🌷 ప్రసాద్ భరద్వాజ 🌷
శ్రీ దత్త సంప్రదాయం లో ఈరోజు చాలా విశిష్టత మైన రోజు. శ్రీ ఆనఘూదేవీ సమేత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దర్శనం ఈరోజు 33 కోట్లు దేవతలందరితో పాటు సర్వ జీవ ప్రాణ కోటి కీ ఈరోజే అన్ని లోకాలకీ గురువు శ్రీ గురుడు శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శనం ఇస్తారు. ఈరోజు ఆనఘూదత్తులు తో ఆనఘూష్టమీ వ్రతం చేసుకుంటారు. సర్వ మానవాళికి తన ఆదిగురువు శ్రీ దత్తాత్రేయ స్వామి గృహస్థాశ్రమంలో ఉన్న ఈరూప దర్శనం ఈరోజే.ఈరోజు దత్త స్వామి చాలా ఆనంద డోలికలలో ఉంటారు.ఏవరైనా ఏమైనా కోరుకుంటే ధర్మపరమైన నిర్ణయానికి కట్టుబడి ఇస్తారు శ్రీ ఆనఘూదత్తులు. గృహస్థాశ్రమంలో ఆయన యెక్క కళను చూడాలంటే ఈరోజే. ఇప్పటివరకు సాధకులు కు , భక్తులకు , మునులకు , ఋషులు కు , దేవతలకు, తనలో ఉన్న విభిన్న రూపాల దర్శనాలు తర్వాత ఈరోజు తన లో ఉన్న ఒక గృహస్థాశ్రమంలో ఉన్న ఒక రూపం అన్ని లోకాలకీ ప్రకటితమైన రోజూ ఇది. శ్రీ దత్త పరమాత్మ కీ తెలియని రూపం ,తెలియని బాష , తెలియని విషయాలు లేవు. భావయుక్తంగా మనం ఆయనతో మమైకమై " దత్త దత్తా " అని పిలిచినంతనే స్వామి మన చెంతనే ఉంటారు.వారీ లీలలు ఆమోఘం. శ్రీ దత్త ఒకనోక మన్వంతరంలో మార్గశీర్షమాసంలో పౌర్ణమి తిథి లో జన్మించిన శ్రీ దత్తుడు అంటే సృష్టి ఆవిర్భావం నకు ముందే శ్రీ దత్తుల వారు ఉన్నారు. అప్పటినుంచి సృష్టి కీ మార్గ దర్శనం చేయటం కోరకు పరమాత్మ యే అత్రిఆనసూయా వల్లభుల కోరిక మేరకు వారికీ దత్తం చేసుకుని శ్రీ దత్తునిగా , ఆత్రేయ కుమారుడు కనకన శ్రీ దత్తాత్రేయుడు గా సర్వ సృష్టి ఆదిగురువు అయ్యారు.
వారి కళయైనటువంటి శ్రీ ఆనఘూ దేవి తో కలిసి గృహస్థు గా దర్శనం ఇస్తారు ఈరోజు శ్రీ దత్త స్వామి.
" ఆనఘు ఆనఘూ ఆనఘూయై నమః "
" శ్రీ దత్త భక్తులందరికీ శ్రీ ఆనఘూష్టమీ శుభాకాంక్షలు..💐
No comments:
Post a Comment