చేయాల్సింది చేయకనే అసహనం
🌹. చేయాల్సింది చేయకనే అసహనం 🌹
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
✍️. భరత్, 📚. ప్రసాద్ భరద్వాజ
‘‘నాతో విసిగిపోయిన నేను నిస్సారమని తెలుసుకున్నాను... ఇప్పుడేం చెయ్యాలి?’’ అని నన్ను అడిగావు. అది ఒక గొప్ప ఆవిష్కరణ. అవును, నా భావన అదే. చాలా కొద్దిమంది మాత్రమే తాము చాలా విసిగిపోయామని తెలుసుకుంటారు. అది శుభారంభమే. తమ గురించి తప్ప, అది అందరికీ తెలుసు. ఇప్పుడు మనం కొన్ని అంతర్భావాలను అర్థం చేసుకోవాలి.
చిరాకుపడుతూ విసుక్కునే ఏకైక జంతువు కేవలం మనిషి మాత్రమే. అది మనిషికున్న ఒక గొప్ప ప్రత్యేకమైన హక్కు, మనుషులు ప్రదర్శించే దర్జాలో ఒక భాగం. విసుక్కునే గాడిదలను, దున్నపోతులను మీరెప్పుడైనా చూశారా? అవి ఎప్పుడూ విసుక్కోవు. విసుగు అంటే మీరు జీవించే తీరు సరిగాలేదని అర్థం. ‘‘నాకు చాలా విసుగ్గా ఉంది. అది పోవాలంటే ఏదో ఒకటి చెయ్యాలి’’ అనుకుంటూ మీరు ఏదో ఒకటి చేస్తారు. చివరికి అది ఒక గొప్ప సంఘటనగా మారవచ్చు.
కాబట్టి, మీ విసుగును తప్పుగా భావించకండి. చక్కని శుభారంభానికి అది ఒక మంచి సంకేతం. కానీ, అక్కడే ఆగిపోకండి. ఎవరైనా ఎందుకు విసుక్కుంటారు? ఇతరులు మోపిన మృత విధానాలలో జీవిస్తున్న ఎవరికైనా విసుగ్గానే ఉంటుంది. వాటిని త్యజించి బయటపడి మీకు మీరుగా జీవించడం ప్రారంభించండి.
అంతర్గతంగా మీరు చెయ్యాలనుకున్నది ముఖ్యం కానీ, డబ్బు, అధికారం, ప్రతిష్ఠలు ముఖ్యం కాదు. కాబట్టి, ఫలితాల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా మీరు చెయ్యాలనుకున్నది చెయ్యండి. అప్పుడే మీ విసుగు పోతుంది. ఇతరుల అభిప్రాయాల ప్రకారం మీరు కూడా వారిలాగే అన్నీ సరిగా చెయ్యాలి. అదే మీ విసుగుకు మూల కారణం.
మనుషులందరూ చిరాకు పడుతున్నారు. ఎందుకంటే, మార్మికుడుగా ఉండవలసిన వ్యక్తి గణిత శాస్తవ్రేత్తగా, గణిత శాస్తవ్రేత్తగా ఉండవలసిన వ్యక్తి రాజకీయ నాయకుడుగా, కవిగా ఉండవలసిన వ్యక్తి వ్యాపారవేత్తగా ఉంటున్నాడు. ఇలా అందరూ ఎక్కడో ఉంటున్నారే కానీ, ఎవరూ తమకు తాముగా లేరు. కాబట్టి, ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నప్పుడే మీ చిరాకు అదృశ్యమవుతుంది.
‘‘నాతో విసిగిపోయిన నేను నిస్సారమని తెలుసుకున్నాను... ఇప్పుడేం చెయ్యాలి?’’ అని నన్ను అడిగావు. నిజమే, నువ్వు నీతో విసిగిపోయావు. ఎందుకంటే, నీపట్ల నువ్వు గౌరవంతో, చిత్తశుద్ధితో, నిజాయితీగా లేవు. అప్పుడు నీ శక్తి నీకెలా తెలుస్తుంది? నువ్వు చెయ్యాలనుకున్నది చేసినప్పుడే- అది ఏదైనా, ఎలాంటిదైనా కావచ్చు- నీలో ఉన్న శక్తి ప్రవహిస్తుంది.
- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹
17 Feb 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment