🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 171 / Sri Lalitha Chaitanya Vijnanam - 171 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
48. నిష్క్రోధా, క్రోధశమనీ, నిర్లోభా, లోభనాశినీ |
నిఃసంశయా, సంశయఘీ, నిర్భవా, భవనాశినీ ‖ 48 ‖
🌻 171. 'లోభనాశినీ' 🌻
భక్తుల లోభమును నాశనము చేయుది శ్రీదేవి అని అర్ధము.
పిల్లలను సంస్కరించుకొనుట, సరిదిద్దుకొనుట, ఉద్దరించు కొనుట తల్లి సహజ గుణము. శ్రీమాత అపరిమితమగు చైతన్యము. జీవులామె సంతతి. తన పిల్లలను తనంతవారిగ తీర్చిదిద్దవలెనని
ఆమె భావించును. అందుచేత వారి యందలి పరిమితత్వమును తొలగించుటకు ఆమె అనేకానేక ప్రయత్నములను చేయును.
లోభమున్నవాడు. తననారాధించునప్పుడు అతని లోభమును పోగొట్టుటకు ఉపాయములను పన్నును. జీవులను లోభము పరిణతి చెందనీయదు. భక్తుడు పరిణతి చెందుటకై ప్రార్థన చేయునపుడు, ప్రవర్తనయందు దాని కవరోధమగు లోభమును నశింపచేయవలెను కదా! అందువలననే భక్తులు లోభముచే పట్టుబడునప్పుడు వారిని అందుండి రక్షించుటకు వారు లోభమును చెందు విషయమును నష్టము చేయును.
సంపద యందు లోభమున్నచో సంపదను నష్టము చేయును. అట్లే ఇతర విషయములు కూడ. నష్టము జరుగుచున్నపుడు కూడ ఆరాధనయందే నిమగ్నమైయున్న భక్తులకు లోభ నాశనమై ఉధారణ కలుగును. ఉద్ధారణ తదుపరి, మరల నష్టమైనది తిరిగి అనుగ్రహించును. లోభి తనవద్ద చేరినవి తనవనుకొనును. నిజమునకు అవి యన్నియూ శ్రీమాతవే. తనవద్ద ఉంచబడినవే కాని తనవి కావు.
ఆమె వస్తువులను ఆమె ఇచ్చుట, తీసుకొనుట చేయును. మనదగ్గర ఎవరైనా ఒక విలువైన వస్తువు ఉంచినపుడు, అది మనది అనుకొనము కదా! మరల వారు వచ్చి అడిగినపుడు వారి కిత్తుము కదా! ఇవ్వకుండుట లోభము. అట్లే దేహము, సంపద, సంసారము దైవ మేర్పరచినవి. దైవమే గొనినపుడు, బాధపడుట అవివేకము కదా! లోభమునకు కారణము మోహమే. మోహము చేత దైవసంపద మనవద్ద ఉన్నపుడు మనదని భావింతుము. లోభముచేత దానిని పట్టి యుంచుటకు ప్రయత్నింతుము. ఇంద్రు డంతటివాడే లోభము చెందుచుండును. ఇక మానవుల మాట చెప్పనవసరము లేదు.
ఇట్టి లోభమును దాటుటకు శ్రీమాత ఆరాధనము ఎంతయూ ఉపయోగకరము. తాను, తనకున్నది. శ్రీమాత సంపదేనని తెలిసి, శ్రీమాత నాశ్రయించి యుండుట భక్తుల కర్తవ్యము. అనుగ్రహించుట శ్రీదేవి కారుణ్యము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 171 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Lobhanāśinī लोभनाशिनी (171) 🌻
She destroys greed of Her devotees. Kṛṣṇa says “There are three gates leading to the hell – desire, anger and greed. These should be given up, as they lead to the degradation of the soul” (Bhagavad Gīta. XVI.21) and hence She destroys greed of Her devotees.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
06 Jan 2021
No comments:
Post a Comment