🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻
తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. అభంగ్ - 28 🍀
నామ సంకీర్తన సాధన పై సోపె!
జళతీల పాపె జన్మాంతరీచీ!!
న లగతి సాయాస జావే వనాంతర్!
సుఖే యేతో ఘరా నారాయణ!!
ఠాయీచ్ బైసోని కరా ఏక చిత్త!
ఆవడి అనంత ఆళవావా!!
రామకృష్ణ హరి విఠల కేశవా!
మంత్ర హా జపావా సర్వాకాళ!!
యా వీణ ఆణిక అసతా సాధన!
వాహా తసే ఆణ విఠోబాచి!!
తుకామణె సోపే ఆహె సర్వా హూని!
శాహాణా తో ధణి ఫేతో ఏథే!!
భావము:
సాధసలన్నింటిలోసు నామ సంకీర్తన చాలా సులభము. ఈ నామము జన్మజన్మాంతరాల పాపాలను భస్మము చేయగలదు.
వ్యయప్రయాసలు పడకుండానే అడవుల యందు తిరగనవసరము లేకుండానే సుఖ సమేతముగా నారాయణుడే నీ ఇంటికి నడిచి వచ్చును. సుఖాసనముపై స్థిరముగా కూర్చుండి ఏకాగ్ర చిత్తముతో ప్రేమ పూర్వకముగ అనంతుడిని ఆలాపించవలెను.
రామ కృష్ణ హరి.. విళ్లల.. కేశవ అనే ఈ మంత్రమును సర్వకాలముల యందు జపించవలెను.
ఇంతకు మించి ఇతర సాధన ఏదీ లేదని నేను విఠలునిపై ఒట్టు వేసి చెప్పుచున్నాను.
వివేకశీలురు అన్ని మార్గములలోకి సులభమార్గమైన నామ సాధనను చేపట్టి తృప్తి చెందినారని తుకారాం మహారాజ్ తెలిపినాడు.
🌻. నామ సుధ -28 🌻
నామ సంకీర్తన అతి మధురము
సాధనలందు ఇదే సులభము
జన్మాంతరాల పాప సమూహము
భస్మమౌను ఇదియే నిక్కము
పాడుట నీకు కాదు ప్రయాసము
లేదు అడవికి వెళ్లనవసరము
నారాయణుడే సుఖ స్వరూపము
నడిచి వచ్చును ఇంటికి స్వయము
సుఖాసనముపై కూర్చొని ఉండుము
హరిపై నిలుపుము ఏక చిత్తము
ప్రేమ యుక్తముగా ఆలాపించుము
బ్రహ్మానందము అనుభవించుము
రామకృష్ణ హరి విఠల కేశవా
మంత్రము జపించు సర్వకాలము
నాముములోని మహిమ అపారము
వెంటనే ఇచ్చును సుఖాలు సర్వము
దీనికి మించిన ఇతర సాధనము
వెదికి చూసినా లేదు అన్యము
అన్య సాధనలు బహు దూరము
విఠలునిపై ఆన వినుము
అన్నింటికంటే ఇదే సులభము
నిత్యము పాడు వెంటనే నామము
బుద్ధివంతుడవై తీసుకొనుము
తుకారాముడు చెప్పిన నామము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
06 Jan 2021
No comments:
Post a Comment