thus she (Mahamaya) herself appeared when praised by Brahma. Now listen again the glory of this Devi. I tell you. 

Here ends the first chapter called 'The slaying of Madhu and Kaitabha' of Devi mahatmya in Markandeya purana, during the period of Savarni, the Manu. 

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 248 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
56. అధ్యాయము - 11

*🌻. దుర్గాస్తుతి - 3 🌻*

శివ పరబ్రహ్మ నిర్గుణుడు, నిర్వికారుడు,నేను ఆయనకు సర్వదా దాసిని. నేను అన్ని వేళలా ఆయన యొక్క ఆజ్ఞను పాలించుదానను (36).

ఆ శివుడే పూర్ణాంశతో రుద్రుడను పేర భక్తులనుద్ధరించుట కొరకై అవతరించెను. ఆయన స్వతంత్రుడైన పరమేశ్వరుడు గదా! (37). 

హరికి బ్రహ్మకు ప్రభువగు ఆ రుద్రుడు ఏ విధముగా చూచినా శివుని కంటె తక్కువ గాడు. మాయాతీతుడు, మాయకు ప్రభువు, సర్వము కంటె శ్రేష్ఠుడు అగు ఆయనకు యోగమునందు ప్రేమ అధికము (38). 

అట్టి రుద్రుని సామాన్య దేవతలలో ఒకడి గను,తన పుత్రునిగను తలంచి, అజ్ఞానముచే పూర్తిగా మోహితుడైన ఈ బ్రహ్మ ఆయనను మోహపెట్టవలెనని గోరుచున్నాడు (39). 

ఈతనికి వరము నీయనిచో, వేద ధర్మము పాడగును. నేనేమి చేయవలెను? నా ప్రభువగు మహేశ్వరునకు నాపై కోపమురాని విధముగా చేయవలెను (40).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఇట్లు తలచి ఆ ఉమాదేవి మనస్సులో ఆ మహేశ్వరుని స్మరించెను. అపుడు ఆ దుర్గాదేవి శివుని అనుజ్ఞను పొంది నాతో ఇట్లనెను (41).

దుర్గాదేవి ఇట్లనెను -

బ్రహ్మన్‌! నీవు చెప్పినదంతయూ వాస్తవమే. నేను తక్క మరియొకరు శంకరుని మోహింపజేయలేరు (42). శివుడు భార్యను స్వీకరించనిదే ఈ సనాతనమగు సృష్టి పూర్ణము కాబోదని నీవు చేసిన ప్రతి పాదన వాస్తవము (43). 

ఆ మహాప్రభూవును మోహపెట్టగలననే విశ్వాసము నాకు కూడ లేకుండెను. కాని నా విశ్వాసము నీ మాటలను వినుటచే రెట్టింపు అయ్యెను. ఇపుడు నేను దృఢముగా యత్నించెదను (44). 

హే బ్రహ్మన్‌! శివుడు విమోహితుడై స్వయముగా భార్యను స్వీకరించునట్లు నేను ప్రయత్నించెదను (45).

నేను సతీదేవి రూపమును ధరించి, మహాపతివ్రతయగు లక్ష్మి విష్ణునకు ప్రియురాలు అయిన తీరున, ఆయనకు వశవర్తిని కాగలను (46). హే బ్రహ్మన్‌! ఆయన అనుగ్రహమును పొంది, ఆయన నాకు సర్వదా అధీనుడై యుండునట్లు కూడ ప్రయత్నించెదను (47). 

హే పితామహా! నేను దక్షుని భార్య యందు సతీదేవి రూపముతో జన్మించి నా లీలతో శంకరుని సంతోషపెట్టెదను (48). ఇతర మానవులు స్త్రీకి వశవర్తులై ఉన్న తీరుగనే, ఆ హరుడు నా భక్తికి మెచ్చి నాకు వశవర్తియై ఉండగలడు (49).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ వత్సా! జగన్మాతయగు ఆ ఉమాదేవి నాతో నిట్లు పలికి, తరువాత నేను చూచుచుండగనే అచటనే అంతర్ధానమయ్యెను (50). 

లోకములకు పితామహుడనగు నేను ఆమె అంతర్ధానము కాగానే, నా కుమారులు ఉన్నచోటకు వెళ్లి, జరిగిన వృత్తాంతమునంతనూ వర్ణించితిని (51).

శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు సతీఖండములో దుర్గాస్తుతి - బ్రహ్మవరప్రాప్తి అనే పదకొండవ అధ్యాయము ముగిసినది (11).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 LIGHT ON THE PATH - 6 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

*🌻 1. BEFORE THE EYES CAN SEE THEY MUST BE IN CAPABLE OF TEARS - 6 🌻* 

43. C.W.L. – Our President has explained with regard to the first four statements in this book, beginning “Before the eyes can see they must be incapable of tears,” that they may be taken in quite a wrong way, and are then as acceptable to the black magician as to ourselves. 

He would understand them to mean that he must kill out all feeling, build himself into a shell and shut the sorrows and the troubles of the world outside it.

That is exactly the opposite of the teaching given to the pupil on the white path, who is taught to increase his power of feeling until he attains perfect sympathy with the sufferings of his fellow-men.

44. We hear a good deal about the black magicians, but I fancy that few people know much about them. 

I have met many specimens of the genus, and can therefore claim to know something of their nature and methods. Some of them are very interesting people, but by no means desirable acquaintances. There are many different types who are classed under the general title of black magician. 

For instance, the negroes in South Africa and in the West Indies, and probably the aborigines of Australia, practise a good deal of petty black magic. It is a very poor thing; even they themselves admit that it does not work on white people. 

One has heard of certain cases in which they have succeeded in making white people exceedingly uncomfortable, but one must add that it was made possible by the kind of life those people led. 

Such magic depends for its success largely upon the fear of the people upon whom the incantations are laid, yet it is a real enough thing in its feeble way. These primitive people have certain drugs, they know how to hypnotize, and they have power over some low-class earth-spirits and similar entities. 

They contrive to cause sickness to a man, or in his family, or among his flocks and herds, or to blast his gardens and fields so that they will not bear crops; though in the latter case they are not above aiding their magic sometimes by saltpetre as well.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 136 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. నారద మహర్షి - 10 🌻*

76. సంసార మార్గంలో ప్రవేశించి, దానిని తరించి, దాంట్లోంచి బ్రహ్మజ్ఞానివైతే మంచిది. అంటే ప్రవృత్తిలోంచి నివృత్తిమార్గంలోకి వెళ్ళవచ్చు. నివృత్తిలో ఉన్నవాడు ప్రవృత్తిలో పడితే అది పతనం. నిత్యకర్మానుష్టానము, వైదిక కర్మానుష్టానము జాగ్రత్తగా నడిపించుకుంటూ గృహస్థధర్మాన్ని సరిగా పాలించుకుంటూ ఉంటే, దానిని ధర్మమార్గం అంటారు. పతనానికి హేతువు అందులో లేదు. 

77. ధర్మమందు నిష్ఠకలిగినవాడికి పతనముండదు కాబటి, అది క్షేమకరమైన మార్గంగా చెబుతున్నారు. వైరాగ్యం కంటే గొప్పదని కాదుకాని, వైరాగ్యమందు ప్రమాదం సంభవిచవచ్చు. పతనం ఏర్పడవచ్చు. ధర్మానుష్ఠానము, కర్మానుష్ఠానమునందు ధర్మమార్గంలో గృహస్తుడవయితే, అక్కడినుంచీ పైమెట్టుకి వెళ్ళడమే. కాబట్టి సంసారమనేది క్షేమకరమైన మార్గమే!.

78. నారదుడు బ్రహ్మను, “నువ్వు దేవతలందరికీ జ్యేష్ఠుడివి. నీ నుంచి దేవతలందరూ పుట్టారు, మునులు పుట్టారు. ఈ జగత్సృష్టికి అనుసంధాయివి నీవు కదా! కాబట్టి ఈ జగత్తంతా ఏమిటి? ఈ సృష్టి ఎలా చేస్తావు? సృష్టియొక్క లక్షణాలు, గుణదోషాలు ఏవి? దాంట్లో ఉన్న అవలక్షణాలు ఏమిటి? ఎందుకు బాధిస్తుంది? కొందరిని ఎందుకు బాధించలేకపోతున్నది?” అని అడిగాడు.

79. బ్రహ్మ నారదునితో, “కర్మ నశింపచేసేటటువంటిది కాలం. కర్మ దేనివలన నశిస్తుంది? అనుభవం అంటారు కాని, కాలం వలన నశిస్తుంది. ఆ కాలంలో జీవుడి స్థితి అనేది ఉండటంచేత నశిస్తుంది. కాలంలో ఏమీ ఉండదు. కాలంలో స్థితి ఉంటుంది, అందువల్ల కర్మనశిస్తుంది. కాలంలో వచ్చేటటువంటి స్థితికే బంధం అని పేరు” అన్నాడు. 

80. అంటే కాలమందు స్థితిలో ఉన్నాము. అది బంధనము. కారాగారంలో ఉన్నాడు, శిక్షానుభవిస్తున్నాడూ అంటాము, అంటే ఏమిటి? ఏంచేస్తున్నాడు? శిక్ష ఏమిటి? ఏమీలేదు. అక్కడ ఉన్నాడు అంతే. అప్పుడప్పుడు బయటికి తీసుకొస్తారు. మళ్ళీ సాయంత్రం అందులో ప్రవేశపెడతారు. అందులో ఉంటాడు. 

81. ఆ స్థితిని బంధనం అని ఎలా అంటారో, శిక్ష అని ఎలా అంటారో, కాలం అనేటటువంటి వస్తువులో ఏవిధంగా మనుష్యులు ఉనికిని కలిగి ఉంటారో, ఆ విధంగా కర్మక్షయ హేతువైనటువంటిదే కాలము. కర్మక్షయం అయ్యేవరకూ జీవుడు కాలంలో ఉంటాడు. బ్రహ్మ చెప్పిన మాటలివి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు - 53 🌹*
*🍀 13. కర్మ - ప్రతిఫలాసక్తి - ఫలాసక్తి లేకపోవుటే బంధమోచన మార్గము కాని, అదియే రూపమున నున్నను జీవుని బంధించును. ఫలాసక్తి ధన రూపముగను, గుర్తింపు రూపముగను, కీర్తి గౌరవము రూపమునను, ఆధిక్యత రూపమునను జీవుని యందు పొంగుచుండును. 🍀*  
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*📚. కర్మయోగము - 25 📚*

తెలిసినవారు ఫలాసక్తి లేనివారై, లోక కళ్యాణమును నెరవేర్ప సంకల్పము గలవారై కర్మలను నిర్వర్తించవలెను. ఫలాసక్తి గలవారు పట్టుదలతో, శ్రద్ధతో, దీక్షతో అహర్నిశలు ఫలముల నాశించి నిర్విరామముగ కృషి సల్పుదురు. 

25. సక్తాః కర్మణ్యవిద్వాంసో యథా కుర్వంతి భారత |
కుర్యాద్విద్వాంస్తథాసక్తశ్చికీర్షుర్లోకసంగ్రహమ్ || 25 ||

ఫలాసక్తి లేనివారు అట్టి పట్టుదల, శ్రద్ధ, దీక్ష, ఏకాగ్రత, ఓర్పు కలిగి యుండరు. ఫలము నందాసక్తి లేదు గనుక పనియందు గూడ ఆసక్తి లేకపోవుట మనస్సు ధర్మము. 

వేతనములేని పని మనస్సునకు రుచింపదు. తృణమో, పణమో లభించకుండ పనిచేయవలె నన్నచో నిర్విరామ కృషియుండదు. శ్రద్ధ ఉండదు. దీక్ష, పట్టుదల ఉండదు. ఇది లోక సహజము.

చిన్నపిల్లవాడు భోజనము చేయుటకు ఆశ కలిగింతురు. చదువుకొనుటకు చాక్లెట్లు, బిస్కెట్లువంటి ఆశ కల్పింతురు. ఏ పని చేయవలెనన్నను కూలివానివలె మనస్సు, పారితోషికము నాశించును. 

ఈ మనోస్థితి నుండి బుద్ధిలోకములోకి పెరగనిచో వివిధములైన ఆశలు పెనుభూతములై, జీవితమున బంధములు పెరుగుట, జీవుడు వివశుడై దుర్గతి చెందుట జరుగును. చిన్నపిల్లలు ఆశకు లోబడుదురు. చిన్నపిల్లలనగా పరిణతి చెందని వారు. 

వారికి ధర్మ స్వరూపము, కర్మ స్వరూపము ఇంకనూ తెలియదు. ముందు శ్లోకములలో తెలిపిన విధముగ, కర్మ, ధర్మ స్వరూపముల నెరిగినవాడు ఏమి చేయవలెను? వాని ననుసరించుటయే బంధమోచన మార్గమని తెలిసి అనుసరించవలెను. అనుసరించినపుడు తమ మనోతత్త్వమే తమకు అడ్డుపడు చుండును. 

ఫలముల నాశింపక పనిచేయుట క్రొత్తగా అలవాటు చేసుకొనవలెను. పాత అలవాటు వలన మనసు ఫలితముల నాశించును. అది బలవంతముగ నుండును. క్రొత్త అలవాటునకు అంత బలముండదు. అందుచే ఫలాసక్తి లేక పనులు చేయవలె నన్నచో మనసు నిరసించును. అశ్రద్ధ చూపును. దీక్ష, పట్టుదల ఉండవు. నిర్లక్ష్యభావము, అహంభావము పెరుగును. ఇది ఎప్పటికప్పుడు నిర్మూలించుకొనుచు, పై తెలిపిన సద్గుణములతో ఫలాసక్తిని విడచి పనిచేయుట శ్రీకృష్ణుడు తెలుపుచున్నాడు. 

ఫలాసక్తి లేకపోవుటే బంధమోచన మార్గముకాని, అదియే రూపమున నున్నను జీవుని బంధించును. ఫలాసక్తి ధన రూపముగను, గుర్తింపు రూపముగను, కీర్తి గౌరవము రూపమునను, ఆధిక్యత రూపమునను జీవుని యందు పొంగుచుండును. 

దాని నెప్పటి కప్పుడు నిర్మూలించుకొనుచు, అత్యంత ఆసక్తి కలవానివలె కర్మల నాచరించవలెనని భగవంతుడు తెలుపుచున్నాడు. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 


*🌹 Seeds Of Consciousness - 199 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 48. Sitting quietly, being one with the knowledge ‘I am’, you would lose all concern with the world, then the ‘I am’ would also go, leaving you as the Absolute. 🌻* 

You have gone so far away from the primary ‘I am’ that you find it almost impossible to extradite yourself from the conceptual jungle that you are trapped in.  

Most of us are so deeply enmeshed in this world that there is no time to even think of all this. 

Only those who are sensitive and observant or have faced a crisis in life makes one realize the futility of it all. Thus  begins the quest of your true identity and the meaning of life. 

The Guru’s advice is very simple, you have to first understand the ‘I am’ as the primary concept and root of all the trouble. Then you have to sit quietly and become one with knowledge ‘I am’, as you do so you would lose all concern with the world.  

Then, quite spontaneously, if you have been earnest in your abidance, the ‘I am’ would drop off leaving you free as the Absolute.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. అద్భుత సృష్టి - 55 🌹*
 ✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. యాక్టివేషన్ జరిగేటప్పుడు మనలో వచ్చే మార్పులు - 5 🌻*
          
🌟. *9వ లెవెల్:-*

5వ డైమెన్షనల్ లైట్ బాడీని, 6వ డైమెన్షనల్ బ్లూప్రింట్ అయిన జ్యామితీయ సిస్టమ్ ను డీ- కోడ్ చేయగలుగుతాము. దీని ద్వారా కొత్త టెంప్లేట్స్ మార్చి కాంతి భాషను ఉపయోగిస్తాం.

✨. శక్తి క్షేత్రాలు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి మరింతగా విశ్వమూలంతో కలుస్తూ ఉంటాం. భౌతికమైన విషయాలతో, వ్యక్తులతో డిటాచ్ మెంట్ వస్తూ ఉంటుంది.

✨. వభజన, పరిమితి అనే భావాలను తొలగిస్తూ ఉంటాం. కోరికలను విడుదల చేస్తూ నిజమైన స్వేచ్ఛ వైపు ప్రయాణం సాగిస్తాం.
9వ స్థాయి కాంతి దేహం అసెన్షన్ అనేది భౌతిక దేహంలో చూస్తాం. మనం దైవిక యొక్క శక్తులుగా మారుతాం.(భగవంతుని ప్రతినిధులుగా)

✨. 9 వ స్థాయి అనేది భ్రమలను తొలగించుకుని స్వేచ్ఛ వైపు ప్రయాణిస్తూ, మరింత పారవశ్యంలో స్వేచ్ఛా సంకల్పాలను పొందుతూ ఆత్మనుండి మార్గదర్శకత్వాన్ని పొందుతాం. మనుగడ భయాలు నశిస్తాయి. అవి తలెత్తినప్పటికీ అవాస్తవాలు అని వదిలేస్తూ ఉంటాం.

✨. 9 వ స్థాయి ముగిసే సమయానికి పాతభావాలన్నీ తొలగించబడి *"ఐయామ్ ప్రెజెన్స్"* లో కలుస్తాం. జ్యామితి యొక్క అధిక స్థాయిలను అర్థం చేసుకుంటూ.. దైవత్వం స్థాయికి ఎదగటం ప్రారంభిస్తాం. ఒక్కొక్కసారి శరీరం పెరుగుతున్నట్లు, తగ్గుతున్నట్లు అనిపిస్తుంది. ఇలాంటి మార్పులు శరీరంలో ఎన్నో జరుగుతాయి.

🌟 *10వ లెవెల్:-*

2వ ప్రోగు DNA నుండి 12వ ప్రోగుల DNA స్థాయికి ఎదుగుతాం. మూలం యొక్క స్పృహ అధికమవుతుంది. మనలో *"టెలీపోర్టేషన్"* అనేది మొదలవుతుంది.

✨. మర్కాబా(లైట్ బాడీ కి పేరు) నిర్మింపబడుతుంది. ఇది ఇతర పరిధులలోకి, డైమెన్షన్ లోకి వెళ్ళడానికి సహాయపడుతుంది. మనకు మార్గదర్శకత్వం వహించడానికి మన స్పృహ మనకు సహాయం చేస్తుంది. మనం మూలంతో కనెక్ట్ అవుతాం. మనమే గ్రేట్ స్పిరిచ్యువల్ మాస్టర్ గా మరి అవతార్ గా ఎదిగే అవగాహన కలుగుతుంది. మెర్కాబాను యాక్టివేట్ చేయడం వలన టైం, స్పేస్, డైమెన్షనల్ స్థాయిని దాటడం జరుగుతుంది.

🌟 *11వ లెవెల్:-*

లైట్ బాడీ యొక్క అన్ని స్థాయిలు నిర్మించబడతాయి మరి సంక్రియం చేయబడతాయి. స్పిన్ పాయింట్స్ (చక్రాస్) ద్వారా భౌతిక శరీరానికి ఈ శక్తిని అందించడం జరుగుతుంది.

✨. మన దేహంలో ఉన్న లైట్ మాట్రిక్స్ యొక్క భౌతిక ఆక్యుపంక్చర్ మెరీడియన్స్ అన్నీ కూడా కాంతిని సంతరించుకుని 3వ పరిధి సర్క్యుటరీ సిస్టమ్ నుండి మన దేహాన్ని 5వ పరిధి సర్క్యులేటరీ సిస్టానికి మారుస్తుంది. సెల్యులార్ సిస్టమ్ లు పునరుద్ధరించబడతాయి.

✨. గతం, వర్తమానం, భవిష్యత్తు ఏకకాలంలోకి తీసుకొని రాబడతాయి. అన్నీ సమాంతరంగా ఉంటాయి.( ఇక్కడ గత కర్మలు, వర్తమాన కర్మలు, భవిష్యత్తు కర్మలు ఏకకాలంలో తీర్చుకుంటూ ఉంటాం.) 
ఆత్మ యొక్క పారవశ్యాన్ని పొందుతూ భూమిపై స్వర్గాన్ని నిర్మిస్తాం.

✨. ఈ స్థితిలో లైట్ యొక్క ద బెస్ట్ టెక్నాలజీని వినియోగిస్తాం. కొత్త కమ్యూనికేషన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. ప్రభుత్వంలో అనేక మార్పులు సంభవించి నూతన సరికొత్త ప్రభుత్వం స్థాపించబడుతుంది. భూమి పైన వనరుల పంపిణీ వ్యవస్థను యాక్సెస్ చేసి సృష్టిస్తాం.

✨. *"స్వర్ణ యుగం"* అనే నూతన సృష్టిని చేస్తాం. దీని కొరకు అందరికీ మనమే ప్రత్యేక శిక్షణను అందిస్తాం. కొత్త శక్తి ప్రసరణ జరిగి అనేక స్థాయిలలో కాంతి లెవెల్స్ పెంచబడతాయి. భగవంతునితో కలిసి పనిచేయడం ప్రారంభిస్తాం. దేవుడు వేరు మనం వేరు కాదని తెలుస్తుంది .
భూమి మీద స్వర్గం నిర్మించడంలో దృష్టిని సారిస్తారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 38 / Sri Vishnu Sahasra Namavali - 38 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*

*సింహ రాశి- మఖ నక్షత్ర 2వ పాద శ్లోకం* 

*38. పద్మనాభోరవిన్దాక్షః పద్మగర్భశ్శరీరభృత్।*
*మహర్థి ఋద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః ||*

అర్ధము :
🍀. పద్మనాభః - 
నాభి యందు పద్మము కలవాడు.

🍀. అరవిందాక్షః - 
కమల రేకుల వంటి కన్నులు కలవాడు.

🍀. పద్మగర్భః - 
పద్మగర్భమున వసించువాడు.

🍀. శరీరభృత్ - 
జీవుల శరీరములను సంరక్షించువాడు.

🍀. మహార్ధి - 
విశేషమైన విభూతులు కలవాడు.

🍀. ఋద్ధః - 
విశ్వరూపమున ప్రకటితమగువాడు.

🍀. వృద్ధాత్మా - 
సృష్టికి కారణభూతుడు.

🍀. మహాక్షః - 
విశేషమైన కన్నులు కలవాడు, సర్వమూ చూచువాడు.

🍀. గరుడధ్వజః - 
తన వాహనమైన గురుత్మంతుణ్ణి తన పతాకచిహ్నముగా చేసుకున్నవాడు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 38 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*

*Sloka for Simha Rasi, Makha 2nd Padam*

*🌻 38. padma nābhō ravindākṣaḥ padmagarbhaḥ śarīrabhṛt |*
*maharddhir ṛddhō vṛddhātmā mahākṣō garuḍadhvajaḥ || 38 ||*

🌻 Padma-nābhaḥ: 
One who resides in the Nabhi or the central part of the heart-lotus.

🌻 Aravindākṣaḥ: 
One whose eyes resemble Aravinda or the Lotus.

🌻 Padma-garbhaḥ: 
One who is fit to be worshipped in the middle of the heart-lotus.

🌻 Śarīra-bhṛt: 
One who supports the bodies of beings, strengthening them in the form of Anna (Food) and Prana.

🌻 Mahardhi: 
One who has enormous Ruddhi or prosperity.

 🌻 Ṛddhaḥ: 
One who is seen as standing in the form of the world.

🌻 Vṛddhātmā: 
One whose Atma or body is Vruddha or ancient.

🌻 Mahākṣaḥ: 
One who has got two or many glorious eyes.

🌻 Garuḍa-dhvajaḥ: 
One who has got Garuda as his flag.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment