భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 140


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 140 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 19 🌻


567. భగవంతునికి మొదటి స్థితియైన పరాత్పర స్థితి, రెండవ స్థితియైన పరమాత్మ స్థితి ద్వారా అనుభవమయ్యెను.

568. సత్యానుభవము వ్యక్తిగతమైనది.

569. సంస్కారములు పోగొట్టుకున్న పూర్ణచైతన్యమే, ఆత్మయొక్క "అహంబ్రహ్మాస్మి" స్థితి యొక్క పరమానుభూతిని అనుభవించగలదు.

570. సప్తమభూమికలోని నాదము, దృష్టి (దర్శనము) వాసనలు దివ్యములు. ఇచ్చట వినుట, చూచుట, వాసనచూచుట అను వృత్తులు లేవు. అతడే శ్రవణ--దర్శన--ఆఘ్రాణములై పోవును.

571.పరమాత్మలో అనంతముగా ఎరుకలేకున్న A స్థితి ,3,4,5,6,7 స్థితుల ద్వారా క్రమముగా 8 వ స్థితి Bలో అనంతమైన ఎరుకను పొందెను.ఇది నిర్గుణ నిరాకార స్థితి.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


06 Jan 2021

No comments:

Post a Comment