భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 201
🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 201 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. దుర్వాసమహర్షి-కందళి - 5 🌻
23. కృష్ణపరమాత్మ పరమధర్మస్వరూపుడు. అందుకనే జగద్గురువు ఆయన. ఆది గురువు. ఈశ్వరుడువచ్చి మొట్టమొదటిసారి మనుష్యులకు సత్యాసత్యవివేకములు బోధించటం అనే పనిని కృష్ణావతారంలో చేసాడు. అంతకు ముందు సాంఖ్యంచెప్పిన కపిలుడూ నారాయణ అవతారమే! వైశ్వానర అవతారంగా కూడా వచ్చిన కపిలుడు మరొకమహర్షిగా ‘సాంఖ్యం’ చెప్పాడు.
24. అయితే కృష్ణుడి బోధలకు, ఆ బోధలకు ఒక పెద్ద తేడా ఉంది. అవన్నీ మోక్షమార్గాన్నిమాత్రమే చెపుతాయి. కృష్ణుడియొక్క బోధ, ఇక్కడ ఎలా జీవించాలి? ఎలా వెళ్ళాలి? అనేదికూడా చెపుతుంది. ఈ లోకంలో అనేక రీతులమార్గాలు! ఈ జీవనవిధానంలో బహుళమైన, అసంఖ్యాకమైన విధి విధానాలున్నాయి, అభిరుచులున్నాయి. అన్నిటికీకూడా వాటివాటి స్థితి ఎక్కడ ఉందో వాటి హద్దులేమిటో ఆయన చెప్పాడు.
25. లోకాన్నిగురించి చెప్పినవాడు కృష్ణుడు. లోకాన్ని వదిలిపెట్టటానికి మార్గాన్ని చూపించినవాళ్ళు ఇతరమహాత్ములు, అవతారపురుషులు. ఎలా జీవించటమో చెప్పటమే గురువు యొక్క లక్షణము. ఎలా వదిలిపెట్టాలో చెప్పటంకూడా ఆయన లక్షణమే. ఏకకాలంలో ఇవిరెండూ చెప్పినటువంటి పరమాత్మ-ఆదిగురువు ఆయన ఒక్కడే. నేటికీ పరమగురువు ఆయన తప్ప వేరే లేనేలేరు. అందుకే ఈనాటికీ ఆయనే జగద్గురువు. ఏగుణాన్నయినా ఆశ్రయించ దలుచుకుంటే కృష్ణుణ్ణే తలచుకోవాలి.
26. కాలంలో ఉండే వస్తువులను చూస్తాం. ఉన్న వస్తువులనే చూస్తాము. కాల గర్భంలో ఏమున్నదో తెలియదు. మన భవిష్యత్తు తెలియదు. మన యోగక్షేమాలు మనకు తెలియవు. రేపు ఎవరుపుట్టబోతున్నరో, మనం ఏం చేస్తామో, వాడెమిచేస్తాడో తెలియదు.
27. కాలస్వరూపమయిన పరమేశ్వరుడు తన నిజస్వరూపాన్ని-లౌకికమయిన నిజస్వరూపాన్ని-కాల స్వరూపాన్ని-అర్జునుడికి చూపించాడు. కాలస్వరూపాన్ని చూపించటమే తప్ప, అతడికి ఏవో అధికమయిన వరాలు ఇవ్వటం తన విధి కాదు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
06 Jan 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment