శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 212 / Sri Lalitha Chaitanya Vijnanam - 212


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 212 / Sri Lalitha Chaitanya Vijnanam - 212 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము 

మహారూపా, మహాపూజ్యా, మహాపాతక నాశినీ |
మహామాయా, మహాసత్త్వా, మహాశక్తి ర్మహారతిః ‖ 54 ‖


🌻 212. 'మహారూపా' 🌻

గొప్ప రూపము కలది, శ్రేష్ఠమైన రూపము గలది అని అర్థము.

శ్రీమాత పరతత్త్వమునకు ప్రథమ రూపము. అవ్యక్తమగు పరతత్త్వము రూపముగొనుట మూలప్రకృతి మూలముననే. అవ్యక్తము వ్యక్తమగుట శ్రీమాత కార్యమే కనుక ఆమెదే ప్రధాన రూపము. ఆమె కారణముగనే ప్రధాన పురుషుడేర్పడును. ఏ లోకమునందు గల రూపమైనను ఆమె కారణముగనే ఏర్పడుచున్నది. ఆమె విశ్వరూప.

సృష్టియందు ప్రధానముగ వ్యక్తమగునవి కాలము, ప్రకృతి. ఈ రెండునూ పరతత్త్వము నుండి వ్యక్తమగును. కాలమునకు రూపము లేదు, ప్రకృతికే రూపము కలదు. కావున ఆమెను మహారూప అని సంబోధింతురు. కాలమును మహాకాలుడని సంబోధింతురు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 212 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Mahā-rūpā महारूपा (212) 🌻

She has a great form. It is to be observed that all these nāma-s begin with Mahā indicating Her Supreme stature. Kṛṣṇa explains this Supreme form as “The total material substance called Brahman is the source of birth and it is that Brahman that I impregnate, making possible the births of all living beings’ (Bhagavad Gīta. XIV.3).

Muṇḍaka Upaniṣad (I.i.9) says, “tasmadetadbrahma nāma rūpamannaṃ ca jāyate”, which means from that Brahman (parā Brahman) this Brahman (aparā) with name, form, food emerge.’ ‘She has this kind of mahat’form. This supreme mahat form is the cause for creation.

Mahat means abundance. It also refers to the buddhi, or Intellect, or the intellectual principle. (according to the Sāṃkhya philosophy the second of the twenty three principles produced from Prakṛti and so called, as the great source of ahaṃkāra, 'self-consciousness' (ego), and manas, 'the mind'.)

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


17 Feb 2021

No comments:

Post a Comment