గీతోపనిషత్తు -116


🌹. గీతోపనిషత్తు -116 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాసయోగము 📚

🍀. ముఖ్య సూత్రములు - 4 🍀


16. అట్టివానికి బ్రహ్మమునందే అక్షయమగు సుఖానుభూతి యున్నది. అతడు బాహ్యస్పర్శలతో బంధము లేనివాడై యుండును.

17. బాహ్యస్పర్శ యందుగల సుఖములకు ఆది, అంతము గలవు. భోగ దుఃఖములు గలవు. దివ్య స్మరణమున నిలచినవారు అట్టి ఆద్యంతములు గల సుఖమున యిమడక శాశ్వత సుఖమున నిలతురు.

18. అట్టివానికి శరీర మున్నను లేకున్నను ఒకటియే.

19. సమ్యగ్ న్యాసమున బ్రహ్మమును స్పందన యందు నిరంతరము భావించు యోగికి అంతరంగమున సుఖము, విరామము, జ్యోతిదర్శనము కలుగుచు తనను మరచిన స్థితి ఏర్పడును.

20. పై స్థితి లభించిన సన్న్యాసులు కేవలము కనులు మూసు కొనియే కాలము గడుపరు. సర్వజీవులకు హితము కలిగించుటయం దాసక్తి కలిగి జీవించు చుందురు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


06 Jan 2021

No comments:

Post a Comment